AP Political Row: అమరావతి పేరు వైయస్సార్ నగరంగా పెట్టుకోమన్న టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ, ఏపీ సీఎం జగన్‌పై పొగడ్తల వర్షం కురిపించిన టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు, చంద్రబాబు 5 ఏళ్లలో ఏం చేసారంటూ విమర్శలు
అయితే ఇవేమి పట్టని టీడీపీ ఎమ్మెల్యే (Guntur West TDP MLA)నేరుగా ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) మీద పొగడ్తల వర్షం కురిపించారు. గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో పాటుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంపు ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ కలయిక తరువాత ఎమ్మెల్యే గిరి (Maddali Giridhara Rao) సీఎంజగన్ ను ప్రశంసలతో ముంచెత్తారు.
Amaravathi, December 30: తెలుగుదేశంపార్టీ(TDP) ఏపీ రాజధాని మార్పు (AP Capital Change) అంశం మీద అధికార పార్టీపై (YSRCP)నివురు గప్పిన నిప్పులా మండిపడుతున్న సంగతి తెలిసిందే.. అయితే ఇవేమి పట్టని టీడీపీ ఎమ్మెల్యే (Guntur West TDP MLA)నేరుగా ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) మీద పొగడ్తల వర్షం కురిపించారు. గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో పాటుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంపు ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ కలయిక తరువాత ఎమ్మెల్యే గిరి (Maddali Giridhara Rao) సీఎంజగన్ ను ప్రశంసలతో ముంచెత్తారు.
ఇకపై ఇసుక నేరుగా మీ ఇంటికే, ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం
సీఎం కార్యదీక్ష, పట్టుదల కలిగిన వ్యక్తి అని పొగిడారు. జగన్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై కూడా ఆయన ప్రసంశలు కురిపించారు. తన నియోజకవర్గ సమస్యలపై సీఎంను కలిశానని... గుంటూరులో అధ్వాన్నంగా ఉన్న రోడ్ల పరిస్ధితిని సీఎంకు వివరించాన్నారు. గుంటూరుకు రూ.25 కోట్ల బకాయిలు రిలీజ్ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారని తెలిపారు. రాష్ట్ర పరిస్థితులపై కూడా సీఎంతో చర్చించినట్లు ఆయన చెప్పారు.
మరోసారి సత్తా చాటిన ఏపీ సీఎం,విశాఖ ఉత్సవ్ సీఎం వైయస్ జగన్‌కు ప్లస్సా..మైనస్సా.?
రాబోయే రోజుల్లో రాష్ట్రం ఇండస్ట్రియల్ హబ్‌గా మారుతుందని గిరి జోస్యం చెప్పారు. సీఎం జగన్ ప్రవేశ పెట్టిన ఇంగ్లీషు మీడియం స్కూళ్లకు గిరి మద్దతు తెలిపారు. పేదలు తమ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవాలనుకుంటున్నారని, ఇంగ్లీష్ మీడియం అంశంలో చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని ఆయన తప్పుబట్టారు. ఉగాదిలోగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు.
రాజధాని గురించి మాట్లాడేంత పెద్దవాణ్ణి కానని, రాజధానిపై సీఎం జగన్ కు స్పష్టమైన ఆలోచన ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు ఐదేళ్లలో ఏం చేశారని ఇప్పుడు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు రాజధానిని అభివృధ్ది చేసి ఉఁటే ఈ పరిస్ధితి ఉండేది కాదని, ఐదేళ్లలో కేవలం 5500 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని రాజధాని పూర్తవ్వాలంటే లక్ష కోట్లు అవసరమని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని రగడ హైకోర్టుకు చేరిన వ్యవహారం
ఏది ఏమైనా ఈ కలయికతో టీడీపీ వర్గాల్లో ఇప్పుడు కలవరం మొదలయింది.ఇప్పటికే కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి దూరంగా ఉంటున్నారు. శాసనసభలో తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించి, సీటు కేటాయించాలని స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఇటీవల విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్యే సీఎం జగన్‌ను కలవడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
కావాలని గిరి తెలిపారు.
అమరావతిలో అన్నీ అక్రమాలే జరిగాయన్న ఆర్థికమంత్రి బుగ్గన
జ్యోతుల నెహ్రూ కీలక వ్యాఖ్యలు
ఈ పరిస్థితులు ఇలా ఉంటే రాజధాని మార్పుపై ఆ పార్టీ అధినేత జ్యోతుల నెహ్రూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని పేరు అమరావతి ఇష్టం లేకపోతే.. వైఎస్ఆర్ నగరం అని పేరు మార్చుకోవాలని సీఎం జగన్ కు జ్యోతుల సూచించారు. వైఎస్ఆర్ పేరు పెట్టి రాజధానిని అభివృద్ధి చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ప్రజా రాజధానిని మార్చడం సరికాదని జ్యోతుల అన్నారు.
రాళ్లు పడిన చోటే పూల వర్షం, విశాఖలో ఏపీ సీఎం వైయస్ జగన్‌కి ఘన స్వాగతం
వార్తలపై స్పందించిన బొత్స సత్యనారయణ
రాజధాని అమరావతి నుంచి తరలిస్తారనే వార్తలపై స్పందించిన బొత్స రాజధాని ఎక్కడున్నా మాకు అభ్యంతరం కానీ ఇబ్బంది కానీ లేవని స్పష్టం చేశారు. రూ.లక్ష కోట్లతో అమరావతి అభివృద్ధి అనేది అసాధ్యం అని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలన్నదే జగన్ ప్రభుత్వం లక్ష్యం అని అన్నారు.