Health & Wellness

Coronavirus Precautions: మాస్క్ ధరించండి. ప్రాణాలు కాపాడండి: కరోనా వైరస్ ఆపడానికి సహకరించండి, కోవిడ్-19 నివారణ చర్యల కోసం గూగుల్ డూడుల్ సరికొత్తగా వ్యూయర్స్ ముందుకు..

Hazarath Reddy

మాస్క్ వాడండి.ప్రాణం కాపాడండి, ముఖం కవర్ చేయండి. చేతులు కడుక్కోండి. దూరం పాటించండి.. ఇలాంటి జాగ్రత్తలతో గూగుల్ డూడుల్ ప్రజల్లో అవగాహన కలిగించేందుకు రెడీ అయింది. వాస్తవాలు తెలుసుకోవడం మరియు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మిమ్మల్ని మరియు మీ చుట్టూ ఉండేవారిని సంరక్షించండి. మీ స్థానిక ఆరోగ్య సంస్థ తెలియజేసిన సలహాని పాటించండి. అంటూ గూగుల్ తన డూడుల్ ద్వారా అవగాహన కల్పిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం రేపుతున్న నేపథ్యంలో గూగుల్ తన దాన్ని నియంత్రించడానికి తన వంతు ప్రయత్నంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

COVID-19 Vaccine Update: చైనా నుంచే నవంబర్‌లో వ్యాక్సిన్, నాలుగు టీకాలను అభివృద్ధి చేస్తోన్న డ్రాగన్ కంట్రీ, కొనసాగుతున్న ఫేజ్-3 క్లీనికల్ ట్రయల్స్

Hazarath Reddy

కరోనావైరస్ ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం రేపుతోంది. వుహాన్ నగరంలో కనిపించిన ఈ వైరస్ (Coronavirus Pandemic) యావత్ ప్రపంచానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. వ్యాక్సిన్ తీసుకురావడానికి అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా అభివృద్ధి చేస్తున్న కరోనా టీకాలు (COVID-19 Vaccine Latest News Update) నవంబర్‌లో ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చైనా అంటువ్యాధుల నియంత్రణ సంస్థలోని బయోసేఫ్టీ అధికారి గ్వియ్‌జెన్ వూ తెలిపారు.

COVID-19 Vaccine Update: వికటించిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్, మూడో దశ ట్రయల్స్‌ను నిలిపివేసిన ఆక్స్‌ఫర్డ్, సురక్షితమని తేలితేనే వ్యాక్సిన్ బయటకు తెస్తామని తెలిపిన ఫార్మా సంస్థలు

Hazarath Reddy

కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనెకా ఫార్మా సంయుక్తంగా తయారు చేసిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ( Oxford-AstraZeneca Coronavirus Vaccine Trails) ట్రయల్స్‌ను నిలిపివేశారు. మూడో దశ ట్రయల్స్‌లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ( Oxford-AstraZeneca Coronavirus Vaccine) వికటించింది. మూడవ దశ ట్రయల్స్‌లో భాగంగా వ్యాక్సిన్‌ను బ్రిటన్ వాసిపై ప్రయోగించగా, తీవ్రమైన సెడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆక్స్‌ఫర్డ్ (Oxford) మూడో దశ ట్రయల్స్‌ను నిలిపివేసింది. కరోనా మహమ్మారిని కట్టడి చేసుందుకు ప్రపంచ వ్యాప్తంగా ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్న విషయం తెలిసిందే.

Milaap: ప్రాణాలపై ఆశలను చిగురింపజేస్తున్న మిలాప్, క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఎంతోమందికి చేయూత, సేవా కార్యక్రమాలు చేయాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్ మిలాప్

Hazarath Reddy

మిలాప్..ఈ పేరు అందరికీ సుపరిచితమే.. ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకువెళుతోంది. పేదవారికి, ఆపదలో ఉన్నవారికి క్రౌడ్ ఫండింగ్ ద్వారా విరాళాలు (Milaap Free Crowdfunding for India) సేకరించి వారి జీవితాల్లో వెలుగులను నింపుతోంది. వరల్డ్ ఛారీటి డే సంధర్భంగా పలు విషయాలను మాతో షేర్ చేసుకుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 9000+ ఎన్జీఓలతో కలిసి పనిచేసిన ఈ సంస్థ ఎంతోమందికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది.

Advertisement

Coronavirus disease (COVID-19): కరోనా పేషెంట్లకు మరో ముప్పు, వారి బాడీలోకి మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల వైరస్, ఆశ్చర్యపోతున్న వైద్యులు

Hazarath Reddy

కరోనావైరస్ (Coronavirus disease (COVID-19) బారినపడి విలవిలలాడిపోతున్న ప్రజలకు మరో షాకింగ్ లాంటి వార్త బయటకు వచ్చింది. కొవిడ్ రోగులకు ( Covid patients) మలేరియా, డెంగ్యూ (Dengue, malaria) వంటి సీజనల్ వ్యాధులు కూడా సోకుతున్నట్టు ఢిల్లీ వైద్యుల పరిశోధనలో (Delhi Medical Research) తేలింది. కరోనాతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన వారిలో సీజనల్ వ్యాధుల లక్షణాలు కూడా కనిపించడంతో పరీక్షలు చేసిన వైద్యులు ఫలితాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలామంది కరోనా రోగులకు డెంగ్యూతోపాటు మలేరియా కూడా సోకినట్టు నిర్ధారణ అయింది.

Hand Sanitizer Exploded: శానిటైజర్లు పేలుతున్నాయ్..అమెరికాలో భారీ శబ్దంతో పేలిన శానిటైజర్ బాటిల్, తీవ్ర గాయాల పాలైన మహిళ, టెక్సాస్‌లో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

Hazarath Reddy

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ దడ పుట్టిస్తోంది. దీనికి పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ రాకపోవడంతో జాగ్రత్తలతోనే అందరూ దీన్ని ఎదుర్కుంటున్నారు. అయితే ఇప్పుడు ఆ జాగ్రత్తలే కొంపలు ముంచుతున్నాయి. కరోనా రాకుండా కాపాడుకునేందుకు వాడే శానిటైజర్ బాటిల్ ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాల్లోకెళితే..అమెరికాలోని టెక్సాస్‌లో శానిటైజర్‌ బాటిల్‌ పేలటంతో (Hand Sanitizer Exploded) ఓ మహిళ శరీరం మొత్తం తీవ్రంగా కాలిపోయింది.

Coronavirus (COVID-19): బరువుంటే కరోనాతో ప్రమాదం, 26 అడుగుల దూరం వరకు కోవిడ్ వైరస్ ప్రయాణం, మహిళల కంటే పురుషులకే వైరస్‌ ముప్పు, రెండోసారి కరోనా సోకుతుందనే దానిపై ఇంకా వీడని సస్పెన్స్

Hazarath Reddy

కరోనావైరస్ ప్రపంచం మొత్తాన్ని కలవరపెడుతోంది. వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ఇది (coronavirus disease (COVID-19) మరింతగా భయపెడుతోంది. దీనిపై శాస్ర్తవేత్తలు రోజుకొక కొత్త ఆసక్తిర విషయాన్ని ప్రకటిస్తున్నారు. తాజాగా మరొక వార్త బయటకు వచ్చింది. కోవిడ్‌–19 (Coronavirus (COVID-19) బారిన పడితే ఆరోగ్యకరమైన బరువు కలిగిన వారికన్నా అధిక బరువు కలిగిన వారు (Obesity) 48 శాతం ఎక్కువ మరణించే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్‌ నియమించిన శాస్త్రవేత్తల బృందం తెలిపింది.

BP Drugs Cuts Covid Death Risk: కరోనాకు బీపీ మందులతో చెక్, బ్లడ్ ప్రెషర్ రోగులకిచ్చే మందులు అద్భుతంగా పనిచేస్తున్నాయని లండన్‌ తాజా సర్వే ద్వారా వెల్లడి, కరోనా రోగుల శవ పరీక్షల్లో దిమ్మతిరిగే విషయాలు

Hazarath Reddy

కరోనా వైరస్‌కు ఇప్పటి వరకు మందు అయితే రాలేదు. కాని ఎవరికి వారే పలు రకాల సర్వేలతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. తాజాగా కరోనా బారిన పడిన ‘హై బ్లడ్‌ ప్రెషర్‌’ రోగులకు బ్లడ్‌ ప్రెషర్‌ నివారణ మందులను (Blood pressure drugs) ఇవ్వడం వల్ల వారు అద్భుతంగా కరోనా వైరస్‌ బారి నుంచి కోలుకున్నారని (BP Drugs Cuts Covid Death Risk) లండన్‌లో నిర్వహించిన ఓ తాజా సర్వే తెలియజేస్తోంది.

Advertisement

Cancer Cases in India: దేశంలో నిశ్శబ్దంగా క్యాన్సర్ విజృంభణ, 2025 నాటికి క్యాన్సర్ కేసులు 15.7 ల‌క్ష‌ల‌కు పెరిగే అవ‌కాశం, ఐసీఎంఆర్‌ పరిశోధనలో వెల్లడి, పొగాకు వాడకమే కారణం

Hazarath Reddy

దేశంలో కరోనా మాటును పెద్ద ప్రమాదమే పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. కరోనా కేసులతో పాటు ఇతర వైరల్ వ్యాధులు దేశ ప్రజలకు నిదర లేకుండా చేస్తోంటో, తాజాగా క్యాన్సర్ (Cancer Cases in India) గురించి ఆందోళనకర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బెంగ‌ళూరుకు చెందిన నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ ఇన్‌ఫ‌ర్మాటిక్స్ అండ్ రీసెర్చ్‌, భార‌తీయ వైద్య ప‌రిశోధ‌న మండ‌లి(ఐసీఎంఆర్‌) సంయుక్తంగా సంచలన నివేదిక‌ను విడుద‌ల చేశాయి.

COVID-19 Symptoms: కరోనా మిస్టరీ..లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్, రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటమే కారణమా? కోవిడ్ వైరస్ మోతాదులో తేడానా ? అంతా మిస్టరీయే..

Hazarath Reddy

కరోనావైరస్..ఈ ఏడాది ఈ పదం ఒక కల్లోలాన్నే రేపింది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలు కకావికలమయ్యాయి. వ్యాక్సిన్ కోసం అన్ని దేశాలు చకోర పక్షులా ఎదురుచూస్తున్నాయి. అయితే ఈ వైరస్ లక్షణాలు రాను రాను కొత్త కొత్తగా కనిపిస్తున్నాయి. చాలామందిలో ఈ వైరస్ లక్షణాలు (COVID-19 Symptoms) లేకుండానే పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. మరికొంత మందిలో స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయట. దాదాపు 40 శాతం కరోనావైరస్ రోగులకు (coronavirus infections) కోవిడ్ లక్షణాలు కనిపించడం లేదని ప్రముఖ పరిశోధకురాలు, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో అంటు వ్యాధి వ్యాధుల నిపుణురాలు మోనికా గాంధీ పేర్కొంది.

SFTS Virus in China: చైనాలో మరో ప్రమాదకర వైరస్, ఎస్ఎఫ్‌టీఎస్ దెబ్బకు ఏడు మంది మృతి, 60 మంది ఆస్పత్రిలో చేరిక, మ‌నుషుల ద్వారా వ్యాప్తి చెందుతుంద‌ని హెచ్చ‌రిక‌లు జారీ

Hazarath Reddy

కరోనావైరస్ కల్లోలం మరచిపోకముందే చైనాలో మరో భయంకరమైన వైరస్ ( Another Virus in China) వెలుగు చూసింది. ఈ ప్రమాదకర వైరస్ (SFTS Pandemic) ధాటికి అక్కడ ఏడుగురు ప్రాణాలు కోల్పోగా మ‌రో 60 మంది దీని బారిన ప‌డ్డారు. ఎస్ఎఫ్‌టీఎస్ (సివియ‌ర్ ఫీవ‌ర్ విత్ త్రామ్‌బోసిటోపెనియా సిండ్రోమ్) (Severe fever with thrombocytopenia syndrome) వైరస్‌గా పిలుస్తోన్న ఈ వైరస్ మ‌నుషుల ద్వారా వ్యాప్తి చెందుతుంద‌ని చైనా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఈ మేర‌కు చైనా అధికారిక మీడియా గ్లోబ‌ల్ టైమ్స్‌ బుధ‌వారం క‌థనాన్ని వెలువ‌రించింది.

Salmonella Outbreak: అమెరికాను వణికిస్తున్న ఎర్ర ఉల్లిపాయ, యుఎస్, కెనడాలో పెరుగుతున్న సాల్మొనెల్లా కేసులు, ఎరుపు రంగు ఆనియన్స్ ద్వారా వ్యాధి వస్తుందని తెలిపిన సీడీసీ

Hazarath Reddy

అగ్రరాజ్యం అమెరికాకు ఇప్పుడు రెడ్ ఆనియన్స్ (Red Onions) చుక్కలు చూపిస్తోంది. కరోనాతో ఇప్పటికే వణికిపోతున్న అమెరికాకు (America) ఉల్లి రూపంలో మరో ప్రమాదం ఎదురవుతోంది. అమెరికాలో ఉల్లిపాయలు ఓ భయంకరమైన వ్యాధిని (Salmonella Outbreak) కలిగిస్తున్నాని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ(CDC) వెల్లడించింది. గత కొద్ది రోజులుగా అమెరికా, కెనడాలో (Canada) సాల్మొనెల్లా(ఫుడ్‌ పాయిజన్‌ కలిగించే బ్యాక్టీరియా) మహమ్మారి కేసులు ఎక్కువగా వెలుగు చేస్తున్నాయని సీడీసీ (Centers for Disease Control and Prevention) తెలిపింది.

Advertisement

GST on Sanitizers: శానిటైజ‌ర్ల‌పై 18 శాతం జీఎస్టీ ఎందుకంటే? అవి ఆల్కహాల్ ఉత్పత్తుల క్యాటగిరీలోకి వస్తాయట, ప్రకటనలో వివరించిన కేంద్ర ఆర్థిక శాఖ

Hazarath Reddy

ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజ‌ర్లు (Hand sanitizers) ఆల్క‌హాల్ ఉత్ప‌త్తుల క్యాట‌గిరీలోకి వ‌స్తాయ‌ని, అందుకే వాటిపై 18 శాతం జీఎస్టీ వ‌సూలు (18% GST on alcohol-based sanitizers) చేయ‌నున్న‌ట్లు అథారిటీ ఫ‌ర్ అడ్వాన్స్ రూలింగ్‌(AAR) పేర్కొన్న‌ది. గోవాకు చెందిన స్ప్రింగ్‌ఫీల్డ్ ఇండియా డిస్టిల్ల‌రీస్ వేసిన పిటిష‌న్‌పై ఏఏఆర్ (GST-Authority for Advance Rulings (AAR) ఈ స్ప‌ష్ట‌త‌నిచ్చింది. అయితే ఈ జీఎస్టీ ఎందుకంటే.. శానిటైజర్లు అన్నవి.. సబ్బులు, యాంటీ బ్యాక్టీరియల్‌ ద్రావకాలు, డెట్టాల్‌ మాదిరే ఇన్ఫెక్షన్‌ కారకాలను నిర్మూలించేవని, కనుక వీటిపై 18 శాతం జీఎస్‌టీ అమలవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.

COVID19 Kit: తెలంగాణలో ఇంటి వద్దకే కరోనా కిట్, హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి ప్రభుత్వం తరఫున ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ

Team Latestly

ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు సమీప ప్రభుత్వ వైద్యశాల నుంచి ఐసొలేషన్‌ కిట్‌ ను నేరుగా సిబ్బంది ఇంటికెళ్లి అందజేస్తుంది. ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది ఉన్నా కూడా బాధితులందరికీ కిట్లను ఇస్తారు...

Unknown Pneumonia Alert: మరో కొత్త వైరస్ బాంబును పేల్చిన చైనా, అంతుచిక్కని వైరస్‌తో న్యుమోనియా సోకి కజకిస్థాన్‌లో వందలాది మంది మృత్యువాత, జాగ్రత్తగా ఉండాలని చైనీయులకు డ్రాగన్ కంట్రీ హెచ్చరిక

Hazarath Reddy

ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ (unknown pneumonia) విలమతాండవం చేస్తున్న నేపథ్యంలో తాజాగా మరో కొత్త వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. చైనా సరిహద్దు దేశం కజకిస్థాన్‌లో (Kazakhstan) అంతుపట్టని వ్యాధితో వందలాది మంది మృత్యువాత పడుతున్నందున జాగ్రత్తగా ఉండాలని చైనా ప్రజలను హెచ్చరించింది. గుర్తుతెలియని వైరస్‌ సోకి న్యుమోనియాతో (pneumonia) గత నెలలో దాదాపు 600 మంది మరణించినట్లు వెల్లడించింది. కోవిడ్‌-19 కంటే అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్‌ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆ దేశంలో నివసిస్తున్న చైనీయులను (China warns citizens) హెచ్చరించింది.

COVID-19 Vaccine: ఆగష్టు 15 లోపు కోవిడ్ వ్యాక్సిన్; మానవ ట్రయల్స్ పట్ల టెస్టింగ్ సెంటర్లకు ఐసీఎంఆర్ డెడ్‌లైన్ విధించడం పట్ల విమర్శలు, వివరణ ఇచ్చుకున్న కౌన్సిల్

Team Latestly

నికల్ ట్రయల్స్ ను వేగవంతం చేయమని ఐసీఎంఆర్ దేశంలోని నిర్ధేషిత ఆరోగ్య కేంద్రాలకు లేఖలు రాయడం పట్ల నిపుణుల నుంచి విమర్శలు వెలువెత్తాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి తేవడంలో అంతతొందరెందుకు...

Advertisement

COVID19 in India: భారత్‌లో 4 లక్షలు దాటిన కోవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో అత్యధికంగా 15,413 కేసులు నమోదు, కోవిడ్ చికిత్సకు 'ఫాబిఫ్లూ' ఔషధం సిద్ధం చేసిన గ్లెన్‌మార్క్ సంస్థ

Team Latestly

మరోవైపు, రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులతో భయాందోళనలో ఉన్న ప్రజలకు ఒక పెద్ద ఊరటనిచ్చేలా కోవిడ్‌-19 చికిత్సకు ఔషధం తయారు చేసినట్టు భారత్‌కు చెందిన గ్లెన్‌మార్క్‌ ఫార్మాసూటికల్‌ కంపెనీ ప్రకటించింది. ‘ఫవిపిరవర్‌’ అనే యాంటీ వైరల్‌ డ్రగ్ కరోనా‌ చికిత్సకు బాగా పనిచేస్తోందని, దీనిని ‘ఫాబిఫ్లూ’ అనే బ్రాండ్‌ పేరు‌తో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు ముంబైకి చెందిన గ్లెన్‌మార్క్‌ సంస్థ తెలిపింది.....

Happy Summer 2020: ఇకపై పగలు ఎక్కువ, రాత్రులు తక్కువ, హ్యాపీ సమ్మర్ సీజన్ 2020 వచ్చేసింది, జూన్ 21 నుంచి సెప్టెంబర్ 22 వరకు కొనసాగనున్న సమ్మర్ సీజన్

Hazarath Reddy

నాలుగు సమశీతోష్ణ సీజన్లలో వేసవి అనేది చాలా హాటెస్ట్ సీజన్ గా (Happy Summer 2020) చెప్పవచ్చు. ఇది (Summer Season) వసంత రుతువు తరువాత అలాగే శరదృతువు ముందు వస్తుంది. ఈ వేసవికాలంలో సూర్యోదయం, సూర్యాస్తమయంలో పలు మార్పులు సంభవిస్తాయి. రోజులు చాలా ఎక్కువ అనిపిస్తాయి. రాత్రులు తక్కువగానూ పగలు ఎక్కువగా ఉంటుంది. కాలం గడుస్తున్న కొద్ది పగలు తగ్గిపోయి రాత్రి ఎక్కువ అవుతుంది. కాగా వేసవి ప్రారంభ తేదీ (Happy Summer 2020 Dates) వాతావరణం, సంప్రదాయం మరియు సంస్కృతి ప్రకారం మారుతుంది. ఉత్తర అర్ధగోళంలో వేసవి ఉన్నప్పుడు, ఇది దక్షిణ అర్ధగోళంలో శీతాకాలంతో విరుద్ధంగా ఉంటుంది. ఈ సీజ్ జూన్ 21న ప్రారంభమై సెప్టెంబర్ 22 వరకు ఉంటుంది.

How to Clean Sofa: మీరు కూర్చునే సోఫాలో ఎన్నో హానికారక క్రిములకు నిలయం కావొచ్చు! సోఫాల శుభ్రతపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టండి, సోఫాలను ఈ విధంగా శుభ్రపరుచుకోండి

Team Latestly

రోజంతా ఎక్కువ సేపు గడిపేది, వర్క్ ఫ్రోమ్ హోమ్ చేస్తూ కొద్దిసేపు విశ్రాంతి తీసుకునేది, ఇంట్లో చిన్న పిల్లలుంటే ఆడుకునేది ఈ సోఫాలపైనే. ఈ లాక్డౌన్ విధించినప్పట్నించీ చాలా ఇళ్లలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అంటూ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లలో సినిమాలను చూస్తూ సోఫాలకే...

Regulatory Farming Policy: ప్రజలు బలవర్ధకమైన ఆహారాన్ని తినాలి, అలాంటి పంటలనే రైతులు సాగుచేయటం అలవాటు చేసుకోవాలి: నియంత్రిత వ్యవసాయంపై సమీక్షలో సీఎం కేసీఆర్

Team Latestly

ప్రజలు ఏది పడితే అది తింటున్నారు తప్ప, బలవర్థకమైన ఆహారం తినడం లేదని, అలాంటి ఆహారాన్ని తినేలా ప్రోత్సహించాలని, అలాంటి పంటలు పండించాలని సిఎం చెప్పారు...

Advertisement
Advertisement