పాలు ఆరోగ్యానికి మంచిదైనప్పటికీ కొంతమందిలో ఇది కొన్నిసార్లు చాలా ప్రమాదకరంగా మారుతుంది. పాలల్లో ఉండే కేసీన్ అనే ప్రోటీన్ చాలామందికి ఎలర్జీని కలిగిస్తుంది. దీనినే లాక్టోస్ లేదా మిల్క్ ఎలర్జీ అని కూడా అంటారు. ఇది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఉండే ప్రోటీన్ గుర్తించలేక హానికర పదార్ధంగా మారుతుంది. అటువంటి అప్పుడు ఈ సమస్య మొదలవుతుంది. ముఖ్యంగా ఈ సమస్య పిల్లలలో కనిపిస్తుంది కొన్ని కొన్ని సార్లు పెద్దలలో కూడా ఈ సమస్య కనిపిస్తుంది.
ఎవరికి పాల ఎలర్జీ ఎక్కువగా ఉంటుంది.. పాల వల్ల ఎలర్జీ ముఖ్యంగా చిన్నపిల్లల్లో వృద్ధులలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆవుపాలు తాగే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. పుట్టుకతో వచ్చే కొంచెం సున్నితమైన పేగులు పిల్లల్లో ఉంటాయి. ఇవి వీరు ఆవు పాలు తాగినప్పుడు అది మిల్క్ ఎలర్జీగా అనిపిస్తుంది. వారి రోగినిరోధక వ్యవస్థ కూడా బలహీనంగా ఉంటుంది. అటువంటి అప్పుడు ఈ ఎలర్జీ ఎక్కువ ప్రతి చర్యను ఇస్తుంది.
ఎలర్జీకి కారణం- పాలలో కెసిన్ వే అనే రెండు ప్రధాన ప్రోటీన్లు ఉంటాయి. పాలకు ఎలర్జీ ఉన్న వ్యక్తులతో వీరు తీసుకున్నప్పుడు రోగనిరోధక వ్యవస్థ బలహీనపడి ఇది చర్మం పైన దురదను శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కడుపునొప్పి, వాంతులు, వికారం, విరోచనాలు వంటి లక్షణాలను కలిగిస్తుంది.
Health Tips: అరటిపండు ఆరోగ్యానికే కాదు, చర్మ సౌందర్యానికి కూడా ...
పాల వల్ల ఎలర్జీ వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి- ముఖ్యంగా చర్మం పైన దద్దుర్లు, దురదలు కనిపిస్తాయి. కడుపులో నొప్పి, వికారం, వాంతులు, విరోచనాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. గొంతు నొప్పి, వాపు మంటి సమస్యలు కనిపిస్తాయి.
ఎలర్జీని నిరోధించే మార్గాలు- పాల వల్ల ఎలర్జీ ఉన్నప్పుడు పాలు మాత్రమే కాకుండా జున్ను, వెన్న ,పెరుగు, క్రీమ్ వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. అంతేకాకుండా ప్యాకేజ్ లో ఉండే పాలు, పాల ఉత్పత్తులు కూడా తగ్గిస్తే ఈ ఎలర్జీ సమస్య నుంచి బయటపడవచ్చు. ఎక్కువ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించి మందులను తీసుకోవడం ఉత్తమం.
ప్రత్యామ్నాయం- మీకు పాల ఎలర్జీ ఉన్నట్లయితే కొన్ని రకాల పాలను మీరు తీసుకోవచ్చు.
సోయా పాలు- సోయా పాలు తీసుకోవడం ద్వారా మీకు అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది పాలకు మంచి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు.
బాదంపాలు- బాదంపాలు తక్కువ క్యాలరీలు ఉండి అనేక రకాల పోషకాలను కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది.
ఓట్ మిల్క్- ఫైబర్ అనేక రకాల పోషకాలు కలిగి ఉంటే ఓట్ మిల్లు ప్రతిరోజు తీసుకోవడం ద్వారా పాలకు ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి