అమెరికాకు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ (Boeing) ఏకంగా 17 వేల మంది సిబ్బందిపై వేటు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తన సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిలో దాదాపు 10 శాతం మందిని తొలగించేందుకు గానూ పింక్ స్లిప్పులు జారీ చేయడం మొదలు పెట్టింది. అయితే అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులు స్థానిక నిబంధనలకు అనుసరించి 60 రోజుల నోటీసు పీరియడ్ భాగంగా జనవరి వరకు ఉద్యోగ బాధ్యతల్లో కొనసాగుతారు.
ఇక సియాటెల్ ప్రాంతంలో 33 వేల మంది కార్మికులు కొన్ని వారాల పాటు సమ్మె చేశారు. దీంతో 737 MAX, 767, 777 జెట్‌ల ఉత్పత్తి నిలిచిపోయింది. రాబోయే రోజుల్లో మొత్తం ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగిస్తామని కంపెనీ ఇది వరకే పేర్కొనగా.. ఇందులో భాగంగానే తాజా నిర్ణయం ప్రకటించింది.