Boeing to cut 17,000 jobs amid worker strike and crisis over plane safety

ప్రముఖ విమాన తయారీ దిగ్గజం బోయింగ్..తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో సుమారు 10 శాతం మందిని తొలగించడానికి సన్నద్ధమైంది. సీఈఓ కెల్లీ ఓర్ట్‌బర్గ్ ప్రకారం.. ఏరోస్పేస్ దిగ్గజం 17,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. సియాటెల్‌ ప్రాంతంలో బోయింగ్ ఉద్యోగులు సుమారు 33,000 మంది నెల రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె కారణంగా 737 మ్యాక్స్, 767, 777 జెట్‌ల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో కంపెనీ భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి, ఉద్యోగులను తొలగించడానికి సంస్థ సిద్ధమైంది.

రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలి, కేంద్రాన్ని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించిన మహారాష్ట్ర క్యాబినెట్

ప్రస్తుతం బోయింగ్ ఉన్న పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాలు చాలా అవసరమని కంపెనీ సీఈఓ పేర్కొన్నారు. బోయింగ్ తొలగించనున్న ఉద్యోగులలో మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్స్ ఉండనున్నట్లు సమాచారం. అయితే ఏ విభాగంలో ఎంతమందిని తొలగించనున్నారు అనే వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. బోయింగ్ ఉద్యోగుల సమ్మె కారణంగా విమానాల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో 777ఎక్స్ జెట్ డెలివరీలు ఆలస్యం కానున్నాయి. ఈ జెట్ డెలివరీలు 2026లో జరగాల్సి ఉంది. కానీ ఉత్పత్తి ఆలస్యం కావడం వల్ల డెలివరీలు మరింత ఆలస్యమయ్యాయి. దీనివల్ల సంస్థ షేర్స్ కూడా 1.1 శాతం క్షీణించాయి. ప్రస్తుతం కంపెనీ ఆర్థికంగా నిలబడటానికి ఉద్యోగుల తొలగింపు చాలా అవసరం.