అల్లం ఆహార రుచిని పెంచడమే కాకుండా అందులో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఔషధ గుణాలు పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రతిరోజు అల్లాన్ని తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్రమం తప్పకుండా 21 రోజులపాటు అల్లాన్ని తీసుకుంటే మన శరీరం పైన అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణశక్తికి.. అల్లం వ్యవస్థను మెరుగుపరుస్తుంది. సహజ ఎంజైములను కలిగి ఉంటుంది. ఇది కడుపులో వచ్చే గ్యాస్ట్రిక్ యాసిడ్లను ,అజీర్ణం ,మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. పేగు కండరాలను బలాన్ని చేకూరుస్తుంది. అల్లం తినడం వల్ల తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. దీని వల్ల కడుపుబ్బరం, అజీర్ణం అంటే సమస్యలు తగ్గిపోతాయి. కడుపు నొప్పితో బాధపడే వారికి అల్లం ఒక చక్కటి వరంగా చెప్పవచ్చు.
వాపును తగ్గిస్తుంది.. అల్లని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్న వాపులు నొప్పులు అన్నీ కూడా తగ్గిపోతాయి. అల్లం లో జింజర్ ఆల్ అనే మూలకం ఉంటుంది. ఇది సహజంగా వచ్చే బ్యాక్టీరియా, ఫంగల్ వల్ల వచ్చే వాపులను నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు కండరాల నొప్పులు తగ్గించడానికి అల్లం బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా గాయాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
Health Tips: మీ శరీరంలో ఈ ఐదు సంకేతాలు కనిపిస్తున్నాయా
ఇమ్యూనిటీను పెంచుతుంది.. అల్లం లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. మన శరీరంలో వ్యాధులతో పోరాడే శక్తిని అందిస్తుంది. జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ అందిస్తుంది. ఫ్రీ రాడికల్స్ తో పోరాడి మన శరీరంలో ఉన్న వ్యర్ధాలను బయటికి పంపించడంతో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.
కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది- అల్లంని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాలను పెంచుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. మన శరీరంలో పేరుకుపోయిన అదనపు కొమ్మును తగ్గించడంలో అల్లం సహాయపడుతుంది. అంతేకాకుండా అల్లం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాణాలను తగ్గిస్తుంది.
అల్లం లో ఉండే పోషకాలు.. అల్లం లో చాలా ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇందులోప్రోటీన్, విటమిన్ సి, క్యాల్షియం, ఐరన్, జింక్ ,మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉన్నాయి. విమల శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా ఎముకల దృఢత్వానికి ,రక్తప్రసరణకు ,కొలెస్ట్రాల్ తగ్గించడానికి ,చర్మ ఆరోగ్యానికి, జుట్టు సంరక్షణకు సహాయపడుతుంది. ప్రతిరోజు మీరు ఆహారంలో అల్లాన్ని చేర్చుకోవడం ద్వారా అంగీకరకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి