జ్యోతిష ప్రకారం చంద్రుడికి ప్రత్యేక స్థానం ఉంది. చంద్రుడు ప్రతి రాశిలో కూడా రెండున్నర నెలలు ఉంటాడు. అయితే నవంబర్ 18 వ తేదీన శుక్రుడు, చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశం, చంద్రుని సంచారం కారణంగా అన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ మూడు రాశులు వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీన రాశి- మీన రాశి వారికి చంద్రుని సంచారం కారణంగా అన్ని శుభ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో ఆర్థిక లాభాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు జీతం పెరుగుతుంది. మునుపటికంటే ఇప్పుడు వీరు హాయిగా ప్రశాంతంగా పనిచేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపార సంబంధాల ప్రయోజనాలు పెరుగుతాయి. ప్రయాణాల వల్ల మీకు ఆర్థిక ప్రయోజనం లభిస్తుంది. రాజకీయ లకు సంబంధించిన వ్యక్తులు పెద్ద నాయకులను కలుసుకునే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో పెట్టుబడులు పెడతారు.
వృశ్చిక రాశి- వృశ్చిక రాశి వారికి చంద్రుని అనుగ్రహంతో ఈ రాశి వారికి అన్ని సానుకూల ఫలితాలు ఉంటాయి. పెండింగ్లో ఉన్న అని పనులు కూడా తొందరలోనే పూర్తి అవుతాయి. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఇంతకుముందు కంటే ఇప్పుడు బలంగా ఉంటుంది. ఖర్చులు తగ్గుతాయి. వ్యాపారస్తులకు ఆకస్మాత్తుగా డబ్బులు రావడం వంటివి లభిస్తాయి. పూర్వికులు నుండి రావాల్సిన ఆస్తి పంపకాల్లో మీకు న్యాయం జరుగుతుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు.
Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి,
కర్కాటక రాశి- కర్కాటక రాశి వారికి రాబోయే కొద్ది రోజులు చాలా శుభకరంగా ఉంటుంది. చంద్రుని సంచారం కారణంగా వీరికి అన్ని శుభ ఫలితాలు లభిస్తాయి. వ్యాపారంలో ఆర్థిక లాభాలు పెరుగుతాయి. ఎప్పటినుంచి ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు. పెళ్లి కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అనారోగ్యము సమస్య నుంచి బయటపడతారు. కోట్ల సమస్యల నుంచి బయటపడతారు. ఇది మానసిక ప్రశాంతతను ఇస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.