Johannesburg, NOV 15: దక్షిణాఫ్రికా గడ్డపై టీమ్ఇండియా యువ ఆటగాడు, తెలుగు తేజం తిలక్ వర్మ (Tilak Varma) అదరగొడుతున్నాడు. వరుసగా రెండో టీ20 మ్యాచులోనూ (Back-to-Back Centuries in T20Is) శతకంతో చెలరేగాడు. జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచులో కేవలం 41 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలో అరుదైన ఘనత అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వరుసగా రెండు టీ20ల్లో సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. తిలక్ కంటే ముందు సంజూ శాంసన్ ఈ ఘనత అందుకున్నాడు.
Tilak Varma Hits his Second T20I Century
💯!
𝗧𝗵𝗶𝘀 𝗶𝘀 𝘀𝗲𝗻𝘀𝗮𝘁𝗶𝗼𝗻𝗮𝗹 𝗳𝗿𝗼𝗺 𝗧𝗶𝗹𝗮𝗸 𝗩𝗮𝗿𝗺𝗮! 🙌 🙌
A 41-ball TON for him! 🔥 🔥
His 2⃣nd successive hundred! 👏 👏
Live ▶️ https://t.co/b22K7t8KwL#TeamIndia | #SAvIND pic.twitter.com/EnAEgAe0iY
— BCCI (@BCCI) November 15, 2024
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వరుసగా రెండు సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు వీరే..
2024లో సంజూశాంసన్ – బంగ్లాదేశ్, దక్షిణాప్రికాలపై
2024లో తిలక్ వర్మ – దక్షిణాఫ్రికా పై