Newdelhi, Nov 16: ఉద్యోగం (Job) మానేయాలని, తన ఆకాంక్షలకు అనుగుణంగా బతకాలని భార్యను భర్త వేధించడం, ఒత్తిడి చేయడం.. అలా వినని సందర్భంలో నిర్బంధించడం క్రూరత్వమేనని (Cruelty) మధ్యప్రదేశ్ హైకోర్టు చెప్పింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలో మేనేజర్ గా పని చేస్తున్న మహిళ (33) విడాకుల కోసం ఓ పిటిషన్ ను దాఖలు చేసింది. ఉద్యోగం మానేసి, భోపాల్ లో తనతోపాటు కాపురం చేయాలని తన భర్త తనను మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో తనకు విడాకులు ఇప్పించాలని కోరింది. అయితే, ఆమె పిటిషన్ ను కుటుంబ న్యాయస్థానం తిరస్కరించింది.
వీడియో ఇదిగో, ఫోన్ చూసుకుంటూ రోడ్డు క్రాస్ చేస్తున్న మహిళను ఢీకొట్టిన కారు, తర్వాత ఏమైందంటే..
అలా హైకోర్టుకు..
కుటుంబ న్యాయస్థానం తిరస్కరించడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై హైకోర్టు స్పందిస్తూ చేస్తున్న ఉద్యోగాన్ని మానేయాలని భర్త కానీ, భార్య కానీ ఒకరిపై మరొకరు ఒత్తిడి తేకూడదని స్పష్టం చేసింది. విడాకుల మంజూరుకు సంబంధించిన పిటిషన్ ను పరిశీలించడానికి అంగీకరించింది.