భారత పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియా బ్యాటర్ ఖవాజా వికెట్ తీసిన విధానానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుమ్రా వేసిన ఆ చక్కటి డెలివరీని స్ట్రయిట్ బౌండరీకి పంపించాలని ఖవాజా భావించాడు. అయితే అతడు షాట్ కొట్టేలోపు దూసుకొచ్చిన బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని వెళ్లి వికెట్లను గిరాటేసింది. బాల్ తగిలిన వేగానికి స్టంప్స్ ఎగిరి చాలా దూరంలో పడ్డాయి. మూడో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టాడు బుమ్రా. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (8)తో పాటు స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ (1), ప్యాట్ కమిన్స్ (22)ను అతడు పెవిలియన్‌కు పంపించాడు. డ్రాగా ముగిసిన మూడో టెస్టు, భారత్ ముందు 275 టార్గెట్...వర్షంతో మ్యాచ్‌ను రద్దు చేసిన అంపైర్లు
Jasprit Bumrah Knocks Over Usman Khawaja
There is simply no stopping Jasprit Bumrah!#AUSvIND pic.twitter.com/rQ5Btkk4Cq
— cricket.com.au (@cricketcomau) December 18, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)