ముంబై (Mumbai) తీరంలో ఘోర పడవ ప్రమాదం (Boat accident) చోటు చేసుకుంది. గేట్‌వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెట్ ఐలాండ్‌కు 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బోటు ప్రమాదవశాత్తు మునిగిపోయింది. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్ కోస్ట్‌గార్డ్స్ (Indian coast guards) రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. 20 మందిని రక్షించారు. ఒక మృతదేహాన్ని కూడా వెలికి తీశారు. మిగతావారు గల్లంతయ్యారు. నేవీ, జేఎన్‌పీటీ, తీరప్రాంత గస్తీ టీమ్, స్థానిక పోలీసులు తక్షణం రంగంలోకి దిగి ప్రయాణికులను కాపాడేందుకు చర్చలు చేపట్టారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రమాద ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుని త్వరలో ప్రకటన చేస్తానని చెప్పారు. ముంబై గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బోటు బోల్తా, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, వీడియో ఇదిగో..
1 Dead as Boat Heading to Elephanta Island With 60 Passengers
#WATCH | Mumbai, Maharashtra: According to preliminary information, the ferry boat 'Neelkamal' has capsized near Uran, Karanja. Preliminary information is that there are 30 to 35 passengers in it. Rescue operations are underway with the help of Navy, Coast Guard, Yellowgate… https://t.co/X78yGKwa3d pic.twitter.com/ODiXXAbbhG
— ANI (@ANI) December 18, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)