ప్రకాశం జిల్లా యర్రగొండపాళెంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకున్న సంగతి విదితమే. రెండు రోజుల క్రితం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని ఆంజనేయస్వామి గుడి వద్ద తమ తల్లిని వదిలేసి వెళ్ళిపోయారు కసాయి కొడుకులు. పైకి లేవలేక, కనీసం చుట్టుపక్కల వారు ఇచ్చే ఆహారం కూడా తినలేని స్థితిలో వృద్ధురాలు అక్కడ కనిపించింది. అధికారులు స్పందించి వృద్ధాశ్రమానికి తరలించాలని స్థానికులు కోరుతున్నారంటూ ఓ వీడియోని బిగ్ టీవీ తన ఎక్స్ లో షేర్ చేసింది. దీనిపై నారా లోకేష్ స్పందించారు. ఈ విజువల్స్ చూస్తే గుండె పగిలిపోతుంది. ఆమెకు వెంటనే ఆహారం, వసతి కల్పించేందుకు అధికారులతో కలిసి కృషి చేస్తామని ఎక్స్ వేదికగా తెలిపారు.
Son Leaves mother in Hospital outside
Heartbreaking to see these visuals. We will work with the authorities to provide her with food and shelter immediately.@OfficeofNL https://t.co/XE35m3vuCs
— Lokesh Nara (@naralokesh) November 25, 2024
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)