రాష్ట్రీయం

Devaragattu Bunny Festival: నెత్తురోడిన దేవరగట్టు బన్నీ ఉత్సవం, కర్రలతో తీవ్రంగా కొట్టుకున్న భక్తులు.. ఇద్దరు మృతి, 100మందికి పైగా గాయాలు, వీడియోలు ఇవిగో..

Team Latestly

కర్నూలు(Kurnool) జిల్లాహొళగుంద మండలం దేవరగట్టు(devaragattu) మాళ మల్లేశ్వరస్వామి బన్నీ ఉత్సవంలో తీవ్ర అపశృతి చోటుచేసుకుంది. బన్నీ ఉత్సవాల ప్రారంభంలోనే రెండు వర్గాలు కర్రలతో తలపడటంతో ఇద్దరు భక్తులు మృతి చెందారు. దాదాపు వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. దేవరగట్టులో గురువారం అర్ధరాత్రి స్వామి, అమ్మవారి వివాహం అనంతరం ఊరేగింపు జరిగింది.

Hyderabad: మాదన్నపేటలో దారుణం, కుక్క విషయంలో గొడవపడి వృద్ధురాలిపై కానిస్టేబుల్‌ కుటుంబసభ్యులు దాడి, వీడియో ఇదిగో..

Team Latestly

హైదరాబాద్‌ నగరంలోని మాదన్నపేటలో దారుణం చోటు చేసుకుంది. కుక్కను తీసుకొచ్చి తమ ఇంటి ముందు మలవిసర్జన చేయిస్తున్నారని ప్రశ్నించిన వృద్ధురాలిపై కానిస్టేబుల్ కుటుంబసభ్యులు దారుణంగా దాడి చేసి గాయపరిచారు. తన ఇంటి ముందు, పోలీస్ కానిస్టేబుల్ కుక్కకు మలవిసర్జన చేయిస్తున్నాడని వృద్ధురాలు ప్రశ్నించింది.

Hyderabad New CP: హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్‌, హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీగా బదిలీ అయిన సీవీ ఆనంద్‌

Team Latestly

Andhra Pradesh: మద్యం కేసులో మిధున్ రెడ్డికి భారీ ఊరట భారీ ఊరట, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు, జైలు నుంచి విడుదల

Team Latestly

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డికి విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. కోర్టు షరతుల ప్రకారం.. మిధున్ రెడ్డి వారానికి రెండు సార్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందుకు హాజరు కావాలి.

Advertisement

Telangana Panchayat Elections 2025: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల, మొత్తం ఐదు దశల్లో పోలింగ్‌, 565 జడ్పీటీసీ, 5,749 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు

Team Latestly

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల (Local Body) ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసింది. మొదట ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత వార్డులు, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముది ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఎన్నికలు మొత్తం ఐదు విడతల్లో నిర్వహించనున్నారు.

V.C. Sajjanar: టీజీఎస్ఆర్టీసీ ఎండీగా చివరి రోజు బస్సులో ప్రయాణించిన సజ్జనార్, బస్సు దిగి కొత్త మార్గంలో వెళ్లవలసి ఉందంటూ భావోద్వేగం, హైదరాబాద్ సీపీగా తదుపరి బాధ్యతలు

Team Latestly

నాలుగు సంవత్సరాలుగా టీజీఎస్‌ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించిన వీసీ సజ్జనార్ ఈ రోజు బాధ్యతల నుంచి తప్పుకుని కొత్త బాధ్యతలు తీసుకునేందుకు రెడీ అయ్యారు. టీజీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్‌ను హైదరాబాద్ సీపీగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో సజ్జనార్ 'ఎక్స్' వేదికగా స్పందించారు

Hyderabad Fire: వీడియో ఇదిగో, ఎస్సార్‌నగర్‌లో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో ఒక్కసారిగా ఎగసిన మంటలు, ప్రయాణికులు సేఫ్, మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధం

Team Latestly

హైదరాబాద్‌లో ఎస్‌ఆర్‌ నగర్‌ చౌరస్తా వద్ద అర్ధరాత్రి సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. మియాపూర్‌ నుంచి విజయవాడకు వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమౌన డ్రైవర్‌ రోడ్డుపై బస్సును ఆపి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు.

Andhra Pradesh: షాకింగ్ వీడియో ఇదిగో, వేడి పాలగిన్నెలో పడిన చిన్నారి మృతి, అనంతపురం అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విషాదకర ఘటన

Team Latestly

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారి లక్షిత స్కూల్ వంటగదిలో వేడి పాల గిన్నెలో పడి తీవ్ర గాయపడి మరణించింది. ఈ ఘటన గురుకుల సీసీటీవీ ఫుటేజీ బయటపడిన తర్వాత వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Advertisement

Rain Alert: మరో మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో భారీ వర్షాలు, ఇంటి దగ్గర నుండే పని చేయండి, నగర ఉద్యోగులకు పోలీసులు ఆదేశాలు, తెలంగాణకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌

Team Latestly

హైదరాబాద్ నగరంలో గత రాత్రి నుండి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు నగర జీవన విధానాన్ని అస్తవ్యస్తంగా మార్చాయి. రహదారులు జలమయమవగా, ట్రాఫిక్ సమస్యలు మరింతగా పెరిగాయి. వాతావరణ శాఖ (IMD) ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది.

Telangana Rains Update: తెలంగాణలో మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు, ఈ నెల 30 వరకు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక

Team Latestly

తెలంగాణ రాష్ట్రాన్ని భారీ వర్షాలు వీడటం లేదు. రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 30 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Rain Alert: ఏపీకి బిగ్ అలర్ట్..వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో, ఆరంజె అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, పూర్తి వివరాలు ఇవిగో..

Team Latestly

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

Tragedy Averted in Vijayawada: వీడియో ఇదిగో, విజయవాడలో కళాశాల బస్సు నడుపుతున్న డ్రైవర్‌కి గుండెపోటు, సీపీఆర్ సాయంతో ప్రాణాలు కాపాడిన పోలీసులు

Team Latestly

విజయవాడలో రామవరప్పాడు రింగ్‌ రోడ్ వద్ద ఓ ప్రైవేట్ కళాశాల బస్సు డ్రైవర్‌ అకస్మాత్తుగా గుండెపోటుకు గురవగా, వెంటనే స్పందించిన ట్రాఫిక్‌ పోలీసులు అతడికి సీపీఆర్‌ చేసి ప్రాణాలను కాపాడారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Engili Pula Bathukamma Wishes in Telugu: ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు, తెలంగాణ ఆడపడుచులకు బతకుమ్మ పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి ఇలా..

Team Latestly

తెలంగాణ సంస్కృతిలో అతి ముఖ్యమైన పండుగ బతుకమ్మ. ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున ఈ పండుగ ప్రారంభమవుతుంది. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ వేడుకలో పూలకు, ప్రకృతికి, స్త్రీ శక్తికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సారి బతుకమ్మ పండుగ సెప్టెంబర్ 21న ఆదివారం అమావాస్యతో ప్రారంభమైంది.

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ అంటే ఏమిటో తెలుసా.. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ తొలి రోజున జరిపే ఉత్సవం ప్రత్యేకతలు ఇవిగో..

Team Latestly

తెలంగాణ సంస్కృతిలో అతి ముఖ్యమైన పండుగ బతుకమ్మ. ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున ఈ పండుగ ప్రారంభమవుతుంది. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ వేడుకలో పూలకు, ప్రకృతికి, స్త్రీ శక్తికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సారి బతుకమ్మ పండుగ సెప్టెంబర్ 21న ఆదివారం అమావాస్యతో ప్రారంభమైంది. మొదటి రోజు జరిపే ఉత్సవాన్ని ఎంగిలి పూల బతుకమ్మ లేదా చిన్న బతుకమ్మ అని పిలుస్తారు.

Hyderabad Rains: హైదరాబాద్‌ను అకస్మాత్తుగా ముంచెత్తిన భారీ వాన..బయటకు రావొద్దంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ, ఎక్కడికక్కడే ట్రాఫిక్‌కు అంతరాయం..

Team Latestly

వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షపు నీరు రోడ్లను నింపేసిన కారణంగా వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాయి. ముఖ్యంగా పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్, సనత్‌నగర్ పరిసరాల్లో రద్దీ ఎక్కువగా ఉండడంతో వాహనదారులు నెమ్మదిగా కదులుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాల క్యూలు కిలోమీటర్ల పొడవునా ఏర్పడ్డాయి.

Dussehra Holidays in Telugu States: ఏపీలో సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు, తెలంగాణలో సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 3 వరకు సెలవులు

Team Latestly

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 దసరా సెలవుల షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సెప్టెంబర్ 19, శుక్రవారం నాడు ఈ మార్పులను అధికారికంగా ప్రకటించారు. అంతకు ముందు రాష్ట్రంలోని పాఠశాలలకు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఇచ్చారు

Advertisement

Hyderabad: దారుణం.. ఇంటర్ విద్యార్థిపై ఫ్లోర్ ఇన్ఛార్జ్ దాడి.. విరిగిన దవడ ఎముక, గడ్డి అన్నారం నారాయణ జూ.కాలేజీలో ఘటన, వీడియో ఇదిగో..

Team Latestly

హైదరాబాద్‌లోని నారాయణ కాలేజ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థి ఒకరు కాలేజ్‌లో ఫ్లోర్ ఇన్చార్జ్ చేత దాడి కు గురయ్యారు. ఈ దాడిలో అతని దవడ ఎముక విరిగింది. విద్యార్థి తీవ్రగా గాయపడిన తరువాత స్థానికులు, కాలేజ్ సిబ్బంది సహాయం కోసం వచ్చారు. ఈ ఘటనా సంఘటన స్థానికంగా తీవ్ర దాగ్భ్రాంతి, ఆందోళన కలిగించింది.

Young Man Dies of Heart Attack: వీడియో ఇదిగో.. జ్యూస్ తాగుతుండగా గుండెపోటుతో కుప్పకూలి 30 ఏళ్ల యువకుడు మృతి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదకర ఘటన

Team Latestly

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక జ్యూస్ సెంటర్‌లో జ్యూస్ తాగుతున్న 30 ఏళ్ల యువకుడు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.

Hyderabad Weather Update: హైదరాబాద్‌కు వాతావరణ శాఖ మరో వార్నింగ్, మళ్లీ దంచికొట్టనున్న భారీ వర్షాలు, తెలంగాణలో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు అలర్ట్

Team Latestly

నిన్న రాత్రి హైదరాబాద్ నగరం తడిసిముద్దయింది. అర్ధరాత్రి వరకూ ఐదు గంటలపాటు కుంభవృష్టిలా కురిసిన వాన నగర జీవితాన్ని అతలాకుతలం చేసింది. ఒక్కసారిగా ఆకాశం చిల్లుపడినట్టే కురిసిన వర్షానికి నిమిషాల వ్యవధిలోనే రోడ్లు నదుల్లా మారిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి

Telangana Rajyadhikara Party: తీన్మార్ మల్లన్నకొత్త పార్టీ పేరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ, బీసీల ఆత్మగౌరవమే ప్రధాన ఎజెండాగా తెలంగాణలో నూతన పార్టీ, TRP అధికార ప్రతినిధిగా ఏఐ

Team Latestly

తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. బీసీ (బ్యాక్‌వర్డ్ క్లాస్) వర్గాల ఆత్మ గౌరవం, హక్కుల కోసం తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. 2025 సెప్టెంబర్ 17 న హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్‌లో ఆయన అధికారికంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) ను స్థాపించారు.

Advertisement
Advertisement