రాష్ట్రీయం
Telangana New CM Oath: ఇందిరమ్మ రాజ్యం స్థాపనకు సమయం ఆసన్నమైంది, ప్రజలంతా రేపటి ప్రమాణస్వీకారానికి తరలి రండి, తెలంగాణ ప్రజలకు రేవంత్‌ రెడ్డి లేఖ
Hazarath Reddyప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని తెలంగాణ ప్రజలను సీఎల్పీనేత రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలను ఆహ్వానిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
Bhatti Vikramarka To Be Dy CM ? మల్లు భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ హై కమాండ్ బంఫరాఫర్, డిప్యూటీ సీఎంతో పాటు టీపీసీసీ అధ్యక్ష పదవి..
Hazarath Reddyముఖ్యమంత్రి అభ్యర్థిగా టీపీసీసీ చీఫ్ ఏ రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో రాజకీయ రంగంపై అంచనాలు నెలకొన్నాయి. అయితే, ముఖ్యమంత్రి పదవిని ఆశించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క రాబోయే మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి పాత్రను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని తాజా పరిణామాలు చెబుతున్నాయి.
Telangana New CM Oath: సీఎంగా రేవంత్‌ రేపు ప్రమాణ స్వీకారం, సీఎం జగన్‌ తో పాటు కేసీఆర్‌కు ఆహ్వనం, ఇంకా ఎవరెవరికి ఆహ్వనం పంపారంటే..
Hazarath Reddyముఖ్యమంత్రి అభ్యర్థిగా టీపీసీసీ చీఫ్ ఏ రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో రాజకీయ రంగంపై అంచనాలు నెలకొన్నాయి. తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం 1:42 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
BJP MLA Raja Singh on Congress: కేసీఆర్ ఇక ఫాం హౌస్‌కే పరిమితం, ఈ కాంగ్రెస్ పాలన కూడా ఆర్నెళ్లే, సంచలన వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్
Hazarath Reddyతెలంగాణలో కాంగ్రెస్‌ ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడపలేదు. ఆర్నెళ్లు లేదా (Congress Government Ruling Six Months) ఏడాది మాత్రమే తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంటుంది. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం (BJP will Come to Power) వస్తుంది.
CM Jagan Review on Cyclone: తుఫానులో దెబ్బతిన్న ప్రతీ రైతును ఆదుకుంటాం, వెంటనే రైతుల దగ్గరకు వెళ్లాలని జిల్లా కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశాలు
Hazarath Reddyఏపీలో తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్బంగా తుపాను ఎఫెక్ట్, పునరావాస చర్యలు, నష్టం అంచనాలు తదితర అంశాలపై సీఎం జగన్‌ చర్చించారు. కాగా మిచౌంగ్ తుపాను (Cyclone Michaung) వాయుగుండంగా బలహీనపడింది.
Cyclone Michaung Update: ఈశాన్య తెలంగాణ‌వైపు ప‌య‌నిస్తున్న వాయుగుండం, రాబోయే 24 గంట‌ల పాటూ మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం, ఏపీ, త‌మిళ‌నాడుల్లో కొన‌సాగుతున్న స‌హాయ‌క చ‌ర్య‌లు
VNSమిగ్ జామ్ తుఫాన్ (Cyclone) బాప‌ట్ల వ‌ద్ద తీరాన్ని దాటడంతో ఏపీ, త‌మిళ‌నాడుల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. అయితే తీరాన్ని దాటిన తుఫాను తీవ్ర‌వాయుగుండంగా మారింది. ఇప్పుడు అది ఈశాన్య తెలంగాణ వైపుగా పయ‌నిస్తూ వాయుగుండంగా (Depression) మారుతుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ (IMD) అధికారులు తెలిపారు.
Revanth Reddy: ఢిల్లీలో రేవంత్ రెడ్డి బిజీ బిజీ, కేబినెట్ కూర్పుపై డీకే శివ‌కుమార్ తో సుధీర్ఘ స‌మావేశం, ఇవాళ ఖ‌ర్గే, సోనియా, రాహుల్ ను కలువ‌నున్న రేవంత్
VNSతెలంగాణ సీఎంగా ఎంపికైన రేవంత్‌రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆయనకు.. ఎయిర్‌పోర్టులో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం ఆయన ఎయిర్‌పోర్టు నుంచి తెలంగాణ భవన్‌కు వెళ్లారు. అక్కడ అధికారులు సీఎం హోదాలో రేవంత్ కు ప్రోటోకాల్ స్వాగతం పలికారు
Telangana New CM Revanth Reddy: ZPTC టు CM... తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీవిత ప్రయాణం ఇదే..
ahanaతెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి రేవంత్ రెడ్డి రికార్డు సృష్టించారు. ఏబీవీపీలో విద్యార్థి నాయకుడిగా మొదలైన ఆయన రాజకీయ జీవితం ZPTC స్థాయి నుంచి సీఎం వరకూ సాగింది.
Sabarimala Special Trains: శబరిమల పోతున్నారా..అయితే 32 స్పెషల్ రైళ్లు సిద్ధం..తెలుగు రాష్ట్రాల్లో ఏ ఊరి నుంచి రైలు వెళ్తుందో చూసుకొని బుక్ చేసుకోండి..రైళ్లు లిస్టు ఇదే...
ahanaశబరిమల యాత్రికుల అదనపు రద్దీని తగ్గించడానికి, దక్షిణ మధ్య రైల్వే వివిధ గమ్యస్థానాల మధ్య 32 అదనపు ప్రత్యేక రైళ్లను నడపడానికి సిద్ధం అయ్యింది.
Cyclone Michaung Update: వీడియో ఇదిగో, కోనసీమలో టోర్నాడో భీభత్సం, సుడులు తిరుగుతూ స్థానికులను వణికించిన భయంకరమైన గాలులు
Hazarath Reddyతుపాను తీరం దాటినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైక్లోన్ దెబ్బకి కోనసీమలో టోర్నాడోలు దర్శనమిచ్చింది. గాలి సుడులు తిరుగుతూ భయంకరంగా మారి స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. వీడియో ఇదిగో..
Cyclone Michaung Update: బాపట్ల సమీపంలో తీరం దాటిన మిచౌంగ్ తీవ్ర తుఫాన్, రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
Hazarath Reddyపశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తీవ్ర తుఫాన్ (Cyclone Michaung Update) బాపట్ల సమీపంలో తీరాన్ని దాటిందని (Michaung crosses AP coast) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. తీరం వెంబడి గంటకు 90-100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయని వాతావరణ శాఖ పేర్కొంది
New Telangana CM Revanth Reddy: స్వతంత్ర అభ్యర్థి నుంచి సీఎం దాకా రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే, ఈ నెల 7న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి
Hazarath Reddyతెలంగాణ కొత్త ముఖ్యమంత్రి (Telangana CM Revanth Reddy) ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ఫైన‌ల్ చేసిన‌ట్లు కాంగ్రెస్ పార్టీ నేష‌న‌ల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్ ప్ర‌క‌టించారు. సీఎల్పీ నేతగా ఆయన పేరును అధికారికంగా ప్రకటించింది కాంగ్రెస్‌ పార్టీ.
Revanth Reddy as Telangana New CM: తెలంగాణ ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి, అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం
Hazarath Reddyతెలంగాణ కొత్త ముఖ్యమంత్రి (Telangana CM Revanth Reddy) ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ఫైన‌ల్ చేసిన‌ట్లు కాంగ్రెస్ పార్టీ నేష‌న‌ల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్ ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని ఢిల్లీలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి అధికారికంగా ప్ర‌క‌టించారు.
Dwarampudi on Revanth Reddy: రేవంత్ రెడ్డి సీఎంగా ఎక్కువ కాలం ఉండడు, సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
Hazarath Reddyతెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార బీఆర్ఎస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చిన సంగతి విదితమే. తెలంగాణకు కొత్త సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ సాగుతున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టే తెలుగుదేశం పార్టీ ఓడిపోవాలన్న ద్వారంపూడి తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎంగా ఎక్కువ కాలం ఉండడని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Telangana CM Selection: సీఎం అయ్యేందుకు నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, పదవిని ఆశించడంలో తప్పేముందని బాంబు పేల్చిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.అయితే అధిష్ఠానం దాదాపు రేవంత్ రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా తెలంగాణ సీఎం పదవి రేసులో తాను కూడా ఉన్నట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పునరుద్ఘాటించారు
Skill Development Scam Case: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసు మరో మలుపు, అప్రూవర్‌గా మారుతున్నట్లు ఏసీబీ కోర్టుకు తెలిపిన ఏ13 నిందితుడు చంద్రకాంత్ షా
Hazarath Reddyఏపీలో సంచలనం రేపిన ‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌’ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏ13 నిందితుడు చంద్రకాంత్ షాని ఏసీబీ కోర్టు ముందు సీఐడీ అధికారులు హాజరుపర్చారు. అప్రూవర్‌గా మారుతున్నట్లు కోర్టు ఎదుట చంద్రకాంత్ షా తెలిపారు.
Cyclone Michaung: వీడియో ఇదిగో, బాపట్లలో అల్లకల్లోలంగా మారిన సముద్రం, బలమైన గాలులతో భయానకంగా ఎగసిపడుతున్న అలలు
Hazarath Reddyతీరం వెంబడి గంటకు 90-100 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. రాగల రెండు గంటల్లో తుఫానుగా బలహీనపడుతుందని తెలిపింది. Cyclone Michuang తీరాన్ని తాకడంతో ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. బలమైన గాలులు, భారీ వర్షంతో వణికిస్తోంది.
New Telangana CM: తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి, డిసెంబరు 7న ప్రమాణ స్వీకారం, ఆయనతో పాటు మరికొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా వార్తలు
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.అయితే అధిష్ఠానం దాదాపు రేవంత్ రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ANI ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబోతున్నారు. డిసెంబరు 7న ఆయనతో పాటు మరికొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Telangana CM Selection: రేవంత్ రెడ్డిని సీఎం చేయాలంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన కాంగ్రెస్ కార్యకర్త
Hazarath Reddyగచ్చిబౌలిలోని హోటల్ ఎల్లా వద్ద పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు... రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారు హోటల్లోకి దూసుకువెళ్లే ప్రయత్నాలు చేశారు. అయితే పోలీసులు... కార్యకర్తలను నిలువరించి బయటకు పంపించారు. ఈ సమయంలో ఓ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు అతనిని అడ్డుకున్నారు.
Telangana CM Selection: తెలంగాణ సీఎం రేసులో మరో ఇద్దరు, ఖర్గే నివాసంలో ముగిసిన సమావేశం, హైదరాబాద్ బయలుదేరిన డీకే శివకుమార్, కాసేపట్లో ప్రకటన వెలువడే అవకాశం
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.అయితే అధిష్ఠానం దాదాపు రేవంత్ రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు