తెలంగాణలోని ఖైరతాబాద్ వినాయకుడిని సందర్శించేందుకు వచ్చిన మహిళా భక్తులను వేధించినట్లు ఆరోపణలతో హైదరాబాద్ పోలీసుల షీ టీమ్స్ భారీ స్థాయిలో చర్యలు చేపట్టాయి. కేవలం ఒక వారం వ్యవధిలోనే 900 మందికి పైగా వ్యక్తులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనేక వీడియోల్లో ఖైరతాబాద్ వినాయక విగ్రహం సమీపంలో పురుషులు మహిళలను వేధిస్తున్న దృశ్యాలు బయటపడ్డాయి. ఈ ఘటనలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహం రేపాయి. స్థానిక మీడియా రిపోర్టుల ప్రకారం, పట్టుబడిన నిందితుల్లో 55 మంది పురుషులు మహిళల పట్ల బహిరంగంగా అసభ్య ప్రవర్తిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. నిందితులపై కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచారు. కొందరిని కౌన్సెలింగ్ అనంతరం విడిచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.

షాకింగ్ వీడియో ఇదిగో.. ఆల్ఫా ఇంటర్నేషనల్ స్కూల్ హాస్టల్‌లో విద్యార్థిని దారుణంగా చితకబాదిన మరికొందరు విద్యార్థులు

ఖైరతాబాద్ వినాయకుని వద్ద మహిళలతో అసభ్య ప్రవర్తన

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)