రాష్ట్రీయం
Jagitial Bribe Row: లంచం అడిగిన అధికారి మెడలో నోట్ల దండ వేసి ‘సత్కారం’ చేసిన మత్స్యకార సంఘాల సభ్యులు.. వీడియోతో
Rudraజగిత్యాల జిల్లా మత్స్యశాఖ అధికారి లంచం కోసం పీడిస్తున్నాడని ఆరోపిస్తూ మత్స్యకారులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు.
Biryani at Rs. 2: హైదరాబాద్ బిర్యానీ ప్రియులకు శుభవార్త.. రూ.2కే పసందైన బిర్యానీ.. నాన్‌ వెజ్‌ లేదా వెజిటబుల్‌ బిర్యానీ ఏది తీసుకున్నా అంతే ధర.. అయితే, ఒకేఒక నిబంధన.. అది కూడా చాలా చిన్నది. ఏంటంటే??
Rudraహైదరాబాద్ అంటేనే బిర్యానీ సువాసనలు. మరి అలాంటి బిర్యానీ ప్రియులకు ఓ శుభవార్త. పసందైన బిర్యానీ కేవలం రూ.2కే ఆస్వాదించొచ్చు.
Rythu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్, రైతుబంధు విడుదల చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు, ప్రస్తుతానికి ఎంతంటే..
Hazarath Reddyతెలంగాణ రైతులకు పంట పెట్టుబడి సాయం చెల్లింపులను తెలంగాణ కొత్త ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధుల విడుదలకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతుబంధు పేరుతో పంట పెట్టుబడి సాయాన్ని అందించారు
Telangana: సివిల్ వివాదం, పోలీస్‌స్టేషన్ నుండి బయటకు వచ్చిన కొద్ది నిమిషాలకు గుండెపోటుతో 50 ఏళ్ళ వ్యక్తి మృతి, పోలీసులు దాడి చేయడం మరణించారని కుటుంబ సభ్యుల ఆరోపణలు
Hazarath Reddyతెలంగాణలోని నల్గొండ జిల్లాలో సివిల్ వివాదంలో పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన 50 ఏళ్ల వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తన సోదరుడితో ఆస్తి వివాదానికి సంబంధించి చింతపల్లి పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన సూర్యా నాయక్, పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చిన కొద్ది నిమిషాలకే అస్వస్థతకు గురయ్యాడు
Ganji Chiranjeevi: గంజి చిరంజీవిని మంగళగిరి ఇంఛార్జ్‌గా ప్రకటించిన వైసీపీ అధిష్ఠానం, ఆర్కే రాజీనామా తర్వాత ఒక్కసారిగా మారిన రాజకీయాలు
Hazarath Reddyమంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రాజీనామా నేపథ్యంలో గంజి చిరంజీవిని మంగళగిరి ఇంఛార్జ్‌గా వైసీపీ అధిష్ఠానం ప్రకటించింది. ప్రస్తుతం ఆప్కో ఛైర్మన్, వైసీపీ చేనేత విభాగం అధ్యక్షుడిగా గంజి చిరంజీవి ఉన్నారు. నిన్న మంగళగిరిలో తన సొంత కార్యాలయాన్ని ప్రారంభించిన గంజి చిరంజీవి. ఈ నేపథ్యంలోని అసంతృప్తిని గురైన ప్రస్తుత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం.
Chiranjeevi Visits KCR in Hospital: వీడియో ఇదిగో, కేసీఆర్‌ను పరామర్శించిన చిరంజీవి, సినిమా పరిశ్రమ గురించి అడిగారని తెలిపిన మెగాస్టార్
Hazarath Reddyయశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను..మెగాస్టార్ చిరంజీవి సోమవారం సాయంత్రం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తాను కేసీఆర్‌ను పరామర్శించానని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, హుషారుగా ఉన్నారని తెలిపారు. ఆరు వారాల్లోగా ఆయన కోలుకోవచ్చునని వైద్యులు చెప్పారన్నారు.
Nara Devansh in Yuvagalam Padayatra: వీడియో ఇదిగో, తండ్రితో కలిసి పాదయాత్రలో నడిచిన నారా దేవాన్ష్, ఈ నెల 18న ముగియనున్న నారా లోకేష్‌ పాదయాత్ర
Hazarath Reddyనారా లోకేశ్ యువగళం పాదయాత్రలో తనయుడు నారా దేవాన్ష్ పాల్గొన్నారు. నాన్నతో కలిసి కాలు కదిపారు. తనయుడి చేయి పట్టుకొని లోకేశ్ కాసేపు పరుగు తీశారు. దేవాన్ష్ తండ్రితో కలిసి పరుగు పెట్టడం అక్కడున్న వారికి ముచ్చటగొలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పాదయాత్రలో నారా బ్రాహ్మిణి కూడా పాల్గొన్నారు.
Telangana Assembly Speaker Election: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నిక తేదీ ఇదిగో, వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ను ఖరారు చేసిన కాంగ్రెస్
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నిక ఈ నెల 14న జరగనుంది. స్పీకర్‌ ఎన్నిక తేదీని ఖరారు (Telangana Assembly Speaker Election) చేస్తూ అసెంబ్లీ సెక్రటేరియట్‌ సోమవారం(డిసెంబర్‌11)నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్పీకర్‌ పదవికి పోటీపడే వారే నుంచి ఈ నెల 13న ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు
Chandrababu Visits KCR in Hospital: వీడియో ఇదిగో, కేసీఆర్‌ను పరామర్శించిన చంద్రబాబు, త్వరలోనే కేసీఆర్‌ మామూలుగా నడుస్తారని ఆకాంక్షించిన మాజీ సీఎం
Hazarath Reddyతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, BRS అధినేత కేసీఆర్‌ (KCR) వీలైనంత త్వరగా కోలుకొని ప్రజా సేవకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఆకాంక్షించారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను చంద్రబాబు పరామర్శించారు.
YSR Law Nestham: రెండోవి­డత వైఎస్సార్‌ లా నేస్తం నిధులు విడుదల చేసిన ఏపీ సీఎం జగన్, 2,807 యువ లాయర్ల అకౌంట్లలో రూ.7,98,95,000 జమ
Hazarath Reddyరాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్‌ న్యాయవాదులకు నెలకు రూ.5,000 స్టైఫండ్‌ చొప్పున ఈ ఏడాది జూలై నుంచి డిసెంబర్‌ వరకు ఆరునెలలకు ఒక్కొ­క్కరికి రూ.30 వేల వంతున మొత్తం రూ.7,98,95,000ను వారి ఖాతాల్లో జమచేశారు.
Hyderabad: వీడియో ఇదిగో, అయ్యప్పమాల ధరించిందని బాలికను స్కూలు లోపలికి రానివ్వని యాజమాన్యం, దాదాపు గంటపాటు ఎండలో నిలబడిన పాప
Hazarath Reddyహైదరాబాద్ రాజేంద్ర నగర్ పరిధిలోని బండ్లగూడలో ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం... అయ్యప్ప మాల ధరించిన బాలికను స్కూలులోకి అనుమతించలేదు. పాఠశాలలోకి మాలతో అనుమతి లేదని, స్కూల్ దుస్తుల్లోనే రావాలని చెప్పింది. దీంతో మాల వేసుకున్న పాప దాదాపు గంటపాటు ఎండలో నిలబడవలసి వచ్చింది
Alla Ramakrishna Reddy Resigns: మంగళగిరిలో వైసీపీకి బిగ్ షాక్, ఎమ్మెల్యే పదవికి, పార్టీకి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా, వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్టు వెల్లడి
Hazarath Reddyఏపీ రాజకీయాల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తన పదవికి రాజనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో ఆయన తన రాజీనామాను సమర్పించారు. శాసనసభ కార్యదర్శికి ఆయన తన రాజీనామా లేఖను స్వయంగా అందజేశారు
Andhra Pradesh: వీడియో ఇదిగో, సూర్యలంక బీచ్‌లో అలలకు కొట్టుకుపోతున్న ఇద్దరు యువకులను రక్షించిన పోలీసులు, అభినందనలు తెలిపిన డీజీపీ
Hazarath Reddyసూర్యలంక బీచ్‌కి వచ్చి అలల తాకిడికి సముద్రంలో ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు. మునిగిపోతున్న ఇద్దరు యువకులను చూసిన తీరం వెంబడి గస్తీ పోలీసులు వెంటనే సముద్రంలోకి వెళ్లి వారి ప్రాణాలను కాపాడి ఒడ్డుకు చేర్చారు.యువకులను తెనాలి టౌన్‌కి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
TSRTC Free Ticket Row: సీఎం రేవంత్ ‘ఫ్రీ టిక్కెట్టు’ ఆదేశాల్ని ధిక్కరించిన కండక్టర్? నిజామాబాద్‌ లో మహిళలకు టిక్కెట్టు ఇచ్చినట్టు వీడియో వైరల్, అసలు విషయం ఏంటంటే..
Rudraఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకాన్ని కాంగ్రెస్ సర్కారు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్కీం అమల్లో ఉండగా మహిళలకు టిక్కెట్లు జారీ చేసిన ఓ కండక్టర్ ఉదంతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
TS Govt: తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం, ఏకంగా 54 మంది నియామ‌కాలు ర‌ద్దు చేస్తూ ఉత్త‌ర్వులు
VNSప్రభుత్వం మారడంతో ఇప్పటికే పలు కార్పొరేషన్ల చైర్మన్లు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఇదిలా ఉండగా.. రెండు రోజుల కింద సర్కారు.. ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న ఏడుగురిని తొలగించిన విషయం తెలిసిందే. వీరితో పాటు స్పెషల్ ఆఫీసర్ల నియామకాలను సైతం రద్దు చేసింది.
Telangana CM Revanth Reddy visits Yashoda Hospital: యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ గారిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి.
ahanaతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు తుంటి మార్పిడి శస్త్రచికిత్సతో చికిత్స పొందుతున్న యశోద ఆసుపత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి ఆదివారం సందర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
Documents Missing: పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో కీలక దస్త్రాలు మాయం.. కిటికీ గ్రిల్స్ తొలగించి పైల్స్ ఎత్తుకెళ్లినట్లుగా సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్.. ఖండించిన తలసాని ఓఎస్డీ కల్యాణ్
Rudraతెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో పలు కీలకమైన దస్త్రాలు అదృశ్యమయ్యాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ కార్యాలయంలో ఈ ఫైల్స్ మాయమైనట్లు అధికారులు గుర్తించారు.
Maha Lakshmi Scheme: అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే 2 హామీలను అమల్లోకి తెచ్చిన రేవంత్ రెడ్డి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు
VNSమహా లక్ష్మీ పథకంలో భాగంగా ఈరోజు నుంచి తెలంగాణలోని యావత్ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో (Maha Lakshmi Scheme) ఉచిత ప్రయాణం కల్పిస్తు పథకాన్ని (Free Bus) ప్రారంభించారు. దీంట్లో భాగంగా అసెంబ్లీ ఆవరణలో మూడు బస్సులను ప్రారంభించారు. ఉచిత బస్సు ప్రయాణం అనేది కేవలం ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఉంటుందనే వార్తలు వచ్చాయి.
KCR Health Update: కోలుకుంటున్న కేసీఆర్, సర్జరీ అయిన మరుసటి రోజే వాకర్‌ తో నడిపించిన వైద్యులు, కేసీఆర్ మానసికంగా చాలా దృఢంగా ఉన్నారన్న వైద్యులు(వీడియో)
VNSకేసీఆర్ ఆరోగ్య పరిస్థితి లో ప్రోగ్రెస్ బాగుంది. చాలా వేగంగానే రికవరీ అవుతున్నారు. వాకర్ తో బెడ్ బయటకు వచ్చి కూర్చున్నారు. వాకర్ సాయంతో మేము రూమ్ లో నడిపించే ప్రయత్నం చేసినపుడు కేసీఆర్ శరీరం బాగా స్పందించిందని చెప్పారు. వారు రూమ్ లో వాకర్ సాయంతో నడిచారు. దీన్ని మెడికల్ పరిభాషలో “ మొబిలైజేషన్ స్టార్ట్” అంటారు.
Telangana Assembly: ఎమ్మెల్యేగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి, మంత్రులు, చెప్పిన‌ట్లుగానే అసెంబ్లీకి రాని బీజేపీ ఎమ్మెల్యేలు, అనారోగ్యంతో స‌భ‌కు దూరమైన మాజీ సీఎం కేసీఆర్
VNSముందుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth reddy), తర్వాత ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆ తర్వాత వరుసగా మంత్రులు ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్‌కు (KCR) సర్జరీ దృష్ట్యా ప్రమాణ స్వీకారానికి కేటీఆర్ రాలేదు.