ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh: ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద విధుల్లో ఉన్న 8 మంది పోలీసులకు కరోనా పాజిటివ్,  ఏపిలో ఇప్పటికే 18 వేలకు చేరువలో ఉన్న మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య

Team Latestly

క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్న సిబ్బందికి కొందరిలో కరోనా లక్షణాలు కనిపించడంతో రెండు రోజుల క్రితం వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో శనివారం రోజు వీరికి సంబంధించిన పరీక్షా ఫలితాలు రాగా, 8 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది...

COVID-19 Vaccine: ఆగష్టు 15 లోపు కోవిడ్ వ్యాక్సిన్; మానవ ట్రయల్స్ పట్ల టెస్టింగ్ సెంటర్లకు ఐసీఎంఆర్ డెడ్‌లైన్ విధించడం పట్ల విమర్శలు, వివరణ ఇచ్చుకున్న కౌన్సిల్

Team Latestly

నికల్ ట్రయల్స్ ను వేగవంతం చేయమని ఐసీఎంఆర్ దేశంలోని నిర్ధేషిత ఆరోగ్య కేంద్రాలకు లేఖలు రాయడం పట్ల నిపుణుల నుంచి విమర్శలు వెలువెత్తాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి తేవడంలో అంతతొందరెందుకు...

TDP Leader Kollu Ravindra Arrest: వైసీపీ నేత హత్య కేసు, టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్, ఇప్పటికే ఈ కేసులో అయిదుమందిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

ఏపీలో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్‌ యార్డు కమిటీ మాజీ చైర్మన్‌ మోకా భాస్కరరావు హత్యకేసును జగన్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ కేసులో రవీంద్ర హస్తం కూడా ఉందని భాస్కర్ రావు కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో టీడీపీ మాజీ మంత్రిని (TDP Leader Kollu Ravindra Arrest) పోలీసులు అరెస్ట్ చేశారు. తనను అరెస్టు చేస్తారన్న ఉద్దేశంతో ఆయన తన స్వస్థలమైన మచిలీపట్నం నుంచి విశాఖ వైపు వెళ్తూ పోలీసులకు చిక్కారు.

NEET, JEE Exams 2020: నీట్, జేఈఈ 2020 పరీక్షలు సెప్టెంబర్ వరకు వాయిదా, కొత్త తేదీలను ప్రకటించిన కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రి రమేష్ పోఖ్రియాల్

Team Latestly

కొత్త తేదీల ప్రకారం, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి జెఇఇ మెయిన్ - ప్రవేశ పరీక్షలు సెప్టెంబర్ 1 నుండి 6 వరకు జరగనున్నాయి. జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష సెప్టెంబర్ 27న జరుగుతుంది...

Advertisement

Unlock 2.0 Guidelines in AP: ఏపీలో అమల్లోకి ఆన్‌లాక్‌ 2.0 నిబంధనలు, కంటైన్‌మెంట్‌ జోన్లలోనే నిబంధనలు అమలు, జూలై 1 నుంచి 31 వరకు అన్‌లాక్‌ 2.0 అమల్లో..,

Hazarath Reddy

ఏపీలో ఆన్‌లాక్‌ 2.0 నిబంధనలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోం శాఖ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు వెలువరించింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో నిబంధనలు అమలు చేయాలని.. అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కాగా, కరోనా లాక్‌డౌన్ ఆంక్షలను దశలవారీగా‌ సడలించే ప్రక్రియలో భాగంగా కేంద్రం ఇటీవల అన్‌లాక్‌ 2.0 మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూలై 1 నుంచి 31 వరకు అన్‌లాక్‌ 2.0 అమల్లో ఉంటుందని కేంద్ర హోం శాఖ ప్రకటించింది.

AP Coronavirus Update: తిరుమలలో పది మందికి కరోనా, ఏపీలో తాజాగా 837 కేసులు నమోదు, రాష్ట్ర వ్యాప్తంగా 16,934కి చేరిన కోవిడ్-19 కేసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 837 కరోనా పాజిటివ్‌ కేసులు (AP COVID Report) నమోదయ్యాయి. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 38,898 శాంపిల్స్‌ పరీక్షించగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో (Andhra Pradesh) 9,71,611 పరీక్షలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 40 మందికి, విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా వైరస్‌ సోకింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 258 క్షేమంగా డిశ్చార్జ్‌ అయ్యారు. వైరస్‌ బారిన పడి 8 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా 9,096 బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 16,934కి చేరింది.

iMASQ Buses in AP: కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు, ఐ-మాస్క్ బస్సుల్లో కోవిడ్-19 నిర్థారణ పరీక్షలు, విజయవాడలోనే 8 ఐ మాస్కు బస్సులు ఏర్పాటు చేసిన ఏపీ సర్కారు

Hazarath Reddy

దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కరోనా నిర్థారణ పరీక్షలో ముందున్న ఆధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసేందుకు ఏర్పాట్లు చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఐ-మాస్క్ బస్సుల్లో (iMASQ buses) కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కేవలం ఒక్క విజయవాడ లోనే 8 బస్సులను (iMASQ) ఏర్పాటు చేసింది. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు పరచాలనుకుంటున్నట్లు తెలిపారు.

Moka Bhaskar Rao's Murder Case: టీడీపీకీ మరో దెబ్బ, మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై కేసు నమోదు, వైసీపీ నేత హత్య కేసులో రవీంద్రకు భాగం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు

Hazarath Reddy

ఇటీవల మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని ప్రధాన అనుచరుడు మోకా భాస్కరరావు హత్య (Moka Bhaskar Rao's Murder Case) తీవ్ర సంచలనం సృష్టించింది. అనుచరుడు చనిపోవడంతో మంత్రి పేర్ని నాని బోరున విలపించారు. ఎట్టకేలకు మోకా భాస్కరరావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. టీడీపీ నేత చింతా చిన్ని సహా మరో ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజకీయ ఆధిపత్యం కోసమే భాస్కరరావును హత్య చేశారని పోలీసుల విచారణలో నిర్దారణ అయ్యింది. హత్య కేసులో మరికొందరినీ విచారించనున్నారు.

Advertisement

Shameful Act: ఫేస్‌బుక్ పరిచయం, ఇద్దరు ప్రియులతో వివాహిత అక్రమ సంబంధం, అభంశుభం తెలియని ఐదేళ్ల చిన్నారి ఉసురుతీసిన వైనం. మేడ్చల్ హత్యోదంతంలో వెలుగులోకి వచ్చిన సంచలన నిజాలు!

Team Latestly

తెలంగాణలోని భువనగిరికి చెందిన కళ్యాణ్‌కు, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన అనూష అనే యువతికి కొన్నేళ్ల కిందట ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది, వీరి పరిచయం ప్రేమగా మారి ...

AP Coronavirus: అనంతపురంలో ఒక్కరోజే 134 కరోనా కేసులు, ఏపీలో తాజాగా 845 కోవిడ్-19 కేసులు, రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 9,32,713 పరీక్షలు నిర్వహణ, ఏపీలో 16097కి చేరిన మొత్తం కేసుల సంఖ్య

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 14,285 సాంపిల్స్‌ను పరీక్షించగా.. 845 మంది పాజిటివ్‌గా నిర్ధారణ (AP Coronavirus) అయ్యారు. ఇందులో రాష్ట్రంలో 812 కేసులు కాగా, 29 కరోనా కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారివి. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చి వైరస్‌ బారిన పడ్డ వారు నలుగురు. వైరస్‌ బారినపడి ఐదుగురు బాధితులు మృత్యువాత పడ్డారు. 281 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్‌ అయ్యారు.

Guntur Road Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి, విజయవాడ వైపు వెళ్తన్న కారును ఢీకొట్టిన కంటైనర్ లారీ

Hazarath Reddy

గుంటూరు జిల్లాలోని యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద బుధవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Guntur Road Accident) చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. విజయవాడవైపు వెళ్తన్న కారును కంటైనర్ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురులో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులను అత్తులూరి బలరాం(25), ఫిరో అహ్మద్‌(35), వింజమూరి హరికృష్ణ(26), మేడసాని వెంకట శ్రీచందు(25)గా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

AP Coronavirus: ఏపీ హైకోర్టు జడ్జి తీరుపై అంతర్గత విచారణకు ఆదేశించండి, రాష్ట్రపతి, సీజేఐలకు లేఖ రాసిన హన్స్‌రాజ్‌, కోవిడ్ పరిస్థితులు ఎదుర్కోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణ

Hazarath Reddy

ఏపీ హైకోర్టులో కోవిడ్‌-19 పరిస్థితులను (AP Coronavirus) ఎదుర్కోవడంలో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి (Jitendra Kumar Maheshwari) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆయన తీరుపై అంతర్గత విచారణకు ఆదేశించాలని పేర్కొంటూ ఆల్‌ ఇండియా బీసీ ఫెడరేషన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హన్స్‌రాజ్‌ (hansraj) రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ (Ram nath Kovind), సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, సుప్రీం న్యాయమూర్తులకు, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు విజ్ఞప్తి చేస్తూ లేఖలు రాశారు.

Advertisement

AP COVID-19 Report: ఏపీ హైకోర్టులో పనిచేస్తున్న 16 మందికి కరోనా, రాష్ట్రంలో తాజాగా 657 కరోనా కేసులు నమోదు, 15,252కి చేరిన మొత్తం కేసుల సంఖ్య, ఇప్పటివరకు 193 మరణాలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 657 కరోనా పాజిటివ్‌లుగా (AP COVID-19 Report) నమోదవగా, ఆరుగురు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 15,252కి చేరగా, ఇప్పటివరకు 193 మంది (coronavirus deaths) మరణించారు. రాష్ట్రంలోని మొత్తం కరోనా బాధితుల్లో 6988 మంది కోలుకోగా, 8071 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల్లో 39 మంది ఇతర రాష్ర్టాలకు చెందినవారు కాగా, ఏడుగురు ఇతర దేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు.

AP CM Doctor's Day Wishes: దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోంది, నేడు ఏపీ చరిత్రలో సువర్ణాధ్యాయం, 104,108 సర్వీసు వాహనాలను ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

జాతీయ వైద్యుల దినోత్సవం రోజున ఒకేసారి 1,008 సంఖ్యలో అధునాతన 104,108 సర్వీసు వాహనాలను ప్రారంభించడం గొప్ప ఆనందాన్ని ఇచ్చిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) అన్నారు. ఈ మేరకు బుధవారం ట్వీట్టర్‌ వేదికగా ఆయన జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు ( #DoctorsDay) తెలియజేశారు. ఏపీ (Andhra Pradesh) చరిత్రలో ఈ రోజు ఒక సువర్ణాధ్యాయంగా నిలుస్తుంది. ఒకేసారి 1088 అధునాతన 104, 108 సర్వీసు వాహనాలను, గుంటూరు జీజీహెచ్ లో క్యాన్సర్ కేర్ సెంటర్ ను ప్రారంభించడం గొప్ప ఆనందాన్నిస్తోంది. ప్రతి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వం మనదని మొత్తం దేశం చూసేలా చాటిచెప్పాం’ అని ఏపీ సీఎం జగన్‌ ట్వీట్‌ (AP CM Doctor's Day Wishes) చేశారు.

Amara Raja Infra Private Ltd: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కంపెనీకి ఏపీ సర్కారు భారీ షాక్, 253.61 ఎకరాల భూమిని వెనక్కి తీసుకున్న ప్రభుత్వం, దీని విలువ సుమారు రూ.60 కోట్లకు పైమాటే

Hazarath Reddy

తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ (MP Galla Jayadev) కంపెనీకి ఏపీ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. చిత్తూరు జిల్లాలో అమరరాజా ఇన్‌ఫ్రా టెక్‌కు (Amara Raja Infratech) ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) ఏర్పాటుకు కేటాయించిన భూమిలో 253.61 ఎకరాలను వెనక్కి తీసుకోవడానికి APIIC (ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ)కి అనుమతిస్తూ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌. కరికాల వలవన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డిజిటల్ వరల్డ్ సిటీ / ఇండస్ట్రియల్ పార్క్ స్థాపన కోసం అమరా రాజా ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 253.61 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో కేటాయించింది.

104,108 Services in AP: వైయస్ జగన్ మరో ముందడుగు, అత్యవసర సేవలు అందించే 108, 104 సర్వీసులను లాంచ్ చేసిన ఏపీ సీఎం, నేరుగా జిల్లాలకు వెళ్లనున్న వాహనాలు

Hazarath Reddy

వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికే దిశగా ఏపీ సీఎం (AP CM YS Jagan) అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజారోగ్య రంగంలో ప్రధానంగా అత్యవసర సేవలందించే 108, 104 అంబులెన్స్‌లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. అత్యవసర వైద్య సేవలందించే 108, 104 సర్వీసులను (104,108 Services in AP) ఏకంగా 1,088 వాహనాలను నేడు సీఎం విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద లాంచ్ చేయనున్నారు.

Advertisement

AP Tourism Hotel Violence: నెల్లూరు ఘటనపై స్పందించిన హోమంత్రి, దాడి చేసిన వ్యక్తిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు, దిశ యాప్ గురించి ప్రస్తావన

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో గల ఏపీ టూరిజం హోటల్‌లో (AP tourism hotel) మాస్క్‌ ధరించాలని సూచించిన కాంట్రాక్ట్‌ మహిళా ఉద్యోగినిపై డిప్యూటీ మేనేజర్‌ భాస్కర్‌ దాడి (AP Tourism Hotel Violence) చేసిన విషయం మీద హోం మంత్రి సుచరిత (AP Home minister) స్పందించారు. మహిళా ఉద్యోగినిపై దాడి జరగడం బాధాకరం అన్నారు. దాడి చేసిన వ్యక్తిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. ఆ కేసును దిశ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసి డీఎస్పీ స్థాయి అధికారితో విచారణకు ఆదేశించామని ఆమె తెలిపారు.

108,104 Ambulance Services in AP: రేపే 108, 104 సర్వీసులు ప్రారంభం, అత్యాధునికంగా తీర్చిదిద్దిన 1068 అంబులెన్సులను లాంచ్ చేయనున్న ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Chief Minister YS Jagan Mohan Reddy) విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతున్నారు. ఇప్పటికే పలు పథకాలను చేపట్టిన ఏపీ సీఎం తాజాగా ఆరోగ్యశ్రీ పథకంలో పలు మార్పులను తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా అత్యవసర వైద్య సేవలందించే 108, 104 సర్వీసులను అందుబాటులోకి (1,068 new 108 ambulances) తీసుకువస్తున్నారు. రేపు ఉదయం 9:35 గంటలకు సీఎం వైఎస్‌ జగన్ విజయవాడ బెంజి సర్కిల్‌ వద్ద అత్యాధునిక అంబులెన్స్‌ సర్వీసులను (ambulances) ప్రారంభించనున్నారు.విషమ పరిస్థితిల్లో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా చికిత్స అందించేలా వాటిలో మార్పులు చేశారు. వాటి సంఖ్యను కూడా గణనీయంగా పెంచారు. ఇంకా చిన్నారుల కోసం కూడా ప్రత్యేకంగా నియో నేటల్‌ అంబులెన్సులు ప్రారంభిస్తున్నారు.

Vizag Pharma Company Gas Leak: విశాఖపట్నం ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్, ఇద్దరు మృతి, నలుగురికి అస్వస్థత, ప్రమాద ఘటనపై ఆరా తీసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

Hazarath Reddy

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్ (VIzag LG Polymers Gas leak) లీకేజీ ఘటన మరువకముందే విశాఖపట్నంలో (Visakhapatnam) మరో విషాదం చోటు చేసుకుంది. పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్‌ కెమికల్స్ లో (Vizag pharma company) రియాక్టర్ నుంచి విష వాయువు లీకవడంతో (Vizag Gas Leak) ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. మృతులను షిఫ్ట్‌ ఇంచార్జ్‌ నరేంద్ర, గౌరీశంకర్‌గా గుర్తించారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అస్వస్థతకు గురైన ఎల్వీ చంద్రశేఖర్, పి.ఆనంద్ బాబు, డి.జానకీ రామ్, ఎం.సూర్యనారాయణలను గాజువాకలోని ఆర్కే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కలెక్టర్‌ విననయ్‌చంద్‌, పోలీస్ కమిషనర్ ఆర్‌కే మీనా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తుస్తున్నారు.

Moka Bhaskar Rao Assassination: వైఎస్సార్‌సీపీ నేత దారుణ హత్య, సైనేడ్‌ పూసిన కత్తితో మోకా భాస్కర్‌ రావును హత్యచేసిన దుండుగులు, మచిలీపట్నంలో 144 సెక్షన్

Hazarath Reddy

కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో (Machilipatnam) వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత మోకా భాస్కర్‌ రావు (YCP Leader Moka Bhaskar Rao) దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు మున్సిపల్‌ చేపల మార్కెట్‌లో ఉన్న ఆయనను కత్తితో పొడిచి పరారయ్యారు. పక్కా ప్లాన్‌తో సైనేడ్‌ పూసిన కత్తితో భాస్కర్‌ రావును హత్య (Moka Bhaskar Rao Assassination) చేశారు.

Advertisement
Advertisement