AP DGP Damodar Goutam Sawang: మాకు కుటుంబం ఉంది, సెలవులు లేకుండా మీకోసం కష్టపడుతున్నాం, కరోనాని ఏపీ నుండి తరిమికొట్టడానికి అందరూ సహకరించాలి, మీడియాతో గౌతం సవాంగ్

ఏపీలో లాక్ డౌన్‌ను (AP Lockdown) పటిష్టంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు.పోలీసులు మీ సేఫ్టీ కోసమే పనిచేస్తున్నారు. ప్రతి పోలీస్‌కూ కుటుంబం ఉంటుందని, కానీ రాత్రింబవళ్లు సెలవులు కూడా లేకుండా వారు ప్రజల కోసం కష్టపడుతున్నారని తెలిపారు.

AP DGP Gowtham Sawang(Photo-Facebook)

Amaravati, Mar 28: కరోనా వైరస్ (COVID-19) ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో అందరూ ఇళ్లకే పరిమితం కావాలని, ఎవరూ అనవసరంగా బయటకు రావొద్దని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ (AP DGP Goutam Sawang) పిలుపునిచ్చారు. ఏపీలో లాక్ డౌన్‌ను (AP Lockdown) పటిష్టంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు.పోలీసులు మీ సేఫ్టీ కోసమే పనిచేస్తున్నారు. ప్రతి పోలీస్‌కూ కుటుంబం ఉంటుందని, కానీ రాత్రింబవళ్లు సెలవులు కూడా లేకుండా వారు ప్రజల కోసం కష్టపడుతున్నారని తెలిపారు.

కరోనా ఖేల్ ఖతం అంటున్న అమెరికా

పోలీసులు చాలా క్లిష్ట పరిస్థితుల్లో పని చేస్తున్నారని, తమకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అందరం కలిసి కరోనా మహమ్మారిని ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. మీరు పాటించాల్సిన జాగ్రత్తలు మీరు పాటించాలి. మీ బాద్యతే మీ భద్రత అని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ (DGP gowtham sawang) అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని ఏపీ డీజీపీ తెలిపారు. అందరూ కలిసి కరోనాను తరిమికొడదామని పిలుపునిచ్చారు.

ఇటలీలో కరోనా చావు కేకలు, ఒక్క రోజే 1000 మంది మృతి

స్వీయ నియంత్రణలో మనల్ని మనం కాపాడుకుందామని ఆయన సూచించారు. అమరావతి (Amaravati) గ్రామాల్లో కొందరు సమాచారం ఇవ్వకుండా దాక్కున్నారని తెలిసిందన్నారు. ఎవరైతే ఆశ్రయం ఇచ్చారో వారిపై కేసుల నమోదు చేస్తామన్నారు. చుట్టూ ఉన్న సమాజానికి నష్టం చేయొద్దన్నారు. జాతీయ విపత్తులో ఎంత వరుకు విజయం సాధిస్తాం అనేది మీ చేతులోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటి వరుకు కంఫర్టబుల్ జోన్ లోనె ఉంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనం బెటర్ గా ఉన్నాం.

ఇండియాలో 78 మంది రికవరీ, 873కి చేరిన కరోనా కేసులు

మరో 10 రోజులు ఏర్పాట్లు మరిన్ని చేయబోతున్నాం. ఉదయం నుండి మూడు రివ్యూ మీటింగ్స్ జరిగాయని తెలిపారు. పబ్లిక్ సెఫ్టీ, వెల్ఫేర్ కోసం అన్ని చర్యలు తీసుకోవడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. విదేశాల నుండి వచ్చిన వారిపై ఎక్కువ నిఘా పెట్టాం. సెల్ఫ్ క్వారంటైన్ పాటించాలి. విదేశాల నుండి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యులు సేఫ్ గా ఉండడం కోసమే జాగ్రత్తగా ఉండాలి.

కరోనాపై ఆర్మీ ‘ఆపరేషన్ నమస్తే’ వార్

45 వేల మందికిపైగా నిబంధనలు ఉల్లంఘించారన్నారు. వీరంతా వెంటనే వైద్య బృందాలకు, పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని ప్రజలంతా అర్ధం చేసుకోవాలని కోరారు. ఇదంతా మీ కుటుంబ సభ్యుల కోసమేనని తెలుసుకోవాలని పేర్కొన్నారు. అలాగే 6,571 వాహనాలు సీజ్ చేశామని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 69,839 మందిపై కేసులు నమోదు చేసి, జరిమానా విధించినట్లు చెప్పారు. నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించిన 4500 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు.

కరోనాపై చెత్త పోస్ట్, జైలుపాలయిన ఇన్ఫోసిస్ ఐటీ ఉద్యోగి

పోలీసులకు అందరూ సహకరించి, వైరస్‌ వ్యాప్తి చెయిన్‌ను బ్రేక్‌ చేద్దామని తెలిపారు. ఇంట్లోనే ఉండి, సురక్షితంగా ఉందామన్నారు. ఖాళీ రోడ్లపై యాక్సిడెంట్లు జరిగిన విషయం తెలిసిందన్నారు. ఇక నుంచి మరింత జాగ్రత్తగా ఉండేలా ఆదేశాలిస్తామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా క్వారంటైన్‌కు వెళ్లాలని సూచించారు.

10 నెలల చిన్నారికి కరోనావైరస్ పాజిటివ్

చాలామంది విదేశాల నుండి వచ్చి కూడా సమాచారం ఇవ్వకుండా ఇంట్లోనే ఉంటున్నారు. విదేశాల నుండి వచ్చారంటే తప్పు చేసినట్టు కాదు. ఇతరలకు ఇబ్బంది కలగకుండా ముందు జాగ్రత్త పాటించినట్టు భావించాలి. నిత్యావసర వస్తువుల కొనుగోలుకి మూడు నాలుగు గంటలు చాలు. పోలీసులు కొన్ని చోట్ల ఓవర్ గా వ్యవహరించారని నా దృష్టికి వచ్చింది. మీ మంచి కోసం చెబుతుంటే పోలీసులపై కూడా తిరగబడుతున్నారు. ఈ సమయంలో మంచితనంతో కంట్రోల్ చేయడం కష్టం.. అందరూ సహకరిస్తే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదని హితవు పలికారు.

కరోనావైరస్.. విద్యార్థులందరూ పాస్

తాము కావాలని కేసులు పెట్టడం లేదని, ఓవైపు కేసులు పెట్టాలన్నా బాధగా ఉందని డీజీపీ సవాంగ్ చెప్పారు. కాబట్టి ఎవరూ దీన్ని తప్పుగా తీసుకోవద్దని కోరారు. అలాగే కరోనాను కేంద్ర ప్రభుత్వం సైతం జాతీయ విపత్తుగా ప్రకటించిందని, కాబట్టి ఎవరూ బయటకు రావొద్దని డీజీపీ సవాంగ్ పిలుపునిచ్చారు. ఏపీలోకి రావాలని ఇతర రాష్ట్రాల నుంచి బోర్డర్ దగ్గరకు ఎవరూ రావొద్దని సూచించారు. ఒకవేళ ఎవరైనా వస్తే అది చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందన్నారు.