New Delhi, Mar 28: దేశంలో కరోనావైరస్ (Coronavirus) చాపకింద నీరులా మెల్లిగా విస్తరిస్తూ వెళుతోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14 వరకు ఇళ్లలోనుంచి ఎవరూ బయటకు రావద్దని ప్రధానమంత్రి మోడీ (PM Modi) లాక్ డౌన్ విధించారు. అన్ని రాష్ట్రాలు ఈ లాక్ డౌన్ పాటిస్తున్నాయి. అయితే ఆర్మీలో (Indian Army) పనిచేస్తున్న వారి పరిస్థితి ఏంటి.. వారికి రక్షణ ఎలా అనే సందేహం అందరికీ రావచ్చు. ఈ నేపథ్యంలో ఆర్మీ కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఆర్మీ చీఫ్ ప్రారంభించారు.
కరోనాపై చెత్త పోస్ట్, జైలుపాలయిన ఇన్ఫోసిస్ ఐటీ ఉద్యోగి
దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే సైనికుల కోసం ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే (Army Chief Gen Manoj Mukund Naravane) ఆపరేషన్ నమస్తే పేరుతో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు. ఆపరేషన్ నమస్తే (Operation Namaste) అనే ఈ కార్యక్రమంలో కరోనాపై పోరులో ప్రభుత్వానికి సాయం అందించడంతోపాటు పాక్, చైనా సరిహద్దుల్లోని 13 లక్షల మంది సైనికులు, వారి కుటుంబాలు వైరస్ బారిన పడకుండా చర్యలు తీసుకోనున్నారు.
ఎవరీ సైన్యాధిపతి మనోజ్ ముకుంద్
సైనిక సిబ్బంది తమ విధుల దృష్ట్యా సామాజిక దూరం పాటించడం సాధ్యం కాదని, అందుకే సాధ్యమైనన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో కీలకమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ‘మీ కుటుంబాల సంక్షేమం గురించి మేం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని సరిహద్దులోని జవాన్లకు హామీ ఇస్తున్నాను. ఈ కార్యక్రమంలో మేం విజయం సాధిస్తాం’ అని నరవణే తెలిపారు.
ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌కు కీలక బాధ్యతలను అప్పగించిన కేంద్రం
ఆపరేషన్ నమస్తేలో భాగంగా ప్రత్యేకంగా కమాండ్ల వారీగా సాయం అందించేందుకు హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేయడంతోపాటు పలు సూచనలు జారీ చేసింది. అదేవిధంగా, కరోనా వైరస్ అనుమానిత కేసుల కోసం ఆర్మీ వెస్టర్న్ కమాండ్ పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌ల్లో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కరోనా బారినపడిన సైనిక సిబ్బందికి, ప్రజలకు చికిత్స అందించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను 28 సైనికాస్పత్రుల్లో సిద్ధం చేసింది.
అమ్మాయిలతో రాసలీలలు సాగించేలా భారత గూఢాచారులు ఉండరు
ఈ సమస్యపై పోరాడటానికి (కరోనావైరస్), ప్రభుత్వం అనేక ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈ పోరాటంలో, ప్రభుత్వానికి మరియు పౌర పరిపాలనకు సహాయం చేయడం మా కర్తవ్యం "అని ఆర్మీ చీఫ్ అన్నారు. మహమ్మారి నుండి ఉత్పన్నమయ్యే ఏవైనా సమస్యలను పరిష్కరించే చర్యలలో భాగంగా సైన్యం ఇప్పటికే కమాండ్ వారీగా హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు.
కాగా ఇరాన్‌కు తీర్థయాత్రకు వెళ్లిన 850 మందిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. కరోనా నేపథ్యంలో ఇరాన్‌లోని క్వోమ్ నగరంలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించాలంటూ లదాఖ్‌కు చెందిన ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. అదేవిధంగా, బంగ్లాదేశ్‌లో చిక్కుకుపోయిన 580 మంది కశ్మీర్ వైద్య విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు చేపట్టిన చర్యలను తెలపాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని కోరింది.