AP CM Jagan Video Message: కరోనా కాటుకు కుల, మత భేదాలు లేవు, మర్కజ్ ఘటనకు మతం ముద్ర వేయడం సరికాదు, ప్రధాని పిలుపును స్వీకరించాలన్న ఏపీ సీఎం
విపత్కర పరిస్థితిలో సీఎం జగన్ ఏపీ ప్రజలకు వీడియో సందేశాన్ని (CM Jagan Video Message) ఇచ్చారు. వీడియోలో ఆయన మాట్లాడుతూ.. మర్కజ్ ఘటనకు (Delhi Nizamuddin Markaz) మతం ముద్ర వేయడం సరికాదని, కరోనా కాటుకు (Coronavirus) కుల, మత బేదాలు లేవని సీఎం జగన్ చెప్పారు.
Amaravati, April 15: ఏపీలో రోజు రోజుకు కోవిడ్ 19 కేసులు (COVID-19 Cases In India) పెరిగిపోతున్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (AP CM YS jagan) మీడియా ముందుకు వచ్చారు. విపత్కర పరిస్థితిలో సీఎం జగన్ ఏపీ ప్రజలకు వీడియో సందేశాన్ని (CM Jagan Video Message) ఇచ్చారు.
వీడియోలో ఆయన మాట్లాడుతూ.. మర్కజ్ ఘటనకు (Delhi Nizamuddin Markaz) మతం ముద్ర వేయడం సరికాదని, కరోనా కాటుకు (Coronavirus) కుల, మత భేదాలు లేవని సీఎం జగన్ చెప్పారు. కరోనా సృష్టిస్తున్న ఈ సందర్భంగా ఆయన కరోనా కట్టడికి పలు సూచనలు చేశారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని చెప్పారు.
ఢిల్లీలో ఓ మతానికి సంబంధించి జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి అనేక ప్రాంతాల నుంచి, కొన్ని దేశాల నుంచి ఆధ్యాత్మికవేత్తలు పాల్గొన్నారని వెల్లడించారు. ఆ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధుల్లో, ముఖ్యంగా విదేశీ ప్రతినిధుల్లో కొందరికి కరోనా ఉండిందన్నారు. అయితే ఆ సమావేశంలో పాల్గొన్న రాష్ట్రానికి చెందిన వారికి సోకడం దురదృష్టకరమన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో తొలి కోవిడ్-19 మరణం నమోదు
దేశంలో ఏ మతానికి సంబంధించి ఆధ్యాత్మిక కార్యక్రమం అయినా జరగొచ్చని సీఎం జగన్ పేర్కొన్నారు. మన దేశంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు పండిట్ రవిశంకర్, ఈశా ఫౌండేషన్ చీఫ్ జగ్గీ వాసుదేవ్, మాతా అమృతాయి ఆధ్యాత్మిక సభల్లోను, పాల్ దినకరన్, జాన్ వెస్లీ ఏర్పాటు చేసే ఆధ్యాత్మిక కార్యకరమంలో ఎవరైనా పాల్గొన వచ్చని వెల్లడించారు. కరోనా బాధితుల మీద కరుణ చూపాల్సిన సమయంలో ఇలా వారిని వేరు చేసి చూడొద్దని సీఎం జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.
కరోనా కట్టడికి రాష్ట్రాలకు అత్యవసర నిధులు
ప్రజలు లాక్‌డౌన్ నిబంధనల్ని అతిక్రమించవద్దని ఆయన సూచించారు. సామాజికదూరం పాటిస్తూ కరోనాను తరిమేద్దామని జగన్ పిలుపునిచ్చారు. దేశ ప్రధాని చెప్పిన విధంగా అందరూ ఆదివారం రోజు దీపాలు వెలిగించాలని కోరారు. కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలు అందరూ కలిసి దీపాలు వెలిగించాలని కోరారు. లాక్‌డౌన్‌ను ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు.
ప్రధాని మోదీ 9 నిమిషాల మెసేజ్ రహస్యం
పాటించని వారికి కఠిన శిక్ష పడుతుంది దాన్ని ఎవరూ తప్పించలేదరన్నారు. భౌతిక దూరం పాటిస్తూ కరోనాపై అందరూ యుద్దం చేయాలని కోరారు.మనమంతా ఒక్కటే అన్న సత్యాన్ని చాటుదామని, వైద్య, పోలీస్, పారిశుద్ధ్య కార్మికులకు పూర్తి వేతనాలు అందిస్తామని జగన్ ప్రకటించారు.