Amaravati Farmers Meet AP CM: అమరావతి ఎక్కడికీ పోదు, రాష్ట్ర లెజిస్లేటివ్‌ రాజధానిగా ఉంటుంది, అమరావతి రైతులకు భరోసా ఇచ్చిన ఏపీ సీఎం వైయస్ జగన్

రాష్ట్ర లెజిస్లేటివ్‌ రాజధానిగా అమరావతే (Amaravati) కొనసాగుతుందని, ఎవ్వరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని, అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే తన అభిమతమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) పునరుద్ఘాటించారు.

AP CM YS Jagan Mohan Reddy Tries to Convince Farmers on Establishing Three Capitals (photo-Twitter)

Amaravati,Febuary 5: రాజధాని ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Chief Minister Jagan Mohan Reddy) అమరావతి రైతులకు చెప్పారు. రాష్ట్ర లెజిస్లేటివ్‌ రాజధానిగా అమరావతే (Amaravati) కొనసాగుతుందని, ఎవ్వరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని, అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే తన అభిమతమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) పునరుద్ఘాటించారు.

రాజధాని అంశంపై కేంద్రం కీలక వ్యాఖ్యలు

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు (Tadepalli Camp Office) కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రాజధాని ప్రాంత రైతులు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ వారితో మాట్లాడుతూ అమరావతి అనేది అటు విజయవాడ, ఇటు గుంటూరు కాదని.. అసలు ఆ ప్రాంతంలో సరైన రోడ్లు, డ్రైనేజి, పైపులైన్లు లేవన్నారు. . సీఎం జగన్ దూకుడు..

Here's CMO Andhra Pradesh Tweet

సీఎం అంటే తండ్రి స్థానమన్న ఏపీ సీఎం అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తామని రైతులకు తెలిపారు. అక్కడ మౌలిక సదుపాయాలకే ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చుచేయాల్సి ఉంటుందని, దీని కోసమే రూ.1 లక్ష కోట్లు ఖర్చు చేయాలని గత ప్రభుత్వంలో ఉన్న వారే లెక్కగట్టారని ఈ సందర్భంగా వారికి గుర్తుచేశారు. గత ప్రభుత్వం కేవలం రూ.6 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని.. ఇది సముద్రంలో నీటిబొట్టంత మాత్రమే అన్నారు.

Three New Districts In AP

ఇంకా రూ.2,297 కోట్ల బకాయీలు చెల్లించాల్సి ఉందని వైఎస్‌ జగన్‌ అన్నారు. ఇదే ఖర్చులో 10 శాతం విశాఖలో (Vizag) పెడితే అది హైదరాబాద్‌కు (Hyderabad) పోటీఅవుతుందని వివరించారు. ఇప్పటికే రాష్ట్రంలో నెంబర్‌–1 నగరంగా విశాఖ ఉందని ఆయన రైతులకు విపులంగా వివరించారు. కనీసం రానున్న కాలంలో నైనా మన పిల్లలకు ఇక్కడ ఉద్యోగాలు వస్తాయన్నారు.

పెద్దల సభ రద్దుకు అసెంబ్లీ ఆమోదం

రాజధాని గ్రామాల్లో (Capitlal Villages) అభివృద్ధి పనులు కావాలంటే అడగాలని ఏం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నానని రైతులకు (Amaravathi Farmers) సీఎం జగన్ చెప్పారు. రోడ్లు వేశాక అభివృద్ధి జరిగాకా భూములు అమ్ముకోవాలా? వ్యవసాయం చేయాలా? అనేది రైతుల ఇష్టం అన్నారు.

మీ గ్రామంలోకి సీఎం జగన్ వస్తున్నాడు

రాజధాన్ని ప్రాంతంలో కావాల్సిన అభివృద్ధి పనులపై లిస్ట్ ఇస్తే.. 23 నెలల్లో పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీల అభివృద్ధితో పాటు గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే, రాజధాని గ్రామాల్లో పెన్షన్లు అందని అర్హులు ఎవరైనా ఉంటే వారందరినీ వలంటీర్ల ద్వారా గుర్తించాలని ఆయన చెప్పారు.

ఏపీకి 32 రోడ్లు, 21 రైల్ ప్రాజెక్టులు

ఎవరికీ అన్యాయం జరక్కుండా ఇక్కడే లెజిస్లేటివ్‌ రాజధానిని కొనసాగిస్తామని, కర్నూలులో న్యాయ రాజధాని, విశాఖపట్టణంలో కార్యనిర్వాహక రాజధాని పెడతామని వైఎస్‌ జగన్‌ చెప్పారు. తన ముందు ఇవాళ రాజధాని రైతులు పెట్టిన అంశాలన్నీ నెరవేర్చడం ప్రభుత్వం కనీస బాధ్యత అని సీఎం అన్నారు.

ముఖ్యమంత్రి హోదాలో శారదా పీఠం వార్షికోత్సావాలకు హాజరైన వైయస్ జగన్

సమావేశానికి హాజరైన రైతులు మాట్లాడుతూ.. వాస్తవానికి తమవి చాలా సారవంతమైన భూములని, అలాంటి చోట చంద్రబాబు రాజధాని కడతానని ప్రకటించి తమను భయపెట్టడంతో చాలామంది రైతులు భూములిచ్చారని తెలిపారు. భూములివ్వని వారిపై చంద్రబాబు కక్షగట్టి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను కట్‌చేసి కరెంటు తీసేశారన్నారు.

అవ్వా ఇదిగో పెన్సన్.., ఇంటింటికి వెళ్లి పెన్సన్ ఇచ్చిన గ్రామ వాలంటీర్లు

మూడు చెక్‌పోస్టులు పెట్టి వ్యవసాయం చేసుకోనీయకుండా నానా ఇబ్బందులు పెట్టడమే గాక తమ పొలాలను కూడా తగలబెట్టారని వాపోయారు. ప్రస్తుతం గ్రామ సచివాలయాల ద్వారా తమకు అన్ని సేవలు అందుతున్నాయి కనుక పాలన ఎక్కడ నుంచి సాగినా ఇబ్బందిలేదని రైతులు స్పష్టంచేశారు. భూమిలేని వారికి పెన్షన్‌ను రూ.5వేలకు పెంచడం చాలా మంచి నిర్ణయమన్నారు.