APSRTC: ఈనెల 16 నుంచి హైదరాబాద్‌కు ఏపీ బస్సులు, స్పందన పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ప్రయాణ సౌకర్యం, నిబంధనలు అంగీకరిస్తేనే ప్రయాణానికి అనుమతి

ఈ నేపథ్యంలో ఈ నెల 16న హైదరాబాద్‌ (Hyderabad) నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బస్సులు (APSRTC) నడవనున్నాయి. అయితే నిబంధనలకు అంగీకరిస్తేనే ఈ బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన పోర్టల్‌లో (Spandana Portal) దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ ప్రయాణానికి వెసులుబాటు ఉంటుంది. అంతేకాకుండా స్వస్థలాలకు చేరుకున్న తర్వాత సంబంధిత జిల్లాలో ఉండే క్వారంటైన్‌ కేంద్రంలో ఉంటామని అంగీకరిస్తేనే టికెట్లు జారీ చేయనున్నారు. అందుకు తగ్గట్టుగా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేపట్టారు. 16వ తేదీ నుంచి ఏపీకి బస్సులు నడపనున్నారు.

APSRTC | Photo: Twitter

Amaravati, May 15: లాక్‌డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చాలామంది చిక్కుకుపోయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈ నెల 16న హైదరాబాద్‌ (Hyderabad) నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బస్సులు (APSRTC) నడవనున్నాయి. అయితే నిబంధనలకు అంగీకరిస్తేనే ఈ బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన పోర్టల్‌లో (Spandana Portal) దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ ప్రయాణానికి వెసులుబాటు ఉంటుంది. కర్నూలులో నేడు జీరో కేసులు నమోదు, ఏపీలో 2157కు చేరుకున్న కరోనా కేసుల సంఖ్య, తాజాగా 57 కోవిడ్19 కేసులు నమోదు

అంతేకాకుండా స్వస్థలాలకు చేరుకున్న తర్వాత సంబంధిత జిల్లాలో ఉండే క్వారంటైన్‌ కేంద్రంలో ఉంటామని అంగీకరిస్తేనే టికెట్లు జారీ చేయనున్నారు. అందుకు తగ్గట్టుగా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేపట్టారు. 16వ తేదీ నుంచి ఏపీకి బస్సులు నడపనున్నారు.లాక్‌డౌన్‌ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో ఉండిపోయినవారిని స్వరాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం (Andhra Pradesh government) చర్యలు తీసుకుంటోంది. కాగా కరోనా వైరస్‌తో హైదరాబాద్‌ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులకు అడ్వాన్స్‌డ్‌ రిజర్వేషన్‌ ప్రక్రియను ఏపీఎస్‌‌ఆర్టీసీ ఇప్పటికే నిలిపివేసింది. రాష్ట్రాల్లో బస్సులు రోడ్డెక్కేందుకు రెడీ అయినట్లేనా.., రైల్వే స్టేషన్ నుండి ప్రయాణికులను గమ్యానికి చేర్చేందుకు లోకల్ స్పెషల్ బస్సులు, లాక్‌డౌన్ 4.0 కొత్త గైడ్‌లైన్స్ త్వరలో..

అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపు ఇవ్వడంతో ప్రజా రవాణా శాఖాధికారులు బస్సులు తిప్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఆర్టీసీ(పీటీడీ) ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ఆర్‌ఎంలకు 18వ తేదీకల్లా బస్సులను నడిపేందుకు సిద్ధంగా ఉండాలని సర్క్యులర్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఏపీలో ఆర్టీసీ బస్సులకు గ్రీన్ సిగ్నల్, పరిమిత సంఖ్యలో నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు, ఆన్‌లైన్ ద్వారానే టికెట్ల కొనుగోలు

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సూచ‌న‌తో అంత‌ర్రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో ఒరిస్సా, బెంగాలీ, హిందీ భాషలో "మిమ్మల్ని మీ రాష్ట్రాలకు చేరుస్తాం" అని బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నామ‌ని కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ ప్ర‌త్యేకాధికారి కృష్ణబాబు అన్నారు. 24 శ్రామిక్ రైళ్ల‌ ద్వారా ఇప్పటి వరకు 27,457 మంది వ‌ల‌స కూలీలను పంపించామ‌న్నారు. మ‌రో 22 రైళ్ల‌లో 30,492 మందిని పంపించ‌నున్న‌ట్లు తెలిపారు. విజ‌య‌వాడ‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.లాక్‌డౌన్‌కు ముందు తీసుకున్న టికెట్లు రద్దు, జూన్ 30 వరకు బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేసిన రైల్వే మంత్రిత్వ శాఖ, పూర్తి నగదు వాపస్

జాతీయ ర‌హ‌దారుల‌పై వెళ్తున్న‌ 6 వేల మందికి పైగా కార్మికులను రిలీఫ్ కేంద్రాలకు తరలిస్తున్నామ‌ని తెలిపారు. మ‌రోవైపు అంతర్రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో వారికి కౌన్సెలింగ్ ఇచ్చి రైళ్ల‌లో పంపించే దిశ‌గా చ‌ర్యలు చేప‌డుతున్నామ‌న్నారు. దీనికోసం ఆరు రాష్ట్రాలకు చెందిన‌ వారు రిజిస్ట‌ర్ చేసుకోగా అందులో బీహార్ 30 వేలు, పశ్చిమ బెంగాల్ 15 వేల మంది ఉన్నార‌ని.. కానీ పశ్చిమ బెంగాల్‌కు శ్రామిక్ రైళ్లు వెళ్ళట్లేదన్నారు.