APSRTC | Photo: Twitter

Amaravati, May 13: కరోనావైరస్ కోసం విధించిన లాక్‌డౌన్ (Lockdown 3.0) మే 18 తర్వాత దాదాపు 80 శాతం సడలింపులతో రన్ కానున్న నేపథ్యంలో ఏపీలో ఆర్టీసీ బస్సులు (APSRTC) తిరిగి రోడ్ల మీదకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. కరోనా (Coronavirus) సంరక్షణ చర్యలను పాటిస్తూనే దశల వారీగా బస్సులను నడిపేందుకు ఆర్టీసీ యంత్రాంగం సిద్ధ మవుతోంది. మా నీళ్లను మేము తీసుకుంటున్నాం, దీనిపై రాజకీయాలు చేయడం తగదు, కృష్ణా జ‌లాల అంశంపై స్పందించిన ఏపీ సీఎం వైయస్ జగన్

లాక్‌డౌన్‌తో మార్చి 22 నుంచి డిపోలకే పరిమితమయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపు ఇవ్వడంతో ప్రజా రవాణా శాఖాధికారులు బస్సులు తిప్పాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఆర్టీసీ(పీటీడీ) ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ (APSRTC MD Madireddy Pratap) రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ఆర్‌ఎంలకు 18వ తేదీకల్లా బస్సులను తిప్పేందుకు సిద్ధంగా ఉండాలని సర్క్యులర్‌ జారీ చేసినట్లు సమాచారం.

కాగా ఆర్టీసీ ఎండీ ఆదేశాల మేరకు మొదటి దశగా రీజియన్‌లో పరిమిత సంఖ్యలో మాత్రమే బస్సులు తిరగనున్నాయి. ప్రయాణీకులు భౌతిక దూరం పాటించేలా ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక సీటింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే బస్సులో 50 శాతం మందే ప్రయాణించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే టికెట్లు కూడా ఆన్‌లైన్‌ ద్వారానే బుక్‌ చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక వేళ బస్సుల్లో సీట్లు ఖాళీగా ఉంటే బస్టాండ్లలో కండక్టర్లు ఫోన్‌ పే, గూగుల్‌ పే, ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేస్తారు.