AP Coronavirus: కర్నూలులో నేడు జీరో కేసులు నమోదు, ఏపీలో 2157కు చేరుకున్న కరోనా కేసుల సంఖ్య, తాజాగా 57 కోవిడ్19 కేసులు నమోదు
COVID-19 Outbreak in India. | PTI Photo

Amaravati, May 15: ఏపీలో శుక్రవారం తాజాగా మరో 57 కరోనా పాజిటివ్‌ కేసులు (AP Coronavirus) నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2157కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో (COVID 19 in AP) అనంతపురం 4, చిత్తూరు 14, కడప 2, కృష్ణా 9, కర్నూలు 8,నెల్లూరు 14, విజయనగరం 3, విశాఖపట్నం 2, తూర్పు గోదావరి 1 ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకుని 1252 మంది డిశ్చార్జ్‌ కాగా, 48 మంది మరణించారు. రైతుల అకౌంట్లోకి నేరుగా రూ.7,500, నేడు సీఎం చేతుల మీదుగా వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం ప్రారంభం, తొలివిడతగా రైతుల ఖాతాల్లో రూ.2800 కోట్లు జమ

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 857గా ఉంది. గడిచిన 24 గంటల్లో 60 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 9,038 సాంపిల్స్ ని పరీక్షించగా 102 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. వీటిలో 45 పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాలకి చెందినవిగా(మహారాష్ట్ర 34, రాజస్థాన్ 11) ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఈ రోజు కర్నూలులో జీరో కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 27 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. నగర శివారులోని కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ నుంచి 8 మంది, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నుంచి నలుగురు, విశ్వభారతి జిల్లా కోవిడ్‌ ఆసుపత్రి నుంచి 12 మంది, శాంతి రామ్‌ కోవిడ్‌ ఆసుపత్రి నుంచి ముగ్గురిని వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు. గత 24 గంటల్లో 3,967 కోవిడ్-19 కేసులు, దేశంలో 81 వేలు దాటిన కరోనావైరస్ పాజిటివ్ కేసులు, ఇప్పటివరకు 2,649 మంది మృతి

కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 343కు చేరుకుంది. యాక్టివ్‌ రోగులు(ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు) 230 మంది ఉన్నారు. డిశ్చార్జ్‌ అయిన వారికి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఒక్కొక్కరికి రూ.2వేల నగదు పంపిణీ చేసి, ప్రత్యేక అంబులెన్స్‌లలో ఇంటికి పంపించారు.