Indian Railways | Representational Image | (Photo Credits: Getty Images)

New Delhi, May 14: లాక్‌డౌన్‌కు ముందు తీసుకున్న అడ్వాన్స్‌ టిక్కెట్లు అన్నీ రద్దవుతాయని (Indian Railways Cancels All Tickets) రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జూన్ 30 వరకు ( June 30, 2020) ప్రయాణానికి తీసుకున్న టిక్కెట్లన్నీ రద్దవుతాయని తెలిపింది. జూన్ 30 లేదా అంతకుముందు ప్రయాణానికి మార్చి 25 లోపు బుక్ చేసుకున్న అన్ని రైలు టిక్కెట్లు (IRCTC Tickets) రద్దు అవుతాయని, వినియోగదారులకు పూర్తి నగదు వాపసు ఇవ్వనున్నట్లు వివరించింది. తొమ్మిది రాష్ట్రాల్లో జీరో కేసులు, దేశ వ్యాప్తంగా 78 వేలు దాటిన కరోనా కేసులు, ప్రపంచవ్యాప్తంగా 45 లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు, మృతుల సంఖ్య 3 లక్షలకు చేరువలో..

ఆన్‌లైన్‌, కౌంటర్లలో రిజర్వేషన్ చేయిస్తే ఛార్జీలు తిరిగి చెల్లించనుంది. ఆన్‌లైన్‌లో చెల్లిస్తే ప్రయాణికుల ఖాతాకు జమ చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. కౌంటర్లలో రిజర్వేషన్లు చేయించినవారికి ప్రత్యేక సదుపాయం ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాలని రైల్వేశాఖ (Indian Railways) నిర్ణయించింది. ఈ విష‌యాన్ని రైల్వేశాఖ ఓ ప్ర‌ట‌క‌న ద్వారా తెలియ‌జేసింది.

అయితే వ‌ల‌స కూలీల‌ను త‌ర‌లిస్తున్న శ్రామిక్ రైళ్ల‌ను (Shramik Train Special Trains) మాత్రం కొన‌సాగించ‌నున్న‌ట్లు తెలిపారు. ఢిల్లీ నుంచి 15 ప్రాంతాల‌కు వెళ్తున్న ప్ర‌త్యేక రైళ్ల‌ను కూడా కొన‌సాగించ‌నున్నారు. రైల్వేశాఖ లెక్క‌ల ప్ర‌కారం.. గ‌త నెల‌లో సుమారు 94 ల‌క్ష‌ల టికెట్ల‌కు సంబంధించి 1490 కోట్ల‌ను రిఫండ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. మార్చి 22 నుంచి ఏప్రిల్ 14 మ‌ధ్య తేదీల‌కు సంబంధించి మ‌రో 830 కోట్లను రిఫండ్ చేసిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. మార్చి 22వ తేదీ నుంచి దేశ‌వ్యాప్తంగా అన్ని ర‌కాల రైళ్ల‌ను ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే.  లాక్‌డౌన్‌ 4కు సిద్ధమవండి, మే 18లోపు పూర్తి వివరాలు, కరోనాపై పోరాటంలో అలసిపోవద్దు, కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ

ఈ నెల 12 నుంచి మొదలైన ప్రత్యేక రైళ్లు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ (India Lockdown) ప్రకటించడంతో ప్రయాణికుల రైళ్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా రైళ్ల సర్వీసులను పునరుద్ధరించి పరిమిత సంఖ్యలో రాజధాని ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌లను నడుపుతున్నారు. వలస కార్మికుల తరలింపు శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. ఈనెల 19 వరకు బుకింగ్ పూర్తి కావడంతో.. రిజర్వేషన్లు కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఈనెల 20 నుంచి వారం రోజుల రిజర్వేషన్లను ఐఆర్‌సీటీసీ ఈరోజు ఓపెన్ చేయనుంది. 54 వేల టికెట్లను జారీ చేసిన రైల్వే శాఖ, రైల్వే స్టేష్టన్‌లో ఆరోగ్య పరీక్షలు, ప్రతి ప్రయాణీకుల డేటా ఆయా రాష్ట్ర ప్రభుత్వానికి..

ఇదిలా ఉంటే మే 22 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక రైళ్లలో వెయిటింగ్‌ లిస్టును చేరుస్తూ రైల్వే బోర్డు ప్రకటన విడుదల చేసింది. ఇవి కేవలం ఆ రైళ్లకే గాక, తర్వాత నడపనున్న రైళ్లకూ వర్తించే అవకాశం కనిపిస్తోంది. ఏసీ 3–టైర్‌కు 100, ఏసీ 2–టైర్‌కు 50, స్లీపర్‌ క్లాస్‌కు 100, చైర్‌ కార్‌కు 100, ఫస్ట్‌ క్లాస్‌ ఏసీతో పాటు ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌కు 20 చొప్పున వెయిటింగ్‌ లిస్టును కేటాయించింది.  ఈ రాజధాని రూట్లలో 15 రైళ్లు తిరుగుతాయి, తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే రైళ్ల వివరాలు, అలాగే రేపటి నుంచి పట్టాలెక్కే రైళ్ల వివరాలు, బుకింగ్ ప్రాసెస్ మీకోసం

మే 15 నుంచి బుక్‌ చేసుకున్న వారికి ఇవి వర్తిస్తాయి. ప్రస్తుతం నడుపుతున్న ఎయిర్‌ కండీషన్డ్‌ రైళ్లనే గాక, ఇతర రైళ్ళను నడిపే ఆలోచనలో రైల్వే బోర్డు ఉంది. లాక్‌డౌన్ ప్రత్యేక రైళ్లు, శ్రామిక్ రైళ్లను మాత్రమే రైల్వే కొనసాగించనుంది. మిగిలిన అన్ని ప్రయాణికుల రైళ్లు తిరగవని రైల్వే స్పష్టం చేసింది.