Coronavirus In AP: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, విజయవాడలో తొలి కరోనా పాజిటివ్, నగరంలో హై అలర్ట్
ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) అమలు చేయడంతోపాటు వంతులవారీ పని విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయం విభాగాధిపతుల కార్యాలయాలు మొదలు క్షేత్రస్థాయి వరకు ఈ విధానం సోమవారం నుంచి అమల్లోకి రానుంది.
Amaravati, Mar 22: రాష్ట్రంలో కరోనా వైరస్ (Covid 19 In AP) విస్తరిస్తున్న నేపథ్యంలో ఏపీ సర్కారు (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) అమలు చేయడంతోపాటు వంతులవారీ పని విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయం విభాగాధిపతుల కార్యాలయాలు మొదలు క్షేత్రస్థాయి వరకు ఈ విధానం సోమవారం నుంచి అమల్లోకి రానుంది.
తెలంగాణలో కరోనా కలవరం, 22కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ఈ నిర్ణయం ప్రకారం ఒక బృందం ఒక వారం కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహిస్తే.. రెండో బృందం తర్వాత వారం విధులకు వచ్చేలా వెసులుబాటు కల్పించింది. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సందర్శకుల్ని నియంత్రించాలని, అత్యవసర పని ఉంటే తప్ప అనుమతించవద్దని తెలిపింది.
ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు
రాష్ట్ర సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్ కంటే పైస్థాయి అధికారులు మాత్రం రోజూ విధులకు హాజరవుతారు. అయితే వీరందరికీ ప్రత్యేకంగా ఉంటాయి. వారంలో విధులకు హాజరయ్యే ఉద్యోగులకు వేర్వేరు సమయాల్లో పనివేళలుగా.. ఒక బృందం ఉ.9.30 గంటలకు, రెండో బృందం 10 గంటలకు, మూడో బృందం 10.30 గంటలకు కార్యాలయంలోనికి అనుమతిస్తూ ఏ సెక్షన్‌లోనూ రద్దీ లేకుండా ఉద్యోగుల మధ్య తగినంత దూరం పాటించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కింద స్థాయి ఉద్యోగులకు వంతులవారీ విధానాన్ని ప్రభుత్వం వర్తింపు చేయనుంది.
తెలుగు రాష్ట్రాల్లో సర్వం బంద్, సరిహద్దులు మూసివేత
విజయవాడ నగరంలో కోవిడ్-19( కరోనా వైరస్) పాజిటివ్ కేసు నమోదుకావడంతో (Coronavirus Outbreak in andhra pradesh) జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ విజవాడలో హైఅలెర్ట్ ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ నగరంలో మొదటి కరోనా పాజిటీవ్ కేసు నమోదైదని తెలిపారు. అదేవిధంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని ఆయన తెలిపారు.
కరోనా పాజిటీవ్ కేసు నమోదైన ప్రదేశంలో దాదాపు 500 ఇళ్లలో మెడికల్ చెకప్‌లు చేశామని ఆయన చెప్పారు. అనుమానం ఉన్నవారు కంట్రోల్ రూంకి కాల్ చేయాలని ఆయన సూచించారు. కంట్రోల్ రూం నంబర్ 7995244260ను విడుదల చేశారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. కరోనా లక్షణాలుంటే స్వచ్చందంగా ముందుకు రావాలని కలెక్టర్ ఇంతియాజ్ కోరారు.
జనతా కర్ఫ్యూ, నేడు దేశ వ్యాప్తంగా రైళ్లు, బస్సులు అన్నీ బంద్
నగరంలో (Vijayawada) కరోనా పాజిటీవ్ రావడంతో సిటీని హై అలర్ట్ చేశామని నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. సిటీలో 144 సెక్షన్ విధించాం. మా వైపు నుంచి అన్ని చర్యలు తీసుకున్నాం. విజయవాడలో కరోనా వచ్చిన వ్యక్తి ప్రయాణించిన కారులో గుంటూరుకు చెందిన మరో ముగ్గురు ప్రయాణించారు. విజయవాడ నుంచి గుంటూరు ప్రయాణించిన ప్రయాణికులు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. స్వచ్ఛందంగా ప్రజలు గుమికూడకుండా సహకరించాలి. లేదంటే నిర్భందంగా అయిన చర్యలు తీసుకుంటామని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు (cp dwaraka tirumala rao) హెచ్చరించారు.
తెలంగాణాలో 24 గంటలు బంద్, ప్రధాని మీద ట్రోల్ చేస్తే చర్యలు తప్పవు
ప్రధాని మోదీ పిలుపుమేరకు రాష్ట్రం వ్యాప్తంగా కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణలో భాగంగా ‘జనతా కర్ఫ్యూ’ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నామని ఆమె తెలిపారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉన్నారని నీలం సాహ్ని పేర్కొన్నారు. వైద్య శాఖ నిరంతరం పనిచేస్తోందని ఆమె తెలిపారు.
కరోనా లేనే లేదు, పేషెంట్లను కౌగిలించుకోవడానికి నేను సిద్ధం
విదేశాల నుంచి వచ్చిన వారిని సచివాలయాల, వాలంటీర్ల ద్వారా గుర్తించామని ఆమె పేర్కొన్నారు. ప్రతి విదేశి ప్రయాణికుడిని ఐసోలాషన్‌లో ఉంచుతున్నామని చీఫ్ సెక్రటరీ తెలిపారు. ఆసుపత్రులలో ఐసోలాషన్ వార్డులను ఇంకా పెంచుతామని ఆమె చెప్పారు. ప్రజలు ఎలాంటి భయం అవసరం లేదన్నారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని నీలం సాహ్ని తెలిపారు.