తెలంగాణ

Cold Wave in Telangana: తెలంగాణపై చలిపంజా.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ లో 6.3 డిగ్రీలుగా నమోదు.. 12 జిల్లాల్లో సింగిల్‌ డిజిట్‌

Rudra

తెలంగాణపై చలిపంజా విసురుతున్నది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పెరిగిన చలి తీవ్రతతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.

Bigg Boss Season 8 Winner Nikhil: బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్.. రన్నరప్ గా గౌతమ్.. నిఖిల్ కు రూ.55 లక్షల చెక్ అందించిన రామ్ చరణ్

Rudra

ప్రముఖ వినోద ఛానల్ స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ‘బిగ్‌బాస్ సీజన్ 8’ విజేతగా టీవీ నటుడు నిఖిల్ నిలిచాడు.

Allu Arjun Reacts on Sri Tej Health: శ్రీ తేజ్ ఆరోగ్యంపై స్పందించిన అల్లు అర్జున్, ఆ కార‌ణాల‌తోనే అత‌న్ని క‌లువ‌లేక‌పోతున్నా.. అంటూ పోస్ట్

VNS

కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి గురించి ఆందోళన చెందుతున్నానని సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. ‘‘బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రస్తుతం అతడిని కలవలేకపోతున్నా. వాళ్ల ఇంటికి వెళ్లలేకపోతున్నా. త్వరలోనే వారి కుటుంబాన్ని కలిసి మాట్లాడతా. వారిని ఆదుకుంటానని ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నా’’ అని అల్లు అర్జున్‌ తెలిపారు.

Telangana BJP Chief: తెలంగాణ బీజేపీ చీఫ్ రేసులో మ‌రోసారి బండి సంజ‌య్, ఇంత‌కీ వార్త‌ల‌పై సంజ‌య్ ఏమ‌న్నారంటే?

VNS

తాను బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి రేసులో (Telangana BJP Chief ) లేనని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ (Bandi Sanjay) అన్నారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తనకు పార్టీ నాయకత్వం పెద్ద బాధ్యతలు అప్పగించిందని, ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు

Advertisement

Viral Video: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం..ప్రేమ, 8 నెలల సహజీవనం, చివరకు అడవిలో వదిలేసిన యువకుడు..వీడియో ఇదిగో

Arun Charagonda

బెంగుళూరుకి చెందిన యువతి రబియాకి మహారాష్ట్రకు చెందిన విక్రమ్ మన్వర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయింది. 8 నెలలు సహజీవనం చేసి ఆపై పెళ్లి చేసుకున్నారు. జీవనోపాధి కోసం బెంగుళూరు నుంచి మేడ్చల్ జిల్లా అల్వాల్ వచ్చి కాపురం పెట్టారు.

Hyderabad: కన్నీళ్లు పెట్టిస్తున్న రేవతి కూతురు శాన్విక మాటలు..అమ్మ ఊరికి వెళ్లింది...వస్తానని చెప్పిందన్న శాన్విక...వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కూతురు శాన్విక మాటలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. అమ్మ ఊరికి వెళ్లింది.. వస్తానని చెప్పింది, అమ్మ నాకు, అన్నయ్యకి రోజూ అన్నం తినిపించేది అని తెలిపింది. బాగా చదువుకోవాలని అమ్మ చెప్పేది...అన్నయ్య హాస్పిటల్‌లో ఉన్నాడు.. నెల రోజుల తర్వాత వస్తాడు అని చిన్నారి చెప్పిన మాటలు అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.

Hyderabad: మేడ్చల్ జిల్లా ఉప్పరపల్లిలో అగ్నిప్రమాదం...ఆర్‌కే టెంట్ హౌస్‌లో చెలరేగిన మంటలు..లక్షల్లో ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా...వీడియో

Arun Charagonda

మేడ్చల్ జిల్లా ఉప్పరపల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆర్ కె టెంట్ హౌస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సంఘటన స్థలంకు ఫైర్ ఇంజన్లు చేరుకోగా రూ. పది నుంచి పదిహేను లక్షల ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

MLC Kavitha: పైసల కోసం పార్టీ మారిన సంజయ్‌...జగిత్యాలలో ఏం అభివృద్ధి జరగలేదు, తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసిన ఎమ్మెల్సీ కవిత

Arun Charagonda

తెలంగాణ ప్రభుత్వ జీవో లెక్క చేయకుండా జగిత్యాలలో బతుకమ్మతో ఉండే 22 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు ఎమ్మెల్సీ కవిత. జగిత్యాలలో మీరు గెలిపించిన నాయకుడు పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోయాడు...కేసీఆర్ బొమ్మ పెట్టుకొని గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ అసెంబ్లీకి వెళ్ళి ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతాడో చూద్దాం అన్నారు.

Advertisement

Telangana: భార్య భర్తల గొడవలో తలదూర్చిన ఎస్‌ఐ, రూ.20 వేలు డిమాండ్..ఇవ్వక పోవడంతో గిరిజన యువకుడిపై దాడి...వీడియో ఇదిగో

Arun Charagonda

భార్య భర్తల గొడవలో తలదూర్చాడు ఓ ఎస్ఐ. రూ.20 వేలు లంచం ఇవ్వలేదని గిరిజన యువకుడిపై దాడికి పాల్పడడాడు. మహాబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలో భార్యా భర్తల పంచాయితీలో రూ.20 వేలు డిమాండ్ చేశారు ఎస్ఐ క్రాంతి కిరణ్. అంతకు ముందే రూ.15 వేలు తీసుకున్నారని, తన దగ్గర డబ్బులు లేవని వేడుకున్నాడు యువకుడు. డబ్బులు ఇవ్వలేదని పోలీసులు దారుణంగా కొట్టినట్టు గిరిజన యువకుడు ఆరోపించగా న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Telangana Congress: కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం తగదు...ఇదే కొనసాగితే ప్రజలు బుద్దిచెప్పడం ఖాయమని వెల్లడి

Arun Charagonda

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ పార్టీగా గొప్పలు చెప్పుకునే బీఆర్ఎస్.. తన పదేళ్ల పాలనలో తెలంగాణ వెనుకబాటుకు గురైందన్నారు.

Burra Venkatesham: గ్రూప్ 2 పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం, రెండు మూడు నెలల్లో పరీక్షల ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడి

Arun Charagonda

గ్రూప్ 2 పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు TGPSC చైర్మన్ బుర్రా వెంకటేశం. బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. రెండు మూడు నెలల్లో పరీక్షల ఫలితాలు అందిస్తామని వెల్లడించారు బుర్రా వెంకటేశం.

SI Suicide Case: వాజేడు ఎస్ఐ సూసైడ్ కేసులో ప్రియురాలు అరెస్ట్, రాంగ్‌ నెంబర్‌ కాల్ చేసి ఎస్‌ఐకి పరిచయం..ప్రేమ పేరుతో వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా పోలీసుల వెల్లడి

Arun Charagonda

వాజేడు ఎస్ఐ సూసైడ్ కేసులో ప్రియురాలును అరెస్ట్ చేశారు పోలీసులు. ఇటీవల సర్వీస్ రివాల్వర్ తో ఆత్మహత్య చేసుకున్న వాజేడు ఎస్ఐ హరీష్ కేసులో ప్రియురాలు అనసూర్య(29)ను అరెస్ట్ చేశారు పోలీసులు. బానోత్ అనసూర్య, సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దూదియా తండాకు చెందిన మహిళగా గుర్తించారు. ప్రేమ పేరుతో ఎస్ఐని వేధింపులకు గురిచేసి, ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు వెల్లడించారు. గత సంవత్సరం క్రితం రాంగ్ నెంబర్ కాల్ చేసి ఎస్ఐకు పరిచయమైంది అనసూర్య.

Advertisement

CM Revanth Reddy: 98 శాతం కులగణన పూర్తి, తెలంగాణకు బహుజనుల తల్లి కావాలి...దొడ్డి కొమురయ్య పేరు శాశ్వతంగా గుర్తుండిపోయేలా చర్యలు తీసుకుంటామన్న సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

జనాభా ప్రాతిపదికన ఫలాలు అందాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన 98 శాతం మేరకు పూర్తయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మిగిలిన రెండు శాతం పూర్తయితే దేశానికే ఆదర్శంగా నిలిచే ఈ కులగణన తెలంగాణ ప్రజల మెఘా హెల్త్ ప్రొఫైల్‌గా మారుతుందని అన్నారు.

Man Chops Off His Fingers: పని ఒత్తిడా? లేక పని చేయడం ఇష్టంలేకనో... మొత్తానికి పని నుంచి తప్పించుకోవదానికి కత్తితో చేతులు నరుక్కున్న వ్యక్తి.. గుజరాత్‌ లోని సూరత్ లో ఘటన (వీడియో)

Rudra

గుజరాత్‌ లోని సూరత్‌ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వజ్రాల దుకాణంలో కంప్యూటర్ ఆపరేటర్‌ గా పని చేస్తున్న ఓ యువకుడు పని ఒత్తిడి మూలంగానో లేక ఆ ఉద్యోగం చేయడం నచ్చకనో ఏదైతేనేమీ తన చేతి నాలుగు వేళ్లను నరుక్కున్నాడు.

Car Overturns in Mancherial: మద్యం మత్తులో డ్రైవింగ్.. కారు బోల్తా.. మంచిర్యాలలో ఘటన (వీడియో)

Rudra

మంచిర్యాలలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి ఫూటుగా మద్యం సేవించి కారు నడుపుతుండగా.. ప్రమాదవశాత్తూ అది బోల్తా పడింది. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు కారును పైకి లేపి అందులో ఉన్న వ్యక్తిని కాపాడారు.

Cockroaches in Pub’s Kitchen: హైదరాబాద్ లోని ఫేమస్ పబ్బుల్లోని కిచెన్ లో బొద్దింకలు.. కాలం చెల్లిన ఉత్పత్తులు..

Rudra

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని డైలీ రిచువల్స్, హార్ట్ కప్ పబ్బుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు జరిపారు. ఆయా పబ్స్ లోని కిచెన్ లో బొద్దింకలు, కాలం చెల్లిన ఉత్పత్తులు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ రెండు పబ్బులపై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

Advertisement

Bigg Boss Season 8: నేడు బిగ్‌ బాస్ సీజన్ 8 కు ఎండ్ కార్డ్.. 300 మంది పోలీసులతో భారీ భద్రత.. గత సీజన్ అనుభవాలను దృష్టిలో పెట్టుకునే..

Rudra

ప్రముఖ వినోద ఛానల్ స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ‘బిగ్‌బాస్ సీజన్ 8’ నేటితో ముగియనుంది. దాదాపు వంద రోజులపాటు ప్రేక్షకులను అలరించిన ఈ రియాలిటీ షో విజేతను ఆదివారం రాత్రి ప్రకటించనున్నారు.

Good News For Farmers: రైతులకు ఆర్బీఐ శుభవార్త.. తాకట్టు లేకుండానే రూ.2 లక్షల వరకూ అప్పు.. జనవరి 1 నుంచి నూతన నిబంధనలు అమలులోకి

Rudra

దేశంలోని అన్నదాతలకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుభవార్త చెప్పింది. వ్యవసాయ అవసరాలకు, పంట సాగు కోసం ఎలాంటి తాకట్టు లేకుండా అందించే రుణ సదుపాయాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

Group 2 Exams Today: నేడు, రేపు గ్రూప్‌-2 పరీక్షలు.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30వరకు రెండో సెషన్‌

Rudra

నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్‌-2 పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఆది, సోమవారాల్లో గ్రూప్‌-2 పరీక్షలు జరగనున్నాయి.

KTR Meets Nandini Sidda Reddy: రేవంత్ రెడ్డి ఆఫ‌ర్ ను తిర‌స్క‌రించిన నందిని సిధారెడ్డి, ఇంటికి వెళ్లి మ‌రీ అభినందించిన కేటీఆర్

VNS

తెలంగాణ సాహితీ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కవి, రచయిత నందిని సిధారెడ్డిని (Nandini Sidda Reddy) బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామరావు (KTR) మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రూ.కోటి నగదు పారితోషకం, ప్లాట్‌ను తిరస్కరించడం తెలంగాణ అస్థిత్వ పరిరక్షణలో ఓ మైలురాయిగా నిలుస్తుందని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Advertisement
Advertisement