World

Afghanistan: ఆప్ఘనిస్తాన్‌లో వరుస బాంబు పేళుళ్లు, తల తెగినా ఇక్కడి నుంచే కదిలే ప్రసక్తి లేదన్న అష్రఫ్ ఘనీ, అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం వేళ విరుచుకుపడిన తాలిబన్లు

Hazarath Reddy

ఆఫ్ఘనిస్తాన్‌ (Afghanistan) బాంబులతో దద్దరిల్లింది. దేశ రాజధాని కాబుల్‌లో (Kabul) అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ (Mohammad Ashraf Ghani) ప్రమాణ స్వీకార సమయంలో తాలిబన్లు బాంబు దాడులకు పాల్పడ్డారు. అనంతరం తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు.. తాలిబన్లపైకి ఎదురుకాల్పులు చేపట్టారు. అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఈ దాడితో ప్రమాణస్వీకారానికి వచ్చిన వారంతా భయబ్రాంతులకు గురయ్యారు.

Coronavirus Terrifies: తిరుమల వెళ్లేవారికి హెచ్చరిక, జలుబు, దగ్గు ఉన్నవారు శ్రీవారి దర్శనానికి రావొద్దని కోరిన టీటీడీ అధికారులు, లక్షణాలు కనిపిస్తే వెంటనే వారిని స్విమ్స్‌కు తరలించాలని ఆదేశాలు

Hazarath Reddy

దేశంలో రోజు రోజుకు పంజా విప్పుతున్న కరోనా వైరస్ (Coronavirus Terrifies) ధాటికి రాష్ట్రాలు అలర్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు తిరుమలలోని శ్రీవారి దర్శనంపై (Lord Venkateswara Swamy temple) ఆంక్షలు విధించారు.కరోనా వైరస్ లక్షణాలైన జలుబు, దగ్గు ఉన్న భక్తులు తిరుమలలోని శ్రీవారి దర్శనానికి (Tirumala Temple) రావద్దని టీటీడీ (TTD Management) సలహా ఇచ్చారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న దృష్ట్యా జలుబు, దగ్గు ఉన్న భక్తులకు దర్శన భాగ్యం కల్పించకుండానే వెనక్కి పంపించాలని టీటీడీ అధికారి సిబ్బందిని ఆదేశించారు.

Peculiar Wedding: 103 ఏళ్ళ తాత 27 ఏళ్ళ యువతిని గర్భవతిని చేశాడు, ఆపై ప్రేమ వివాహం చేసుకున్నాడు, ఇండోనేషియాలో ఘటన, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

Hazarath Reddy

ఈ న్యూస్ వినడానికి చాలా చిత్రంగా ఇది నిజం, ప్రేమకు వయస్సుతో సంబంధంలేదని మరోసారి ఈ జంట రుజువు చేశారు. ఇండేనేషియాకు (indonesia) చెందిన 107 ఏళ్ల వ్యక్తి (103-Year-Old Elderly Man), అదే దేశానికి చెందిన 27 ఏల్ల యువతిని పెళ్లాడాడు. కాగా పెళ్లికి ముందే వీరు ప్రేమలో పడ్డారు. ఆ సమయంలనే శారీరకంగా ఒకటయ్యారు. ఆ తర్వాత గర్భవతి అని తెలియగానే వెంటనే పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి మధ్య వయసు వ్యత్యాసం దాదాపు 76 ఏళ్లు. పెళ్లికి వచ్చిన వారంతా వీరిద్దరి జంటని చూసి ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో (Social Media) వీరి పెళ్లి వీడియో వైరల్ అవుతోంది.

Coronavirus In India: కరోనా ఉగ్రరూపం, ఇండియాలో 40కి చేరిన కరోనా కేసులు, తాజాగా కేరళలో 5మందికి, తమిళనాడులో ఒకరికి పాజిటివ్, కరోనాపై వదంతులను నమ్మొద్దని ప్రధాని పిలుపు

Hazarath Reddy

కరోనావైరస్‌(COVID 19) కేసుల సంఖ్య భారత్‌లో రోజు రోజుకీ పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కరోనా అనుమానితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నా, వాటిలో పాజిటివ్ కేసులు వేళ్లమీద లెక్కబెట్టే విధంగానే ఉన్నాయి. ఇప్పటికే దీని భారీన దేశ వ్యాప్తంగా (Coronavirus in India) 34 మంది పడగా తాజాగా మరో ఆరు మందికి కరోనా పాజిటివ్ (Coronavirus) వచ్చింది. దీంతో ఈ కేసుల సంఖ్య ఇండియాలో 40కి చేరింది.

Advertisement

Bird Flu In Kerala: కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్, 13 వేల కోళ్ల కాల్చివేతకు కేరళ ప్రభుత్వం ఆదేశాలు, కరోనా మరచిపోకముందే వణికిస్తున్న మరో వ్యాధి, ఈ వ్యాధికి 2016లో వేలాది బాతులు మృత్యువాత

Hazarath Reddy

కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం (Bird Flu Scare Hits Kerala) రేగింది. కోజికోడ్‌ జిల్లాలోని రెండు గ్రామాల్లో కోళ్లకు (Chickens) బర్డ్‌ ఫ్లూ సోకినట్లు అధికారులు గుర్తించారు.ఈ వైరస్ 12 వేల 900 కోళ్లకు బర్డ్ ఫ్లూ (Bird Flu In Kerala) సోకినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో ఈ కోళ్లను చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. కోజికోడ్ జిల్లాల్లో రెండు గ్రామాల్లో ఉన్న కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు గుర్తించారు.

India-EU Summit: కరోనా దెబ్బ, ప్రధాని మోదీ బ్రస్సెల్ పర్యటన రద్దు, సంప్రదింపుల అనంతరం తదుపరి తేదీ వెల్లడిస్తామని తెలిపిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్‌ కుమార్‌

Hazarath Reddy

ప్రపంచంలోని 50దేశాలకు కరోనా వైరస్ (Coronavirus Outbreak) ఇప్పటికే విస్తరించింది. పలు దేశాలకు ఈ వైరస్ విస్తరించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) అధికారిక విదేశీ పర్యటన రద్దయింది. మార్చి 13న ఇండియా-ఈయూ సమ్మిట్‌లో (India-European Union Summit) భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టాల్సిన బ్రసెల్స్‌ పర్యటన (Brussels Visit) రద్దయింది. సభ్య దేశాలతో సంప్రదింపుల అనంతరం తదుపరి తేదీలను వెల్లడిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్‌ కుమార్‌ గురువారం వెల్లడించారు.

Holi Milan: హోళీ వేడుకలు లేవు, హోళీ మిలన్‌కు దూరంగా అగ్రనేతలు, ఈ ఏడాది వేడుకలు రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్, ఇండియాలో 28కి చేరిన కరోనా మరణాలు

Hazarath Reddy

హోళీ మిలన్ వేడుకలు (Holi Milan 2020) భారతీయులకు చాలా కీలకం. అయితే దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి (Coronavirus Spread) చెందేందుకు అవకాశాలు ఉండటంతో ఈ ఏడాది హోళీ వేడుకలకు (Holi Milan) ప్రముఖులు ఒక్కొక్కరే దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో హోం మంత్రి అమిత్ షా (Amit Shah) 'హోళీ మిలన్'లో తాను పాల్గొనడం లేదని బుధవారంనాడు ప్రకటించారు.

COVID-19 In India: ఇండియాపై కరోనా దాడి, 15 మంది ఇటలీ పర్యాటకులకు కోవిడ్‌-19 వైరస్, షాక్‌కు గురయిన ఎయిమ్స్ వైద్యులు, ఆఘమేఘాల మీద ఐటీబీపీ కేంద్రానికి తరలింపు

Hazarath Reddy

చైనాలోని (China) వుహాన్‌లో పుట్టి దేశ దేశాలకు విస్తరించిన కోవిడ్‌-19 (Coronavirus) తాజాగా భారత దేశాన్ని వణికిస్తోంది. ఇప‍్పటికే ఢిల్లీ, తెలంగాణలో వైరస్‌లను గుర్తించగా ఇప్పుడు ఢిల్లీలో ఏకంగా 15 కేసులు నమోదయ్యాయి. ఇటలీ దేశం నుంచి భారతదేశ సందర్శనకు వచ్చిన 15 మంది పర్యాటకులకు కరోనా వైరస్ పాజిటివ్ (Coronavirus Outbreak) అని పరీక్షల్లో తేలడం సంచలనం రేపింది. 15 మంది ఇటాలియన్ టూరిస్టులకు (15 Italian Tourists) కరోనా వైరస్ సోకిందని బుధవారం ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వైద్యులు ప్రకటించారు.

Advertisement

#SheInspiresUs: 'నా సోషల్ మీడియా మొత్తం స్పూర్థినిచ్చే మహిళలకు అంకితం, అది మీరూ కావొచ్చు'. సోషల్ మీడియాకు దూరంగా ఉంటానన్న ప్రధాని మోదీ ఆలోచనలో మరో కోణం

Vikas Manda

మోదీ ఆలోచన ప్రకారం, మార్చి 08, 2020 మహిళా దినోత్సవం రోజున, నేరుగా ప్రధానికి సంబంధించిన అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచే #SheInspiresUs అనే హ్యాష్‌ట్యాగ్‌ను శక్తివంతమైన మహిళల కథలను పంచుకోవచ్చు.....

COVID-19 Outbreak: ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కోవిడ్-19, 3 వేలు దాటిన కరోనావైరస్ మృతుల సంఖ్య, సుమారు 90 వేలకు చేరిన వైరస్ బాధితుల సంఖ్య

Vikas Manda

60 ఏళ్లు పైబడి, రోగనిరోధక శక్తి తక్కువ ఉండే వారిపైనే కోవిడ్ 19 ప్రభావం ఎక్కువగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ వైరస్ బారిన పడిన బాధితుల్లో చాలా మందికి తేలికపాటి వ్యాధి లక్షణాలను మాత్రమే అనుభవిస్తారు, అయితే అందులో 14 శాతం మంది మాత్రమే న్యుమోనియా వంటి తీవ్రమైన వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారని...

'Leave India Notice': దేశం విడిచి వెంటనే వెళ్లిపో, పోలెండ్ విద్యార్థికి నోటీసు జారీ చేసిన ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ, ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని ఆరోపణలు

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా సీఏఏ అనుకూల, వ్యతిరేకుల మధ్య ఆందోళనలు ( CAA Row) మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో (Social Media) ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడితే వారిని ఆ రాష్ట్ర హోం శాఖ నోటీసులు జారీ చేస్తోంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయానికి (Jadavpur University) చెందిన మెరుగైన విద్యార్థికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO) 'లీవ్ ఇండియా నోటీసు' పంపింది.

Nirbhaya Case: నిర్భయ దోషుల కొత్త ఎత్తులు, ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చండి, సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసిన పవన్ కుమార్ గుప్తా, సోమవారం విచారణకు రానున్న పిటిషన్

Hazarath Reddy

మరో మూడు రోజుల్లో నిర్భయ దోషులను (Nirbhaya Case Convicts) ఉరితీయాల్సి ఉంది. ఉరిశిక్ష అమలుకు తీహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో.. ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఉరిశిక్షను వాయిదా వేసేందుకు దోషులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. తాజా నలుగురు దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా (Pawan Singh Gupta) సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ వేశాడు. తన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని కోర్టును (Supreme Court) అభ్యర్థించాడు.

Advertisement

TikTok Viral Video: ఫాలోవర్ల కోసం చావు అంచుల్లోకి, మంచుతో గడ్డుకట్టుకుపోయిన సరస్సులో ఈత, బయటకి వచ్చే దారి తెలియక సతమతం, ఎలాగోలా బయటపడిన జాసన్ క్లార్క్

Hazarath Reddy

సోషల్ మీడియాలో (Social Media) పాపులర్ కావాలని చాలామంది నానా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా టిక్ టాక్ లో (TikTok) అయితే ఫాలోవర్ల కోసం డేంజరస్ స్టంట్స్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకునే వారు చాలామందే ఉన్నారు. కొంతమంది అయితే ఏకంగా ప్రాణాలే కోల్పోయారు. ఇప్పుడు ఈ స్టోరి కూడా అలాంటి ఓ వ్యక్తిదే... ఫాలోవర్లను పెంచుకునేందుకు ఏకంగా చావు అంచుల దాకా వెళ్లి వచ్చాడు.

Sir John Tenniel: జాన్ టెన్నిఎల్ 200వ జయంతి నేడు, ఇలస్ట్రేటర్‌గా, వ్యంగ్య కళాకారుడుగా ఎన్నో విజయాలు, పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా డూడుల్‌ను రూపొందించిన గూగుల్

Hazarath Reddy

ఇలస్ట్రేటర్ మరియు వ్యంగ్య కళాకారుడు సర్ జాన్ టెన్నియల్ 200 వ జయంతిని (John Tenniel's 200th Birth Anniversary) సంధర్భంగా గూగుల్ ప్రత్యేకంగా గూగుల్ డూడుల్ (Google Doodle) రూపొందించింది. ఫిబ్రవరి 28, 1820 న లండన్లో జన్మించిన సర్ జాన్ టెన్నియల్ (John Tenniel) 1893 లో తన కళాత్మక విజయాల కోసం తన సమయాన్ని కేటాయించాడు. 20 సంవత్సరాల వయస్సులో, టెన్నియల్ ప్రమాదం కారణంగా కుడి కంటిలో దృష్టిని కోల్పోయాడు.

Coronavirus Outbreak: కరోనా మృత్యుఘోష, వుహాన్‌కు భారత్ మందులు, ఇరాన్ ఆరోగ్యమంత్రికి కోవిడ్-19, 2700కు పైగానే మృతుల సంఖ్య, భారత పౌరులకు హెచ్చరికలు జారీ చేసిన కేంద్ర,హోం, ఆరోగ్య శాఖలు

Hazarath Reddy

చైనాలో పుట్టిన కరోనా వైరస్ (Coronavirus Outbreak) మృత్యుఘోష ప్రపంచమంతా వినిపిస్తోంది. చైనాలో (China) విజృంభిస్తున్న ప్రాణాంతక వైరస్ కరోనా ఇప్పుడు దునియా మొత్తం చుట్టివేసింది. కరోనావైరస్ మృతుల సంఖ్య 2,744కు చేరినట్టు చైనా ఆరోగ్య అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ ప్రారంభ కేంద్రమైన హుబేయి ప్రావిన్స్‌లోనే అత్యధిక మరణాలు నమోదైనట్టు అధికారులు తెలిపారు.

Trump Concluded India Visit: రెండు రోజుల భారత పర్యటన ముగించుకొని స్వదేశానికి పయనమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ

Vikas Manda

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ తమ తొలి రెండు రోజుల భారత పర్యటనను ముగించుకొని మంగళవారం రాత్రి అమెరికాకు బయలుదేరిపోయారు. రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం ముగియగానే, ట్రంప్ ఫ్యామిలీ నేరుగా దిల్లీ విమానాశ్రయం చేరుకుని వారి ప్రత్యేక విమానంలో తిరిగి తమ స్వదేశానికి పయనమయ్యారు......

Advertisement

India- USA Deals: 'ఈ పర్యటన మాకెంతో ప్రత్యేకం, మీ ఆతిథ్యాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం' హైదరాబాద్ హౌజ్‌లో ట్రంప్ కీలక ప్రకటన, ఇండియా-యూఎస్ మధ్య కుదిరిన 3 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం

Vikas Manda

భారతదేశం నుంచి ఘనమైన స్వాగతం లభించింది. భారత ప్రజలు చూపిన ప్రేమ, ఆప్యాయతలు అమోఘం. దీనిని మేము ఎప్పటికీ గుర్తుంచుకుంటామ అని ట్రంప్ అన్నారు. ఈ పర్యటన ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇరు దేశాలు భాగస్వామ్య విలువలు పాటిస్తాయి కాబట్టి ఇండియా- యూఎస్ఎ ఎప్పటికీ మిత్రదేశాలని పేర్కొన్నారు....

Namaste Trump: అమెరికాలో భారత్‌కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం. కీలక ఒప్పందాలు, సినిమా- క్రికెట్ విశేషాలు, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం, పేదరిక నిర్మూలన; ఆల్ రౌండ్ స్పీచ్‌తో అదరగొట్టిన డొనాల్డ్ ట్రంప్

Vikas Manda

తన హయాంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఉన్నత స్థితిని చూసిందని తెలిపిన ట్రంప్, రాబోయే రోజుల్లో ఇండియా ఎకానమీ కూడా బలపడుతుందని, వచ్చే పదేళ్లలో ఇండియాలో పేదరికం పూర్తిగా నిర్మూలించబడి, మిడిల్ క్లాస్ జనాలు అతిపెద్ద సంఖ్యలో ఉండే దేశంగా మారుతుందని ట్రంప్ జోస్యం చెప్పారు....

Namaste Trump: ఒకరు స్టాచూ ఆఫ్ లిబర్టీ- ఇంకొకరు స్టాచూ ఆఫ్ యునిటీ..యూఎస్- భారత్ మధ్య ఉన్నది భాగస్వామ్యం కాదు, దగ్గరి సంబంధం, ఈ బంధం కలకాలం కొనసాగనీ: నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ప్రధాని మోదీ స్పీచ్

Vikas Manda

భారతదేశం-యుఎస్ సంబంధాలు ఇకపై మరొక భాగస్వామ్యం కాదు. ఇది చాలా గొప్ప మరియు దగ్గరి సంబంధం. ఒకటి 'స్వేచ్ఛా భూమి', మరొకటి ప్రపంచం ఒక కుటుంబం అని నమ్ముతుంది. ఒకరు 'స్టాచూ ఆఫ్ లిబర్టీ' గురించి గర్వంగా భావిస్తారు, మరొకరు భావిస్తారు 'స్టాచూ ఆఫ్ యూనిటీ' గురించి గర్వంగా చెప్పుకుంటారు. భారత్ - అమెరికా మైత్రి కలకాలం వర్ధిల్లాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.....

Trump Visit Highlights: మహత్ముడి చర్ఖాతో నూలు వడికిన అమెరికా అధ్యక్షుడు, వేలమంది జనం డొనాల్డ్ ట్రంప్ రోడ్ షోకు అడుగడుగునా కేరింతలతో స్వాగతం, ట్రంప్ అహ్మదాబాద్ సందర్శన విశేషాలు

Vikas Manda

మొతెరా స్టేడియం గా ప్రసిద్ది చెందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం లక్ష మందికి పైగా కూర్చునే సామర్థ్యం కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం. కొత్తగా నిర్మించిన స్టేడియం "నమస్తే ట్రంప్" కార్యక్రమానికి వేదిక.....

Advertisement
Advertisement