#SheInspiresUs: 'నా సోషల్ మీడియా మొత్తం స్పూర్థినిచ్చే మహిళలకు అంకితం, అది మీరూ కావొచ్చు'. సోషల్ మీడియాకు దూరంగా ఉంటానన్న ప్రధాని మోదీ ఆలోచనలో మరో కోణం

మోదీ ఆలోచన ప్రకారం, మార్చి 08, 2020 మహిళా దినోత్సవం రోజున, నేరుగా ప్రధానికి సంబంధించిన అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచే #SheInspiresUs అనే హ్యాష్‌ట్యాగ్‌ను శక్తివంతమైన మహిళల కథలను పంచుకోవచ్చు.....

File image of PM Narendra Modi (Photo Credits: PTI)

New Delhi, March 3: దేశంలో సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తన ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ సహా మిగతా అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ ను ఈ ఆదివారం వదిలేద్దామనుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. దీంతో లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ కలిగి ప్రధాని ఎందుకిలా చేస్తున్నారబ్బా అనే సందేహాలు అందరూ వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అయితే సోషల్ మీడియాను కాదు, మతపరమైన ధ్వేషాన్ని వదులుకోండి అంటూ తనదైన శైలిలో విమర్శలు చేశారు. అయితే మోదీ చేసిన ఆ ట్వీట్ కి అర్థం- అంతరార్థం వేరే ఉంది. ఆయన నిజానికి సోషల్ మీడియా నుంచి వైదొలగడం లేదు. కానీ, ఆ ఒక్కరోజు తన సోషల్ మీడియా అకౌంట్లను మహిళలకు ఇచ్చేస్తున్నట్లు ఆయన తాజాగా చేసిన మరో ట్వీట్ ద్వారా స్పష్టం అయింది.

ఈ ఆదివారం 'మహిళా దినోత్సవం' జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా సమాజంలో స్పూర్థిధాయకంగా నిలిచే మహిళలందరికీ తన సోషల్ మీడియాను ఆ ఒక్కరోజు అంకితమిస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. "అలాంటి మహిళలు మీరైతే, లేదా నలుగురికి స్పూర్థిగా నిలిచే మహిళ మీకు తెలిస్తే, తన సోషల్ మీడియా ద్వారా మీ స్పూర్థిధాయకమైన కథను పంచుకోండి" అంటూ ప్రధాని మోదీ ఆఫర్ ఇచ్చారు. అలా పంచుకోవడం ద్వారా ఆ కథ ఎంతో మందికి చేరి, మరెంతో మంది మహిళల్లో స్పూర్థిని నింపుతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

మోదీ ఆలోచన ప్రకారం, మార్చి 08, 2020 మహిళా దినోత్సవం రోజున, నేరుగా ప్రధానికి సంబంధించిన అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచే #SheInspiresUs అనే హ్యాష్‌ట్యాగ్‌ను శక్తివంతమైన మహిళల కథలను పంచుకోవచ్చు.

Here is the PM's tweet:

లేదా స్వయంగా వారే తమ ఆదర్శవంతమైన ప్రయాణాన్ని , తమ జీవితంలో కష్టనష్టాల కోర్చి సాధించిన విజయాలను నరేంద్ర మోదీ పేజీ ద్వారా స్వయంగా పోస్ట్ చేయవచ్చు. అయితే అందుకు తమ కథను తెలుపుతూ ముందుగానే ఎంట్రీలు పంపాల్సి ఉంటుంది. ప్రధాని కార్యాలయం అధికారులు ఎంపిక చేసిన కొందరికి అవకాశం కల్పిస్తారు.



సంబంధిత వార్తలు

Bandi Sanjay: మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి, సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్న బండి సంజయ్...మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని వెల్లడి

India-US Ties Have Strong Foundation: భారత్-అమెరికా మధ్య సంబంధాలపై వైట్ హౌస్ కీలక వ్యాఖ్యలు, అదాని అంశం ఎంతమాత్రం ప్రభావం చూపదని వెల్లడి

India Canada Dispute: ఇండియా ఆగ్రహంతో దిగి వచ్చిన కెనడా, ఆ తీవ్రవాది హత్య వెనుక మోదీ, అమిత్ షా హస్తం లేదని ప్రకటన, మీడియా కథనాలను కొట్టివేసిన ట్రూడో ప్రభుత్వం

YS Sharmila: జగన్‌పై మరోసారి నిప్పులు చెరిగిన వైఎస్‌ షర్మిల, ప్రభాస్‌తో సంబంధం అంటగట్టారు..ఇదంతా చేయించింది జగనే...అప్పుడు ఎందుకు ఎంక్వైరీ అడగలేదో చెప్పాలని షర్మిల డిమాండ్