Business

Mobikwik Gold Offer: మొబిక్విక్ మెగా ఎక్స్చేంజ్ వన్ గెట్ వన్, 1 గ్రాము డిజిటల్ గోల్డ్‌ మార్చుకుంటే ఒక గ్రాము డిజిటల్ గోల్డ్ ఉచితం, ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఆఫర్ వర్తింపు, పరిమిత కాలం మాత్రమే

Hazarath Reddy

దీపావళి, ధన్‌తేరాస్ సందర్భంగా ప్రముఖ ఇ-వాలెట్ సంస్థ మొబీక్విక్ యూజర్ల కోసం మెగా ఎక్స్చేంజ్ వన్ గెట్ వన్ ఆఫర్ ప్రకటించింది. ఈ పండుగ సీజన్‌లో బంగారం కొనుగోలు చేసే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది.

Fuel Home Delivery: ఇక మీ ఇంటికే పెట్రోల్, డీజిల్, ఎంత కావాలంటే అంత ఆర్డర్ చేసుకోవచ్చు, కసరత్తు చేస్తున్నకేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ, యాప్‌ను రెడీ చేస్తున్న చమురు సంస్థలు

Hazarath Reddy

కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ త్వరలో శుభవార్తను అందించబోతోంది. ఇకపై మీరు నేరుగా డీజిల్, పెట్రోల్ కోసం పెట్రోలు బంకులు చుట్టూ తిరగకుండా మీ ఇంటికే నేరుగా అవి వచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు పెట్రోలియం ఎక్స్ ప్లోజివ్స్ భద్రతా విభాగం (PESO)తో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

Modi New Schemes: రోజుకు రూపాయి చెల్లిస్తే రూ.2 లక్షల భరోసా, రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం, అదరహో అనిపిస్తున్న మోడీ స్కీముల గురించి తెలుసుకోండి

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వం రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై)Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana (PMJJBY)ను అలాగే ప్రధానమంత్రి సురక్షా యోజన (పీఎంఎస్‌బీవై)Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY)ల పేరుతో ఇన్సూరెన్స్ స్కీమ్స్‌ను అందిస్తోంది. వీటి కాలపరిమితిని ఏడాదిగా నిర్ణయించింది.

Uber-Ola Drivers On Strike: తెలంగాణకి మరో షాక్, ఈ నెల 19 నుంచి హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ల నిరవధిక సమ్మె, అదే రోజున సమ్మెలోకి వెళుతున్న ఆర్టీసీ కార్మిక సంఘాలు

Hazarath Reddy

తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వాసులకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే తెలంగాణాలో 13 రోజుల నుంచి ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. అందరూ ప్రత్యామ్నాయ మార్గాలతో గమ్యస్థానానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో వర్గం కూడా సమ్మెకు సిద్ధమైంది. ఈనెల 19 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు తెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్ల జేఏసీ నిర్ణయించింది.

Advertisement

Satya Nadella: అమెరికాను ఏలుతున్న తెలుగువాడు, ఏడాదికి రూ.305 కోట్ల ప్యాకేజీతో దుమ్మురేపిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల, ప్రగతి పథంలో దూసుకెళ్తున్న మైక్రోసాఫ్ట్, ప్రశంసలతో ముంచెత్తిన బోర్డు డైరకర్లు

Hazarath Reddy

తెలుగువాడు సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఆ సంస్థ అమితవేగంతో దూసుకువెళుతోంది. క్యాపిటలైజేషన్ విషయంలో మైక్రోసాఫ్ట్ ఇటీవల 1 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకుంది.

Coriander Price Hike: ఉల్లిగడ్డతో పోటీకి కొత్తిమీర సై, అమాతంగా పెరిగిన ధర, 2రూపాయిల నుంచి 17 రూపాయిలకు చేరిక, నవంబర్ నెలలో ఇంకా పెరిగే అవకాశం

Hazarath Reddy

కొత్తిమీర వంటకాలకు మంచి సువాసనను ఇవ్వడమే కాకుండా బరువును తగ్గించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇందులోని సి,కె. ఐరన్, క్యాల్షియం వంటివి పుష్కలంగా వున్నాయి.

PF Interest Credit: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే మీ ఖాతాలో వడ్డీ క్రెడిట్ అయింది, పీఎఫ్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంతుందో చెక్ చేయడం ఎలాగో తెలుసుకోండి?

Hazarath Reddy

ఈపీఎఫ్ ఖాతాదారులకు ఎంప్లాయిస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గానైజేషన్ (EPFO)శుభవార్తను అందించింది. దీపావళి సెలబ్రేషన్ ను మీఇంటికి తీసుకువచ్చింది. పండగకు ముందుగానే 2018-2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చాలామంది పీఎఫ్ అకౌంట్ దారుల అకౌంట్లలో 8.65 శాతం వరకు వడ్డీని క్రెడిట్ చేసింది.

Raghuram Rajan: బ్యాకింగ్ వ్యవస్థను వెంటనే ప్రక్షాళన చేయాలి, ప్రమాదకర స్థాయిలో భారత ద్రవ్యలోటు, కీలక నిర్ణయాలలో రాజకీయ వ్యవస్థ జోక్యం తగదు, హెచ్చరించిన ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌

Hazarath Reddy

భారత ద్రవ్య లోటు ప్రమాదకర స్థాయిలో ఉందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ హెచ్చరించారు. 2016లో భారత వృద్ధి రేటు 9శాతం ఉండగా, క్రమక్రమంగా ఇప్పుడు అయిదు శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు.

Advertisement

Whatsapp Disappear: గూగుల్ ప్లే స్టోర్ నుంచి సడన్‌గా వాట్సప్ మాయం, కొత్తగా ఇన్‌స్టాల్‌ చేసుకునే వారికి కనపడని యాప్, అందుబాటులో వాట్సప్ ఫర్‌ బిజినెస్‌

Hazarath Reddy

ఇన్‌స్టంట్ మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న మెసేజింగ్ దిగ్గజం యూజర్లకు ఒక్కసారిగా షాకిచ్చింది. కొత్తగా ఇన్‌స్టాల్‌ చేసుకోవడానికి ప్రయత్నించిన యూజర్లకి గూగుల్ ప్లే స్టోర్ లో ఈ యాప్ ఎంత వెతికినా కనపడలేదు.

Jio Good News: జియో యూజర్లకు ఊరట, మీ ప్లాన్ ముగిసే దాకా ఎటువంటి ఛార్జీలు ఉండవు, ఆ తర్వాత ఖచ్చింతగా రీఛార్జ్ చేసుకోవాల్సిందే, ట్విట్టర్ ద్వారా తెలిపిన జియో

Hazarath Reddy

టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఇంటర్‌కనెక్ట్ యూజ్ చార్జీల పేరుతో యూజర్ల దగ్గర నుంచి బాదుడు మొదలుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇకపై యూజర్లు ఇతర నెట్‌వర్క్‌లకు చేసే అవుట్‌గోయింగ్ కాల్‌లకు నిమిషానికి ఆరు పైసలు వసూలు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Jio Charge For Calls: ఇకపై జియోలో ఉచిత కాల్స్ ఉండవు, ఔట్ గోయింగ్ కాల్స్‌పై నిమిషానికి 6 పైసల చొప్పున ఛార్జ్, కొత్త టాపప్ వోచర్స్ వివరాలు ఇలా ఉన్నాయి

Vikas Manda

ఇతర నెట్ వర్క్స్ కారణంగా ట్రాయ్ (TRAI) నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు జియో నెట్ వర్క్ ఒక ప్రకటనలో తెలిపింది. IUC ఛార్జీలకు బదులుగా వసూలు చేసిన మొత్తానికి డేటాను ఉచితంగా అందిస్తామని వెల్లడించింది. గత మూడేళ్లలో IUC ఛార్జీల కింద ఎయిర్ టెల్, వోడాఫోన్ మరియు ఐడియా లాంటి...

EMI Offers On Debit Card: మీ డెబిట్ కార్డుకు ఈఎమ్ఐ ఆఫర్ ఉందో లేదో తెలుసుకోవడం ఎలా?, లిమిట్ వివరాలు తెలుసుకోవడం ఎలా?, స్టెప్ బై స్టెప్ మీకోసం

Hazarath Reddy

బ్యాకింగ్ రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ ప్రభుత్వ బ్యాకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) (state bank of india)తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇకపై ఎస్‌బీఐ డెబిట్ కార్డును వాడే వినియోగదారుల ఈఎంఐ సౌకర్యాన్ని పొందవచ్చు.

Advertisement

Jio Stunning Plan: జియో సరికొత్త వ్యూహం, రూ. 700తో 4జీ ప్రపంచాన్ని ఏలేయమంటోంది, దిగ్గజాలకు షాకిస్తూ 2జీ మార్కెట్‌పై కన్ను, ప్రత్యేక ఆఫర్లతో ముందుకు, జియోఫోన్ అత్యంత తక్కువ ధరకే అందుబాటులో..

Hazarath Reddy

దేశీయ టెలికాం మార్కెట్లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన రిలయన్స్ జియో సరికొత్తగా అడుగులు వేస్తోంది. టెలికం రంగం మొత్తాన్ని జియోకు ముందు, జియోకు తరువాత అన్న చందంగా మార్చివేసిన ఈ దిగ్గజం ఇప్పుడు మొబైల్ మార్కెట్‌ని శాసించేందుకు ఎత్తులు వేస్తోంది.

Samsung Galaxy Fold 2: వావ్...శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ 2 కూడా వచ్చేస్తోంది, పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న శాంసంగ్, అమ్మకాల్లో దుమ్మురేపుతున్న గెలాక్సీ ఫోల్డ్, 30 నిమిషాల్లోనే బుకింగ్స్ క్లోజ్

Hazarath Reddy

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ప్రపంచ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతుంది. తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఫోల్డ్ ద్వారా హైఎండ్ మార్కెట్లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకునేందుకు సర్వం సిద్ధం చేసుకుంది.

Advertisement
Advertisement