Business

Bajaj Chetak e-Scooter: త్వరలో విడుదల కాబోతున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్, పుణెలో ప్రదర్శనకు ఉంచిన బజాస్ సంస్థ, ఈ స్కూటర్ ధర, ఫీచర్లు, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి

Vikas Manda

బజాజ్ ఆటో చైర్మన్ రాహుల్ బజాజ్ (Rahul Bajaj) మాట్లాడుతూ బజాజ్ ద్వారా విడుదలవుతున్న తొలి ఎలక్ట్రిక్ వాహనం 'చేతక్ ఇ-స్కూటర్‌'ను జనవరి నుంచి భారతదేశం అంతటా కెటిఎం (KTM) డీలర్‌షిప్‌ల ద్వారా....

Honda Suspend Operations: హోండా షాకింగ్ నిర్ణయం, మానేసర్ హోండా ప్లాంటు మూసివేత, కార్మికులతో చర్చలు విఫలం, ఉపాధి కోల్పోయన వారి సంఖ్య 1000కు పైగానే..

Hazarath Reddy

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (Honda Motorcycle and Scooter India) హర్యానా లోని మానేసర్‌లో గల (Manesar In Haryana) తన ప్లాంట్‌లో కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేసింది. ఆందోళన చేస్తున్న కార్మికులతో చర్చలు విఫలం కావడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకంది. సోమవారం నుండి ప్లాంట్ సాధారణ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు(indefinitely suspended operations) సంస్థ నోటీసు విడుదల చేసింది.

TRAI MNP's New Rule: మొబైల్ వినియోగదారులకు శుభవార్త, ఎంఎన్‌పీ ఇకపై రెండు రొజుల్లోనే పూర్తి, డిసెంబర్ 16వ తేదీ నుంచి అమల్లోకి, ట్రాయ్ ప్రకటనలో వెల్లడి

Hazarath Reddy

దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ వినియోగదారులకు ట్రాయ్ (TRAI) శుభవార్తను అందించింది. ఇకపై ఎంఎన్‌పీ( Mobile Number Portability) ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ప్రస్తుతం ఒక టెలికాం కంపెనీ నుంచి మరొక టెలికాం కంపెనీకి వినియోగదారుడు తన మొబైల్ నంబర్‌ను ఎంఎన్‌పీ ద్వారా పోర్ట్ చేసుకునేందుకు 7 రోజుల వరకు సమయం పడుతోంది.

Reliance Jio Good News: కేబుల్ కనెక్షన్ లేకుండా 150 ఛానళ్లు చూడొచ్చు, జియో సెటప్ బాక్స్‌లో ఆఫర్, జియో సెట్ టాప్ బాక్స్‌లో ప్రత్యేకంగా జియో టీవీ+ యాప్

Hazarath Reddy

న వినియోగదారులకు సెట్ టాప్ బాక్సు(Jio Set-top Box)లను పంపిణీ చేయడం ప్రారంభించింది.ట్రయల్ పీరియడ్ ముగిసి జియో సర్వీసులకు నగదు చెల్లించి సబ్ స్క్రైబ్ చేసుకున్న వారికి కంపెనీ సెట్ టాప్ బాక్సులను అందిస్తోంది.

Advertisement

AP Sand Online Booking Process: ఇకపై ఇసుక కొరత తీరినట్లే, ప్రభుత్వ స్టాక్‌ యార్డుల్లో భారీగా నిల్వ, బుకింగ్ ప్రాసెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి

Hazarath Reddy

ఏపీలో వరదలు తగ్గుముఖం పట్టడంతో ఇసుక కొరత తీరినట్లుగా కనిపిస్తోంది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం( AP GOVT) పలు చోట్ల ప్రభుత్వ స్టాక్‌ యార్డుల్లో ఇసుక నిల్వను ఉంచింది. విశాఖ శివారు అగనంపూడిలో 8,076 టన్నులు.. ముడసర్లోవలో 14,227 టన్నులు.. నక్కపల్లిలో650 టన్నులు.. నర్సీపట్నంలో 85 టన్నులు... ఇలా 23 వేల టన్నులకు పైగా ఇసుక ప్రభుత్వ స్టాక్‌ యార్డుల్లో నిల్వ ఉంది.

Reliance Jio: యూజర్లకు జియో ఝలక్, రూ.149 ప్లాన్‌లో స్వల్ప మార్పులు, ఇకపై వ్యాలిడిటీ 24 రోజులు మాత్రమే, మిగతా ప్రయోజనాలు యథాతథం

Hazarath Reddy

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ కస్టమర్లకు అందిస్తున్న రూ.149 ప్లాన్ బెనిఫిట్స్‌కు పలు మార్పులు చేసింది. ఈ క్రమంలో ఇకపై ఈ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 1.5 జీబీ డేటాతోపాటు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. అలాగే 300 నిమిషాల జియో టు నాన్ జియో కాల్స్ వస్తాయి.

Onion Import: ఉల్లిపై కేంద్రం కీలక నిర్ణయం, విదేశాల నుంచి లక్ష టన్నుల ఉల్లిపాయలు దిగుమతి, నాఫేడ్‌కు దేశ వ్యాప్తంగా పంపిణీ చేసే బాధ్యతలు అప్పగింత, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ వెల్లడి

Hazarath Reddy

దేశంలో రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. డిమాండ్ కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో అక్టోబర్ నుంచి ఉల్లిపాయల ధరలు అధికంగా పెరిగిన విషయం తెలిసిందే. తుఫాను దెబ్బకు కొన్ని రాష్ట్రాల్లో పంట పూర్తిగా దెబ్బతింది.

Nokia Smart TVs: నోకియా నుంచి స్మార్ట్‌టీవీలు,ఇండియాలో విడుదల చేయనున్న ఫ్లిప్‌కార్ట్, అదిరిపోయే ఫీచర్లతో ఇతర స్మార్ట్‌టీవీలకు పోటీ ఇవ్వనున్న నోకియా

Hazarath Reddy

ఈ-కామర్స్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ( e-commerce major Flipkart) ప్రముఖ మొబైల్స్ తయారీ కంపెనీ నోకియా(Nokia)తో కలిసి త్వరలో స్మార్ట్‌టీవీలను తయారు చేసి ఇండియా(India)లో లాంచ్ చేయ‌నుంది. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే నోకియాతో భాగస్వామ్యం అయింది.

Advertisement

ICICI Opens 57 Branches In AP,TG: తెలుగు రాష్ట్రాలకు ఐసీఐసీఐ శుభవార్త, కొత్తగా 57 బ్రాంచీల ఏర్పాటు, ఏపీలో 23, తెలంగాణలో 34 బ్యాంక్‌లు, తెలుగు రాష్ట్రాల్లో 402కి చేరుకున్న మొత్తం బ్రాంచీల సంఖ్య

Hazarath Reddy

ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ దిగ్గజం ఐసీఐసీఐ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ ఏడాది కొత్తగా 57 బ్రాంచీలను అందుబాటులోకి తీసుకురానుంది. వీటిలో ఏపీలో 23, తెలంగాణలో 34 బ్యాంక్‌లు రానున్నాయని ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త బ్రాంచీలతో కలిపి తెలుగు రాష్ట్రాల్లో వీటి సంఖ్య 402కి చేరుతుందని, వీటిల్లో ఏపీలో 179, తెలంగాణలో 223 శాఖలు ఉండనున్నాయి. వీటికి తోడు మొత్తం 1,580 ఏటీఎంలను ఐసీఐసీఐ నిర్వహిస్తోంది.

iSmart Bike: 'హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్‌' బైక్ విడుదల, భారతదేశపు తొలి బిఎస్ 6 మోటారుసైకిల్ ఇదే, దీని ధర మరియు ఇతర విశేషాలు ఇలా ఉన్నాయి

Vikas Manda

ఇది వరకు ఈ మోడెల్ లో విడుదలైన బైక్స్ కంటే ఈ మోటారుసైకిల్‌ను మరింత ధృడంగా మరియు స్థిరత్వాన్ని కలిగి ఉండేలా రూపొందించారు. ఫ్రంట్ సస్పెన్షన్ ను 15 మి.మీ మరియు వీల్‌బేస్ 36 మి.మీ పెంచారు, ఈ హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్‌ ధర..

Flight Offers: రూ. 6,714/- కే అంతర్జాతీయ విమాన ప్రయాణం. ఇండిగో ఎయిర్‌లైన్స్ మరియు గోఎయిర్ విమానయాన సంస్థల నుంచి పోటాపోటీ ఆఫర్లు

Vikas Manda

నవంబర్ 17లోపు టికెట్ బుకింగ్ చేసుకునేవారికి మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. గడువు లోపు టికెట్ బుకింగ్ చేసుకున్న వారు నవంబర్ 13, 2019 నుంచి ఏప్రిల్ 15, 2020 మధ్య ఎప్పుడైనా తమ ప్రయాణం షెడ్యూల్...

Onion Price Hike Again: సెంచురీ దిశగా ఉల్లి ధరలు, సామాన్యులు కొనలేని పరిస్థితి, మహారాష్ట్రలో భారీగా దెబ్బతిన్న ఉల్లి పంటలు, మరో 10 రోజుల పాటు ఇదే ధరలు కొనసాగే అవకాశం

Hazarath Reddy

ఉల్లిపాయ ధరలు భారీగా పెరిగిపోయాయి. కొండెక్కి దిగనంటున్నాయి. సామాన్యులు ఉల్లిపాయ కొనలేని పరిస్థితి ఏర్పడింది. దేశంలోని పలు ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర రూ.100గా ఉంది. ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఢిల్లీలో ఉల్లిపాయలను ప్రభుత్వ ఆధ్వర్యంలో అమ్ముతున్నారు. హైదరాబాద్‌లో కిలో ఉల్లి ధర రూ.50 70 మధ్య అమ్ముతున్నారు.

Advertisement

Airtel RS.4 Lakh Insurance Plan: ప్రీపెయిడ్‌ కస్టమర్లకు ఎయిర్‌టెల్ బంపరాఫర్, రూ.599 ప్లాన్‌ మీద రూ.4 లక్షల బీమా సౌకర్యం, భారతి ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీతో ఒప్పందం, ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకోండి

Hazarath Reddy

భారతి ఎయిర్‌టెల్‌ (Airtel) తన ప్రీపెయిడ్‌ కస్టమర్ల (prepaid plan Users) కోసం బంపర్‌ఆఫర్‌ తీసుకొచ్చింది. రూ.599 ప్లాన్‌ (Rs 599 prepaid plan) రీచార్జ్‌ చేసుకున్న వినియోగదారులకు రూ.4 లక్షల విలువైన బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం భారతి ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ(Bharti AXA Life Insurance)తో ఒప్పందం కుదుర్చుకుంది.

Jio Discount Offers: జియో మరో బంపరాఫర్, పేటీఎం ద్వారా రీఛార్జ్ చేసుకుంటే రూ.50 తగ్గింపు, రూ.444, రూ.555 ప్యాక్‌లపై మాత్రమే, కోడ్ వివరాలు తెలుసుకోండి

Hazarath Reddy

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో ఐయూసీ ఛార్జీలు అమల్లోకి వచ్చిన తరువాత రీఛార్జ్ ప్యాక్ రేట్లు పెరిగిపోయాయి. రూ.399 రీఛార్జ్ కు 1.5 జిబి డేటాను అందిస్తున్న జియో దానికి అదనంగా ఐయూసీ ఛార్జీలను తీసుకుంటోంది. ఈ పాలసీ అమల్లోకి వచ్చిన తరువాత జియో ఆల్ ఇన్ వన్ ప్యాక్ ల పేరుతో రూ.444, రూ.555 ఆఫర్లను ప్రవేశపెట్టింది.

LPG Cylinder Price Hike Again: మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర, ఏకంగా రూ.76 పెంపు, ప్రస్తుత ధర రూ.733.50, సబ్సిడీ సిలిండర్‌ ధరలో ఎటువంటి మార్పు లేదు

Hazarath Reddy

మధ్యతరగతి ప్రజలకు నవంబర్ 1వ తేదీ షాక్ తగిలింది. వంట గ్యాస్ ధర పెరిగింది. ఎల్‌పీజీ సిలిండర్ ధర పెరుగుదల నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది. సిలిండర్ ధర ఏకంగా రూ.76 మేర పెరిగింది. ఇదిలా ఉంటే నాలుగు నెలలుగా ధర పైపైకి వెళ్తోంది.

Audi Car Bumper Offer: ఆడి ఎస్‌యూవీలపై రూ.6లక్షల తగ్గింపు, పరిమిత కాల ఆఫర్‌గా డిస్కౌంట్, 2009లో లాంచ్ అయిన క్యూ5, క్యూ7 ఎస్‌యూవీ కార్లు, ప్రారంభ ధర రూ.55.8 లక్షలు

Hazarath Reddy

ఆటోమైబల్ రంగంలో దిగ్గజాలకు సవాల్ విసురుతున్న జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి కారు అభిమానుల కోసం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ కంపెనీ నుంచి వచ్చిన ప్రముఖ ఎస్‌యూవీలపై రూ. 6లక్షల దాకా భారీ తగ్గింపును ఆఫర్‌ చేస్తోంది. పరిమిత కాల ఆఫర్‌గా ఈ డిస్కౌంట్‌ను అందిస్తున్నట్టు ఆడి ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

Gold Prices: సామాన్యులకు అందని ద్రాక్షల బంగారం, డిసెంబర్ నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ. 42 వేల గరిష్టానికి చేరుకోవచ్చని అంచనా, ఆర్థిక మందగమనంతో పాటు ఎన్నో కారణాలు

Vikas Manda

సామాన్యులకు అందని ద్రాక్షగా బంగారం మారిపోయింది. భారీ ధరల కారణంగా సామాన్య, మధ్య తరగతి వర్గాల్లో ఈ దీపావళి వెలుగులు నింపలేకపోయింది. ఈ ఏడాది మార్కెట్లో బంగారం కొనుగోళ్లు దారుణంగా పడిపోయాయి....

Discount Sales Ban: బ్యాన్ దిశగా డిస్కౌంట్ సేల్స్, ఈ కామర్స్ దిగ్గజాల వ్యాపారంపై కేంద్ర ప్రభుత్వం కన్ను, ఫిర్యాదు చేసిన సీఏఐటీ, డిస్కౌంట్‌ దందాపై దర్యాప్తు చేపడతామన్న కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌

Hazarath Reddy

ఈ కామర్స్ దిగ్గజాలు పండుగ సమయాల్లో ప్రకటిస్తున్న డిస్కౌంట్ దందాలపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. మొత్తం ఏడాది వ్యాపారంలో సగం పండగ సీజన్‌లోనే జరుగుతుందనే అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) వరుస ఫిర్యాదుల నేపథ్యంలో మోడీ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది.

Jio Phone All-in-One Plans: జియో ఆల్‌ ఇన్ వన్ ప్లాన్స్‌, జియో ఫోన్ వాడేవారికి ఇది శుభవార్తే, ఒకే ప్లాన్‌లో అన్ని రకాల సేవలు, ఈ మధ్య ప్రకటించిన కొత్త ప్లాన్ల వివరాలు కూడా తెలుసుకోండి

Hazarath Reddy

రిలయన్స్ జియో తమ 4జీ ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది. రూ.75-రూ.185 మధ్య ప్రవేశపెట్టిన ఈ ప్లాన్లు ప్రస్తుతం ఉన్న వాటికి అదనమని కంపెనీ తెలిపింది. కాగా కొద్ది రోజుల క్రితమే స్మార్ట్‌ఫోన్‌లో జియో ఉపయోగించేవారికి ఆల్‌ ఇన్ వన్ ప్లాన్స్‌ను జియో ప్రకటించిన సంగతి తెలిసిందే.

Reliance Jio New Strategy: అప్పులు లేని కంపెనీగా జియో, డిజిటల్ సేవల కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటు, ఇందుకోసం రూ.1.08 లక్షల కోట్ల పెట్టుబడి,సరికొత్త వ్యూహంతో ముకేష్అంబానీ

Hazarath Reddy

చమురు నుంచి టెలికం రంగం వరకు సేవలు అందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా డిజిటల్ సేవలు అందించడానికి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది.ఇందులో భాగంగా రిలయన్స్‌ జియో (ఆర్‌జియో) లిస్టింగ్‌ దిశగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రయత్నాలు ప్రారంభించింది.

Advertisement
Advertisement