Airtel RS.4 Lakh Insurance Plan: ప్రీపెయిడ్ కస్టమర్లకు ఎయిర్‌టెల్ బంపరాఫర్, రూ.599 ప్లాన్ మీద రూ.4 లక్షల బీమా సౌకర్యం, భారతి ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం, ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకోండి
రూ.599 ప్లాన్ (Rs 599 prepaid plan) రీచార్జ్ చేసుకున్న వినియోగదారులకు రూ.4 లక్షల విలువైన బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం భారతి ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ(Bharti AXA Life Insurance)తో ఒప్పందం కుదుర్చుకుంది.
Mumbai,November 5: భారతి ఎయిర్‌టెల్ (Airtel) తన ప్రీపెయిడ్ కస్టమర్ల (prepaid plan Users) కోసం బంపర్‌ఆఫర్ తీసుకొచ్చింది. రూ.599 ప్లాన్ (Rs 599 prepaid plan) రీచార్జ్ చేసుకున్న వినియోగదారులకు రూ.4 లక్షల విలువైన బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం భారతి ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ(Bharti AXA Life Insurance)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్య ఒప్పందం ద్వారా భారతి ఎయిర్‌టెల్ ప్రీ-పెయిడ్ మొబైల్ కస్టమర్లు ఆక్సా నుండి జీవిత బీమా పొందుతారని ఎయిర్‌టెల్ సోమవారం ప్రకటించింది.
రూ.599 ల కొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్‌పై రోజుకు 2జీబీ డేటా, ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్(100 SMSes per day)లను ఆఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ 84 రోజులు చెల్లుబాటులో ఉంటుంది. ప్రతి రీఛార్జితో మూడు నెలల వరకు బీమా కవర్ ఆటోమాటిక్‌గా కొనసాగుతుంది.
18-54 సంవత్సరాల వయస్సు గల వినియోగదారులందరికీ లభించే ఈ జీవిత బీమా సౌకర్యానికి ఎలాంటి వైద్య పరీక్షలు, ధృవీకరణ పత్రం అవసరం లేదనీ, తక్షణమే డిజిటల్ కాపీని కస్టమర్ ఇంటికే పంపిస్తామని భారతి ఎయిర్‌టెల్ ఢిల్లీ-ఎన్‌సిఆర్, సీఈవో వాణి వెంకటేష్ తెలిపారు.
దీన్ని ప్రస్తుతం ఢిల్లీతో పాటు కొన్ని రాష్ట్రాల్లోనే ప్రవేశపెట్టినట్లు, క్రమంగా ఇతర ప్రాంతాలకూ విస్తరించనున్నట్లు కంపెనీ వివరించింది.
ఈ ప్రయోజనం పొందడానికి, కస్టమర్ ఎస్‌ఎంఎస్, ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ లేదా ఎయిర్‌టెల్ రిటైలర్ ద్వారా మొదట రీఛార్జ్ చేసిన తర్వాత నమోదు చేసుకోవాలన్నారు.కాగా ఎయిర్ టెల్ ఈ ఏడాది మే నెలలో రూ.249 ప్లాన్‌తోను రూ.4 లక్షల ఇన్సురెన్స్ కవర్ (RS.4 Lakh Insurance) ప్రకటించింది.ఇందుకు హెచ్‌డీఎఫ్‌సీ ఇన్సురెన్స్‌తో జత కలిసింది.