సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బన్నీని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు. పీఎస్ లో అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. తాజాగా నాపంల్లి కోర్లు 14 రోజుల జ్యుడిషయల్ రిమాండ్ విధించింది. హైకోర్టులో ఈ కేసుపై వాదనలు జరుగుతున్నాయి.
సంధ్య థియేటర్ లేఖను బన్నీ తరపు లాయర్లు హైకోర్టుకు సమర్పించారు. ఈనెల 4న పుష్ప 2 ప్రీమియర్ షో గురించి ముందుగానే సీపీకి సంధ్య థియేటర్ లేఖ రాసింది. రాత్రి 9.30కి హీరో, హీరోయిన్ సహా వీఐపీలు వఇస్తున్నారని లేఖలో మెన్షన్ చేసింది. అవసరమైన పోలీసు బందోబస్తు కోరుతూ థియేటర్ యాజమాన్యం లేఖ రాసింది.
ఈ నెల 4న రాత్రి పుష్ప 2 ప్రీమియర్ షోకు… ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కేవలం బౌన్సర్లతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వచ్చారని… అల్లు అర్జున్ కోసం అభిమానులు ఒక్కసారిగా ఎగబడటంతో సంధ్య థియేటర్ దగ్గర తోపులాట జరిగిందని చెబుతున్నారు.
తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా…ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా…ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనన్నారు. ఈ తొక్కిసలాటకు థియేటర్ యాజమాన్యమే కారణమని పోలీసులు ఆరోపించారు. అల్లు అర్జున్‌ను నిందితుడిగా చేర్చారు పోలీసులు.ఈ కేసులో ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.