Wonder at Nallapochamma Temple Hyderabad, Devotees lined up for darshan(video grab)

కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జనవరి ఒకటో తేదీన దైవదర్శనం చేసుకోవడం అనేది ఈ మధ్యకాలంలో ఒక ఆనవాయితీగా మారింది. సంవత్సరం మొదటి రోజు దైవదర్శనం చేసుకుంటే సంవత్సరం అంతా శుభం జరుగుతుందని చాలామంది భావిస్తుంటారు. అందుకే ఆంగ్ల సంవత్సరాది మొదటి రోజు భగవంతుడిని దర్శించుకునేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. ఇందులో భాగంగా హైదరాబాదులో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బిర్లా మందిర్- హైదరాబాదు నడిబొడ్డున ఉన్న సైఫాబాద్ ప్రాంతంలో ఈ బిర్లా మందిర్ కొలువై ఉంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ప్రధాన దేవుడు నూతన సంవత్సరం మొదటి రోజు ఇక్కడ భగవంతుడిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు.

Vastu Tips: ఈ వస్తువులు పర్సులో పెట్టుకుంటే డబ్బుకు ఇబ్బంది ఉండదు ...

దిల్ సుఖ్ నగర్ సాయిబాబా గుడి

హైదరాబాదులోని దిల్సుఖ్నగర్ ప్రాంతంలో ఉన్న సాయిబాబా గుడి చాలా ఫేమస్ ఇక్కడ సాయిబాబా ను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి కూడా భక్తులు సాయిబాబాను దర్శించుకునేందుకు వస్తారు. అందుకే జనవరి ఒకటో తేదీన సాయిబాబాను దర్శించుకోవాలనుకునే వారికి ఇది ఒక చక్కటి ఆధ్యాత్మిక ప్రదేశంగా చెప్పవచ్చు.

 సికింద్రాబాద్ గణపతి ఆలయం

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న గణపతి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయం జనవరి ఒకటో తేదీన ఎవరైతే శ్రీ మహాగణపతి ఆశీర్వాదం కోసం కోరుకుంటున్నారు. అలాంటివారు గణపతి దేవాలయం సందర్శించవచ్చు.

 కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్

హైదరాబాదులోని కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ అత్యంత ప్రసిద్ధి చెందినది. జనవరి ఒకటో తేదీన హనుమాన్ భక్తులు ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం ద్వారా తమ కోరికను నెరవేర్చుకోవచ్చు.

 జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి

జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న పెద్దమ్మ గుడి అత్యంత శక్తివంతమైన ఆలయాల్లో ఒకటిగా పేరు సంపాదించుకుంది. నగరం నలుమూలల నుంచి ఇక్కడికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. జనవరి ఒకటో తేదీన కూడా ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని తమ కోరికలు నెరవేర్చమని కోరుకుంటారు.