Hyderabad, DEC 25: ఈ నెల 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) నేతృత్వంలో సీఎం రేవంత్‌తో సినీ ప్రముఖులు పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి బంజారాహిల్స్‌లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉదయం 10 గంటలకు జరగనుంది. టాలీవుడ్ నుంచి చిరంజీవి (Chiranjeevi), వెంకటేశ్, అల్లు అరవింద్‌తో (Allu Aravind) పాటు పలవురు నిర్మాతలు, దర్శకులు హాజరు కానున్నారు.
ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో సినీ పరిశ్రమ సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నారు.