సినిమా
SP Charan on SPB's Health: బాలుకి కరోనా నెగిటివ్ వార్త అబద్దం, నా తండ్రి ఇంకా లైప్ సపోర్ట్ మీదే ఉన్నారు, వీడియో విడుదల చేసిన ఎస్పీ చరణ్‌, తప్పుడు ప్రచారం చెయ్యొద్దని విజ్ఞప్తి
Hazarath Reddyప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా నెగిటివ్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి, అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balasubramanyam) కరోనా వైరస్‌ను జయించినట్లు వచ్చిన వార్తలను ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌ (SP Charan on SPB's health) ఖండించారు. ఎస్పీకి కరోనా నెగిటివ్‌ అంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని, కొందరు తన పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందన్నారు.
Sonu Sood: ఏడవకు చెల్లెలా..అన్నయ్య ఉన్నాడంటూ సోనూ ట్వీట్, వర్షాల కారణంగా ఇళ్లు, పుస్తకాలు కోల్పోయిన బాలికకు బాసటగా నిలిచిన సోనూ, వెంటనే స్పందించిన ఛత్తీస్‌గఢ్ సీఎం
Hazarath Reddyసోనూ ‘‘ కన్నీళ్లు తుడుచుకో చెల్లెలా. ఇళ్లు కొత్తదవుతుంది.. పుస్తకాలు కూడా కొత్తవవుతాయి’’ అని పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌ వీడియోపై స్పందించిన ముఖ్యమంత్రి భూపేశ్‌ భగెల్‌ (Chhattisgarh chief minister Bhupesh Baghel) సైతం బాలిక కుటుంబానికి సహాయం చేయవల్సిందిగా అధికారులను ఆదేశించారు.
Kamalakar Reddy Dies: తెలుగు సినీ నిర్మాత కమలాకర్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి, కరోనా సోకిన తండ్రిని ఆస్పత్రికి తీసుకెళుతుండగా విషాద ఘటన
Hazarath Reddyటాలీవుడ్‌ విషాదకర ఘటన చోటు చేసుకుంది. నిర్మాత, పంపిణీదారుడు గుండాల కమలాకర్‌రెడ్డి (48) (Telugu Distributor Kamlakar Reddy Dies) బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ప్రమాదంలో ఆయనతో పాటు ఆయన తండ్రి నందగోపాల్‌రెడ్డి (Kamlakar Reddy Father Nandagopal Reddy) సైతం అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, కమలాకర్‌రెడ్డి తండ్రి నందగోపాల్‌రెడ్డి (75) కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు.
Sushant Singh Rajput Death Case: సుషాంత్ సింఘ్ రాజ్‌పుట్ కేసు సీబీఐకి, కేసు విచారణకు సహకరించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం
Hazarath Reddyసుషాంత్ సింఘ్ రాజ్‌పుట్ కేసులు సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు (Sushant Singh Rajput Death Case) విచారణను సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. సేకరించిన దర్యాప్తు వివరాలను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులకు సుప్రీంకోర్టు సూచించింది. దీంతో పాటు సీబీఐ విచారణకు సహకరించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఈ మేరకు న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.
Plasma Donation Awareness: కరోనాపై భయం వద్దు, అందరూ ప్లాస్మా దానం చేయాలని కోరిన సీపీ సజ్జనార్, ప్లాస్మా దానంపై అవగాహన సదస్సులో పాల్గొన్న రాజమౌళి, కీరవాణి తదితరులు
Hazarath Reddyప్లాస్మా దానంపై సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో అవగాహన సదస్సు(Plasma Donation Awareness) జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి (Rajamouli, Keeravani), సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ( V. C. Sajjanar) తదితరులు పాల్గొన్నారు. ప‌్ర‌జ‌ల్లో ప్లాస్మాపై అనేక అపోహ‌లుండేవ‌ని, వీటిని పోగొట్టేందుకు అనేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించామ‌ని సైబ‌రాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. వీటికి చిరంజీవి, నాగార్జున, విజయ్ దేవరకొండ, రాజమౌళి, కీరవాణి సహకరించారని పేర్కొన్నారు.
Sushant Suicide Case Update: సుశాంత్ నా కొడుకు లాంటివాడు, అతని కుటుంబానికి న్యాయం జరగాలి, సుశాంత్ తండ్రి కేకే సింగ్‌ రెండో పెళ్లి వ్యాఖ్యలపై స్పందించిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్
Hazarath Reddyసుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌కు తండ్రితో సత్సంబంధాలు లేవని, తండ్రి రెండో వివాహం చేసుకోవడం పట్ల సుశాంత్‌ సంతోషంగా లేరని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut) చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి విదితమే. తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ స్పందించారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (Sushant Singh Rajput) తన కొడుకు లాంటివాడని, అతడి కుటుంబానికి న్యాయం జరగాలని పేర్కొన్నారు. అయితే ఈ వివాదంపై సుశాంత్‌ బంధువు, బీజేపీ ఎమ్మెల్యే అయిన నీరజ్‌ కుమార్‌ సంజయ్‌ రౌత్‌కు నోటీసులు పంపారు. కేకే సింగ్‌ రెండో పెళ్లి అవాస్తవమని, అనవసర వ్యాఖ్యలు చేసిన సంజయ్ రౌత్‌ 48 గంటల్లో బహిరంగంగా క్షమాపణలు చేప్పాలని లేకుంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.
Kathi Mahesh Arrested: కత్తి మహేష్‌కి 14 రోజుల రిమాండ్, శ్రీరాముడుపై అనుచిత పోస్టులు పెట్టినందుకు అరెస్ట్ చేసిన సైబైర్ క్రైమ్ పోలీసులు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హిందూ సంఘాలు
Hazarath Reddyటాలీవుడ్‌ వివాదాస్పద సినీ విశ్లేషకుడు‌ కత్తి మహేష్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ (Kathi Mahesh Arrested) చేశారు. సోషల్‌ మీడియాలో శ్రీరాముడిపై (Lord Sriram)అనుచిత వ్యాఖ్యలతో పోస్టు చేసినందుకుగాను ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వైద్యపరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి.. అనంతరం నాంపల్లి కోర్టులో (Nampally court) హాజరుపరిచారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఐపీఎస్‌ సెక్షన్‌ 153(ఎ) కమ్యూనల్‌ యాక్ట్‌ కింద సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.
Yuvraj on Sanjay Dutt Health: నీ బాధ నాకు తెలుసు దత్, క్యాన్సర్‌ మహమ్మారి నుంచి తొందరగా కోలుకోవాలి, ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నానంటూ యువరాజ్ సింగ్ ట్వీట్
Hazarath Reddy'సంజయ్‌ దత్‌.. నువ్వు ఒక ఫైటర్‌లా కనిపిస్తావు. నీ బాధ తెలుసుకున్నా.. ఆ నొప్పి ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను.. ఎందుకంటే నేను స్వయంగా అనుభవించాను. కానీ ఆ నొప్పిని భరించేందుకు నువ్వు మరింత ధృడంగా తయారవ్వాలి.. క్యాన్సర్‌ మహమ్మారి నుంచి తొందరగా కోలుకోవాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అంటూ ట్వీట్‌ చేశాడు.
Web Series on Vikas Dubey: వికాస్ దూబేపై వెబ్ సిరీస్‌, పొలిటికల్ థ్రిల్లర్ పాయింట్‌ను చూపిస్తానంటున్న దర్శకుడు హన్సల్ మెహతా, ప్రాజెక్ట్ కోసం హక్కులను కొనుగోలు చేసిన శైలేష్ కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్
Hazarath Reddyగత నెలలో ఉత్తర ప్రదేశ్ పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే జీవితం ఆధారంగా వెబ్ సిరీస్‌ను (Web Series on Vikas Dubey) నిర్మించి, దర్శకత్వం వహించడానికి చిత్రనిర్మాత హన్సల్ మెహతా (Filmmaker Hansal Mehta) సిద్ధమయ్యారు. కాన్పూర్‌లోని చౌబేపూర్ ప్రాంతంలోని బిక్రూ గ్రామంలో దుబేను (Vikas Dubey) అరెస్టు చేయడానికి వెళ్లిన సమయంలో పోలీసులపై దూబే గ్యాంగ్ విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో డిఎస్‌పి దేవేంద్ర మిశ్రాతో (DSP Devendra Mishra) సహా ఎనిమిది మంది పోలీసులు మరణించారు.
Sushant Death Probe: బాలీవుడ్ నటుడు సుశాంత్ కేసులో సీబీఐ దూకుడు, రంగంలోకి దిగుతూనే నటి రియా చక్రవర్తి సహా ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు
Team Latestlyతీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరియు అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఛాపర్ స్కాంలపై దర్యాప్తు చేసిన స్పెషల్ ఎలీట్ టీం, ఇప్పుడు సుశాంత్ కేసును టేకప్ చేసినట్లు సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి....
SP Balu COVID-19 Positive: ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్, మీ అందరి అశీస్సులతో త్వరలోనే కోలుకుంటానంటూ వీడియో విడుదల చేసిన లెజెండ్ సింగర్
Hazarath Reddyదేశంలో మహమ్మారి కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు వైరస్‌ (Coronavirus) సోకగా, తాజాగా గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్‌గా (SP Balasubrahmanyam Tests Positive for Coronavirus) నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వీడియో ద్వారా వెల్లడించారు.
Director Teja Tests Corona Positive: దర్శకుడు తేజకి కరోనా పాజిటివ్, అందరూ ఇంట్లో ఉండి కరోనా తెచ్చుకుంటే నేను షూటింగ్‌కు వెళ్లి కరోనా తెచ్చుకున్నా అంటూ వీడియో
Hazarath Reddyఇటీవల దర్మక ధీరుడు రాజమౌళి కుటుంబానికి కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రముఖ డైరెక్టర్‌ తేజకు కరోనా పాజిటివ్‌గా (Director Teja Test Corona Positive) నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్‌ మీడియాలో (Social Media) వెల్లడించారు. ఇటీవల ఓ వెబ్ సిరీస్ షూటింగ్‌లో తేజ పాల్గొన్నారు. అనంతరం షూటింగ్‌ సభ్యుల్లో ఒకరికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా కరోనా నిర్దారణ పరీక్షలు (Coronavirus tests) నిర్వహించుకోగా తేజకు పాజిటివ్‌గా తేలింది.
Singh Rajput Death Case: సుశాంత్ కేసుకు రాజకీయ రంగు, బీహార్ రాష్ట్ర పోలీసు అధికారి వినయ్ తివారీని క్వారంటైన్‌కి తరలించిన ముంబై పోలీసులు, ఖండించిన సీఎం నితీష్ కుమార్
Hazarath Reddyబాలీవుడ్‌ యంగ్‌హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య (Singh Rajput Death Case) ఉదంతం రాజకీయ ప్రకంపనలకు దారితీస్తోంది. ఈ కేసు విషయంపై మహారాష్ట్ర, బిహార్‌ ప్రభుత్వాల (Maharashtra vs Bihar Govt) మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు దర్యాప్తు కోసం పాట్నా నుంచి ముంబై వెళ్లిన తమ రాష్ట్ర పోలీసు అధికారి వినయ్ తివారీని అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బలవంతంగా క్వారంటైన్ కి తరలించడాన్ని బీహార్ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ ఖండించారు.
Anil Murali Passes Away at 56: నటుడు అనిల్‌ ముర‌ళి కన్నుమూత, కాలేయ సంబంధ వ్యాధితో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన మళయాళ హీరో, సంతాపం తెలిపిన మాలీవుడ్ ఇండస్ట్రీ
Hazarath Reddyమ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విషాద సంఘ‌ట‌న చోటుచేసుకుంది. న‌టుడు అనిల్‌ ముర‌ళి(56) (Anil Murali Passes Away at 56) క‌న్నుమూశారు. అనారోగ్య కార‌ణంతో కొచ్చిలో నేడు ఆయ‌న తుదిశ్వాస విడిచారు. కాలేయ సంబంధ వ్యాధితో బాధ‌ప‌డుతున్నఅనిల్ ముర‌ళి కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో మ‌ర‌ణించారు. అనిల్ మురళి మరణం మలయాళ పరిశ్రమకు తీర‌ని లోట‌ని న‌టులు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), తోవినో థామస్ వంటి వారు సోషల్ మీడియా వేదిక‌గా త‌మ సంతాపాన్ని ప్ర‌క‌టించారు. అనిల్ ముర‌ళికి భార్య సుమ‌, పిల్ల‌లు ఆదిత్యా, అరుంధ‌తి ఉన్నారు.
S. S. Rajamouli COVID-19 Positive: ఎస్. ఎస్. రాజమౌళికి కరోనా పాజిటివ్, కుటుంబ సభ్యులంతా క్వారంటైన్‌లోకి, కోలుకోగానే ప్లాస్మా దానం చేస్తామని తెలిపిన దర్శక ధీరుడు
Hazarath Reddyదర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళికి కరోనా పాజిటివ్‌గా (SS Rajamouli COVID-19 Positive) నిర్దారణ అయింది. ఈ విషయాన్ని జక్కన్న (SS Rajamouli) స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు కూడా (Coronavirus) కరోనా సోకిందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవని.. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నమని తెలిపారు.
Justice for Sushant: నిజాలు బయటకు రావాల్సిందే, సుశాంత్ ఆత్మహత్య కేసులో న్యాయం చేయాలని సోద‌రి శ్వేతా కీర్తిసింగ్ డిమాండ్, సుశాంత్‌ మృతిపై పోలీసులను ఆశ్రయించిన తండ్రి కెకె సింగ్
Hazarath Reddyబాలీవుడ్‌ యువనటుడు సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో రోజు రోజుకు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుశాంత్‌ మృతిపై ఆయన తండ్రి కేకే సింగ్‌ (KK Singh) పోలీసులను ఆశ్రయించిన సంగతి విదితమే.. ఇప్పుడు తాజాగా సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య‌కు సంబంధించిన కేసులో న్యాయం చేయాల‌ని కోరుతూ సుశాంత్ సోద‌రి శ్వేతా కీర్తిసింగ్ (Sushant Singh Rajput's sister Shweta Kirti Singh) డిమాండ్ చేశారు.
Poonam Pandey Engagement: పూనం పాండే పెళ్లికి రెడీ అయింది, బాలీవుడ్ దర్శకుడు సామ్‌ బాంబెతో హాట్ బ్యూటీ నిశ్చితార్థం, వివాహ తేదీపై ఇంకా క్లారిటీ ఇవ్వని ముద్దుగుమ్మ
Hazarath Reddyఫిలీం ఇండస్ట్రీలో ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. నిన్ననే టాలీవుడ్ హీరో నితిన్ వివాహం జరగ్గా.. ఇప్పుడు బాలీవుడ్ కు చెందిన హాట్ బ్యూటీ పూనమ్ పాండే (Poonam Pandey) వివాహానికి రెడీ అవుతున్నది. ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్‌ బాలీవుడ్ దర్శకుడు సామ్‌ బాంబెతో పూనమ్‌ నిశ్చితార్థం (Poonam Pandey - Sam Bombay engaged) జరిగింది. ఈ విషయాన్ని సామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. వారిద్దరు రింగ్‌లు మార్చుకున్న ఫొటోను సామ్‌ షేర్‌ చేశారు. ‘చివరకు మేము.. పూర్తి చేసాం’ అని పేర్కొన్నారు. దీనిపై కామెంట్‌ చేసిన పూనమ్‌.. బెస్ట్‌ ఫీలింగ్‌ అని అన్నారు.
Sonu Sood ‘New Mission’: సోనూ సూద్ కొత్త మిషన్, జార్జియాలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను ఇండియాకు తీసుకువచ్చే ప్రయత్నాలు, ట్విట్టర్ ద్వారా తెలిపిన సోనూ సూద్
Hazarath Reddyకరోనావైరస్ లాక్డౌన్ మధ్య భారతీయులలో వేలాది మంది వలస కార్మికులు (Migrants) తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి నటుడు సోను సూద్ (Actor Sonu Sood) చేసిన సహాయం ఎవరూ మరచిపోరు. సోషల్ మీడియాలో (Social Media) ఇప్పుడు ఆయన హీరో అయ్యారు. తాజాగా ఏపీలో ఓ రైతు కష్టాన్ని చూసి చలించి ఆయన ఇంటికి నేరుగా ట్రాక్టర్ పంపిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతి ఒక్కరూ సోనూ సూద్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
Varma vs Pawan Kalyan Fans: పవర్ స్టార్ వర్సెస్ పరాన్న జీవి, ట్విట్టర్ వేదికగా ముదిరిన యుద్ధం, వర్మను కుక్కతో పోల్చిన హీరో నిఖిల్, ఆ నిఖిల్..కిఖిల్ ఎవడో తెలియదంటూ వర్మ రివర్స్ కౌంటర్
Hazarath Reddyదర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తాజాగా ‘పవర్‌ స్టార్‌’ అనే సినిమా చేయబోతున్నట్లు ట్వీటర్‌ వేదికగా ప్రకటించి సంచలనం రేపిన సంగతి విదితమే. అయితే ఆ ప్రకటన వచ్చినప్పటి నుంచి ట్విట్టర్ వేదికగా వర్మ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ (Varma vs Pawan Kalyan Fans) అన్నట్లుగా వార్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ (Pawan Kalyan Fans) వర్మపై విరుచుకుపడుతుండగా వర్మ ఫ్యాన్స్ (Varma Fans) గబ్బర్ సింగ్ అభిమానుల మీద విరుచుకుపడుతున్నారు.
Nithiin-Shalini Wedding: పెళ్లికి రావాలని తెలంగాణ సీఎంని ఆహ్వానించిన యంగ్ హీరో నితిన్, ఈ నెల 26న హైదరాబాద్‌లో షాలినితో నితిన్ వివాహం, కొద్ది మందికి మాత్రమే ఆహ్వానం
Hazarath Reddyత్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ యంగ్ ‌హీరో నితిన్‌ తన వివాహ వేడుకకు (Nithiin Wedding) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం (Nithiin Invites Telangana CM K Chandrashekar Rao) పలికారు. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌కు స్వయంగా శుభలేఖను అందజేసి వివాహానికి హాజరై ఆశీర్వదించాలని నితిన్‌ కోరారు. నితిన్‌తోపాటు ఆయన తండ్రి సుధాకర్‌రెడ్డి కూడా సీఎం కేసీఆర్‌ను కలిశారు.