తాజా వార్తలు

Telangana: వీడియో ఇదిగో, పెళ్లిలో మటన్ కోసం తలలు పగలగొట్టుకున్నారు, పెళ్లికొడుకు తరపు వారికి మటన్ తక్కువ వేశారని కర్రలు, రాళ్లతో దాడి

Hazarath Reddy

నిజామాబాద్ జిల్లా నవీపేట్లో జరిగిన ఓ వివాహ వేడుకలో పెళ్లికొడుకు తరపు వారికి మటన్ తక్కువ వేశారని కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. దీంతో ఫంక్షన్ హాల్ రణరంగాన్ని తలపించింది. రాళ్లతో, కర్రలతో దాడి చేసుకోవడంతో చాలామందికి తలలు పగిలి గాయాలయ్యాయి. ఈ ఘటనలో పలువురు గాయపడగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

CM Revanth Reddy On Hydra: హైడ్రా పేరుతో బెదిరింపులు, సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్, హైడ్రా పేరుతో అవినీతి చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరిక

Arun Charagonda

హైదరాబాద్ లో హైడ్రా పేరు చెప్పి భయపెట్టి,బెదిరించి అవినీతికి పాల్పడితే సహించేది లేదని తేల్చిచెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. కొందరు కిందిస్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై స్పందించారు రేవంత్.

Andhra Pradesh Politics: వైసీపీకి, రాజ్యసభ పదవులకు రాజీనామా చేసిన మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు, టీడీపీలో చేరునున్న మోపిదేవి

Hazarath Reddy

రాజ్యసభ పదవికి, వైసీపీకి మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావులు రాజీనామా చేశారు. పార్లమెంట్‌లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు రాజీనామా పత్రాలను ఇరువురూ అందజేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా పత్రాలను అందజేశారు. అనంతరం వైసీపీకి సైతం రాజీనామా చేశారు.

Gautam Adani Richest Indian: హిండెన్ బర్గ్ వివాదం వెంటాడినా తగ్గేదేలే, దేశంలోనే అత్యంత ధ‌న‌వంతుడిగా అవతరించిన గౌతమ్ అదానీ, రెండో స్థానానికి పడిపోయిన ముకేష్ అంబానీ,

Hazarath Reddy

బిలియనీర్ గౌతమ్ అదానీ దేశంలోనే అత్యంత ధ‌న‌వంతుడిగా అవ‌త‌రించారు. హిండెన్ బర్గ్ రిపోర్ట్ వివాదం వెంటాడినా తగ్గేదేలే అని నిరూపించారు అదానీ. తాజాగా వెలువ‌డిన‌ 2024 హురున్ ఇండియా ధ‌న‌వంతుల జాబితాలో రూ. 11.6 లక్షల కోట్ల సంపదతో ముఖేశ్ అంబానీని వెన‌క్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచారు

Advertisement

SC On Note For Vote Case: ఓటుకు నోటు కేసు..బీఆర్ఎస్ మాజీ మంత్రికి షాక్, కేసును భోపాల్‌కు బదిలీ చేయాలన్న జగదీశ్ రెడ్డి పిటిషన్‌ను తోసిపుచ్చిన ధర్మాసనం, అలా చేస్తే న్యాయవ్యవస్థపై నమ్మకం లేనట్లేనని వ్యాఖ్య

Arun Charagonda

ఢిల్లీ ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణను తెలంగాణ నుంచి భోపాల్‌కు బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి వేసిన పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవై ధర్మాసనం తోసిపుచ్చింది. కేవలం అపోహలతో విచారణను బదిలీ చేస్తే న్యాయవ్యవస్థపై నమ్మకం లేదట్లే అవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేగాదు ఈ కేసులో విచారణకు ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ను నియమిస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.

Hyderabad Horror: ప్రియురాలిపై కత్తితో దాడి చేసిన ప్రియుడు ,ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి, గచ్చిబౌలి పీఎస్ పరిధిలో ఘటన, మృతురాలు బ్యూటిషిన్‌గా గుర్తింపు

Arun Charagonda

హైదరాబాద్ గచ్చిబౌలిలో అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు ప్రియుడు. రక్తపు మడుగులో ఉన్న యువతిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలు హెయిర్ సెలూన్ లో బ్యూటిషన్ గా పనిచేస్తునట్లు గుర్తించారు పోలీసులు.

Nagarjuna Sagar Project Gates Open: శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు పోటెత్తిన వరద, సాగర్ 26 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల...వీడియో

Arun Charagonda

శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తింది. దీంతో సాగర్ 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో: 257634 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో: 257634 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం : 590 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు

Mopidevi Venkataramana Vs Ambati Rambabu: టీడీపీలోకి మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు..పార్టీ మారినోళ్ళు పరువు పొగొట్టుకున్నారంటూ అంబటి రాంబాబు ఫైర్

Arun Charagonda

ఏపీలో వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి రాజీనామా చేయగా తాజాగా ఇద్దరు ఎంపీలు సైతం రిజైన్ చేశారు. ఇప్పటికే వైసీపీ రాజీనామా చేసిన రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు ఇవాళ రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి తమ ఎంపీ పదవులకు రాజీనామా సమర్పించనున్నారు.

Advertisement

Andhra Pradesh: నెల్లూరులో ఆర్టీసీ బస్సు బోళ్తా, 5గురికి తీవ్ర గాయాలు, ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణీకులు

Arun Charagonda

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం మోమిడి సమీపంలో ఆర్టీసీ బస్సు బోళ్తా పడింది. నెల్లూరు నుంచి ముత్తుకూరు మీదుగా కోటకు వెళుతుండగా మోమిడి వద్ద అదుపు తప్పి బస్సుకు ప్రమాదం జరుగగా ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Passport Seva Portal To Shut Down: దేశవ్యాప్తంగా పాస్ పోర్ట్ సేవలు బంద్, 3 రోజుల పాటు పాస్‌పోర్టు సర్వీసులు పనిచేయవు

Arun Charagonda

దేశవ్యాప్తంగా 3 రోజులపాటు పాస్ పోర్టు సేవలు బంద్ కానున్నాయి. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి సెప్టెంబర్ 2 ఉదయం 6 గంటల వరకు పాస్ పోర్ట్ సర్వీసులు పనిచేయవని పాస్ పోర్ట్ సేవా సమితి తెలిపింది. సాఫ్ట్ వేర్ మెయింటెనెన్స్ కోసం తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Hero Ajith Kumar: 234 కిమీల వేగంతో కారును నడిపిన హీరో అజిత్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Arun Charagonda

234kms వేగంతో కారును నడిపారు హీరో అజిత్ కుమార్. తన ఆడి కారులో 234 కిమీల వేగంతో అజిత్ దూసుకెళ్లగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అజిత్‌కు బైక్, కార్ రేసింగ్ పై చిన్నప్పటి నుండి మక్కువ ఉన్న సంగతి తెలిసిందే.

MLC Kavitha First Tweet: జైలు నుండి బయటకు వచ్చిన 5 నెలల తర్వాత ఎమ్మెల్సీ కవిత ఫస్ట్ ట్వీట్, సత్యమేవ జయతే అంటే కేటీఆర్‌తో ఉన్న ఫోటో షేర్ చేసిన కవిత

Arun Charagonda

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 165 రోజుల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకోగా సుదీర్ఘ విరామం తర్వాత ఎక్స్‌ వేదికగా తొలి ట్వీట్‌ చేశారు. సత్యమేవ జయతే అంటూ భర్త అనిల్, సోదరుడు కేటీఆర్‌తో ఉన్న ఫోటోను షేర్ చేశారు

Advertisement

Andhra Pradesh: ఇలా జైలు నుండి వచ్చాడు..అలా కిడ్నాప్ చేసేశారు, రాజమండ్రి సెంట్రల్ జైలులో కిడ్నాప్ కలకలం, ఆర్ధిక లావాదేవీలే కారణమని పోలీసుల అనుమానం

Arun Charagonda

బెయిల్ పై విడుదలైన ఒరిస్సాకు చెందిన వ్యక్తిని కిడ్నాప్ చేశారు దుండగులు. రాజమండ్రి సెంట్రల్ జైలు పరిధిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఒరిస్సా వ్యాపరి సంజయ్‌ను కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

KTR America Tour: అమెరికాకు కేటీఆర్, వ్యక్తిగత పర్యటన అని ట్విట్టర్ ద్వారా వెల్లడి, అమెరికా నుండి రష్యాకు వెళ్లనున్న కేటీఆర్

Arun Charagonda

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ రావడంతో హైదరాబాద్‌కు చేరుకున్నారు ఎమ్మెల్సీ కవిత. ఇక తన సోదరికి బెయిల్ నేపథ్యంలో అన్ని పనులను దగ్గరుండి చూసుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మార్చి 15న రాత్రి 7: 15కి ఇంటి నుంచి డిల్లీకి వెళ్లిన కవిత...ఆ తర్వాత 165 రోజులకు బుధవారం రాత్రి 7: 15కి తన నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవితకు మంగళహారతి ఇచ్చి ఇంట్లోకి స్వాగతం పలికారు కుటుంబ సభ్యులు. అనంతరం కేటీఆర్‌కి రాఖి కట్టారు కవిత.

AP Student Died in USA: అమెరికాలో తెలుగు విద్యార్ధి మృతి, స్నేహితుల‌తో క‌లిసి సెల్ఫీ తీసుకుంటూ స‌ర‌స్సులో ప‌డిపోయిన యువ‌కుడు

VNS

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన పి.రూపక్‌రెడ్డి(26) (Rupa reddy) అమెరికాలోని జార్జ్‌ సరస్సులో మునిగి మృతిచెందాడు. అతని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. పి.కవిరాజ్‌రెడ్డి, ధనవతి దంపతుల కుమారుడు పి.రూపక్‌రెడ్డి పది నెలల క్రితం ఎంఎస్‌ చేసేందుకు అమెరికా (Telugu Student de in USA) వెళ్లాడు. అక్కడి హరీష్‌బర్గ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో చేరాడు.

CM Revanth Reddy Reviews South RRR: అటవీ ప్రాంతాల్లో నైట్ సఫారీ,రీజనల్ రింగ్‌ రోడ్డుపై సీఎం రేవంత్ రివ్యూ, భూ సమీకరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు

Arun Charagonda

సౌత్ రీజనల్ రింగ్ రోడ్డుపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. సాధ్య‌మైనంత ఎక్కువ ప‌రిహారం ఇవ్వ‌డంతో పాటు ప్ర‌భుత్వ ప‌రంగా అద‌నంగా ఏవిధ‌మైన స‌హాయం చేయ‌గ‌ల‌మో ఆలోచించి రాష్ట్రానికి ప్ర‌యోజ‌నం క‌లిగించేలా అలైన్‌మెంట్ ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని త‌న నివాసంలో ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగం, రేడియ‌ల్ రోడ్ల నిర్మాణం, డ్రైపోర్ట్‌ను సీ పోర్ట్‌కు అనుసంధానించే గ్రీన్ ఫీల్డ్ ర‌హ‌దారిపై సమీక్ష నిర్వహించారు సీఎం.

Advertisement

Hyderabad:పెళ్లికి ఒప్పుకోలేద‌ని ఇంటికి వెళ్లి మ‌రీ యువ‌తి పీక కోసిన ఉన్మాది, ఆపై క‌రెంట్ స్తంభం ఎక్కి వైర్లు ప‌ట్టుకొని ఆత్మ‌హ‌త్యాయ‌త్నం, యువ‌తి మృతి

VNS

హైదరాబాద్‌ (Hyderabad) గచ్చిబౌలిలో ప్రేమోన్మాది వీరంగం సృష్టించాడు. పెళ్లికి నిరాకరించిందని యువతిని దారుణంగా హత్యచేశాడు. అడ్డుకోబోయిన ముగ్గురు యువతులను గాయపరిచాడు. అనంతరం అతడూ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు.

Big Shock to YSRCP: వైఎస్సార్సీపీకి బిగ్ షాక్, రాజీనామాకు సిద్ధ‌మైన ఇద్ద‌రు రాజ్య‌స‌భ స‌భ్యులు, మ‌రికొంద‌రు కూడా అదే బాట‌లో ఉన్న‌ట్లు జోరుగా ప్ర‌చారం

VNS

ఏపీలో వైసీపీకి (YCP) వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పార్టీ నేతలు తమదారితాము చూసుకుంటున్నారు. తాజాగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ (Mopidevi Venkata Ramana), బీద మస్తాన్‌రావు (Beeda Masthan Rao) తమ పదవులకు రాజీనామా చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్కర్‌ వారికి అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు.

UP Digital Media Policy: ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోస్టు పెడితే జీవిత‌ఖైదు, అనుకూలంగా ప్ర‌చారం చేస్తే రూ. 8 లక్ష‌లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్స‌ర్ల‌కు బంపర్ ఆఫ‌ర్

VNS

సోషల్‌ మీడియాలో దేశ వ్యతిరేక పోస్టులు పెట్టేవారికి మూడేళ్ల నుంచి జీవితఖైదు (Life Sentence) వరకు శిక్ష విధించేలా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త డిజిటల్‌ మీడియా పాలసీని (UP Digital Media Policy) రూపొందించింది. అభ్యంతరకర, అసభ్య పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొంది. ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించే వారికి నెలవారీ భారీ నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది.

HYDRA Notices: సీఎం రేవంత్ రెడ్డికి హైడ్రా షాక్, ఏకంగా ఆయ‌న సోదరుడికే నోటీసులు, దుర్గం చెరువు కాల‌నీలో నోటీసులు అందుకున్న‌వారిలో ప‌లువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు

VNS

హైడ్రా (Hydra)దూకుడు కొన‌సాగుతోంది. చెరువులు, కుంట‌ల‌ను ఆక్ర‌మించి కట్టుకున్న నిర్మాణాల‌పై కొర‌డా ఝ‌లిపిస్తోంది. ఎవర్నీ వ‌ద‌ల‌కుండా నోటీసులు ఇస్తున్నారు హైడ్రా అధికారులు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి (M Revanth Reddy) సోద‌రుడు ఉంటున్న ఇంటికి కూడా నోటీసులు అంటించారు.

Advertisement
Advertisement