India

Telangana: వీడియో ఇదిగో, రెండు కరెంట్ స్థంభాల మధ్యలో ఇరుక్కుపోయిన ఆటో, భయంతో కేకలు పెట్టిన విద్యార్థులు

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బై పాస్ రోడ్డు లో స్కూల్ నుండి విద్యార్దులను ఇంటికి తీసుకెతున్న ఆటో బ్రేకులు ఫెయిల్ అయ్యి రోడ్డు కిందకు వెళ్లి రెండు స్తంభాల మధ్య ఇరుక్కుపోయింది.

Sex Journey: శృంగారం కోసం 3 మహా సముద్రాల మీదుగా 13 వేల కిలోమీటర్లు ప్రయాణించిన మగ హంప్‌బ్యాక్ వేల్, అయితే స్టోరీ చదవాల్సిందే..

Hazarath Reddy

మగ హంప్‌బ్యాక్ వేల్ సెక్స్ కోసం 3 మహాసముద్రాల మీదుగా 13,000 కి.మీ ప్రయాణించి, కొత్త దూరాన్ని సెట్ చేస్తుందంటే నమ్మగలరా...తాజాగా అధ్యయనాలు ఇవి నిజమేనని చెబుతున్నాయి.

Jagan Slams Chandrababu Govt: బియ్యం ఎగుమతిలో ఏపీ దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉంది, మరి ఎవరి మీద దుష్ప్రచారం చేస్తారు, ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించిన వైఎస్ జగన్

Hazarath Reddy

కాకినాడ పోర్ట్ నుంచి రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరుగుతోందని, దీనికి మూలాలు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే మొదలయ్యాయని కూటమి నేతలు ఆరోపణలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ స్పందించారు. రేషన్‌ బియ్యంపై వారి కథనాలు, మాటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు

Andhra Pradesh: వీడియో ఇదిగో, విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు, అలజడిగా మారిన సముద్రం, అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండగా మారే అవకాశం

Hazarath Reddy

విశాఖ ఆర్కే బీచ్ వద్ద అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.తాజాగా బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో వాయుగుండగా మారే అవకాశం ఉంది. తమిళనాడు శ్రీలంక తీరాల వైపు పయనించే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

Akhanda 2 Release Date: ఈ నేల అసురుడిది కాదురా.. ఈశ్వరుడిది, గూస్ బంప్స్ తెప్పిస్తున్న బాలయ్య అఖండ 2 ప్రోమో, వచ్చే ఏడాది సెప్టెంబర్ 25న సినిమా విడుదల

Hazarath Reddy

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం అఖండ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి విదితమే. ఈ మూవీకి సీక్వెల్‌గా అఖండ-2 తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఆ మూవీకి సంబంధించి విడుదల తేదీని ప్రకటించారు.

Murudeshwar Beach: వీడియో ఇదిగో, మురుడేశ్వర్ బీచ్ వద్ద ఏడుగురు విద్యార్థులు గల్లంతు, ఇప్పటివరకు రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

Hazarath Reddy

మంగళవారం సాయంత్రం, డిసెంబర్ 10, ఉత్తర కన్నడ జిల్లాలోని మురుడేశ్వర్ బీచ్ వద్ద ఏడుగురు విద్యార్థుల బృందం గల్లంతయ్యారు. సముద్రాన్ని ఆస్వాదిస్తున్న సమయంలో బలమైన ప్రవాహాలకు ఈ విద్యార్థులు గల్లంతయ్యారు. ముగ్గురు బాలికలు అదృష్టవశాత్తూ రక్షించబడ్డారు, అయితే ఇప్పటివరకు నీటి నుండి రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు

Manchu Manoj: రాచకొండ సీపీకి మంచు మనోజ్ రూ.లక్ష బాండ్, ఎలాంటి గొడవలకు దిగగని బాండ్ సమర్పించిన మనోజ్

Arun Charagonda

రాచకొండ సీపీకి రూ.లక్ష బాండ్ సమర్పించారు మంచు మనోజ్‌. తాను ఎలాంటి గొడవలకు దిగనని శాంతి భద్రతలకు విఘాతం కలిగించనని సీపీకి బాండ్‌ సమర్పించారు. తన తల్లి ఆసుపత్రిలో లేకున్నా ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారరని మండిపడ్డారు. కూర్చుని మాట్లాడుకోవడానికి తాను సిద్దంగా ఉన్నట్లు వెల్లడించారు.

Hyderabad: వీడియో ఇదిగో, అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థిని క్లాస్ నుండి బహిష్కరించిన యాజమాన్యం, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్

Hazarath Reddy

హైదరాబాద్ లో ఓ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. కొంపెల్లిలోని ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్‌లో అయ్యప్ప మాల వేసుకున్నాడని ఓ విద్యార్థిని క్లాస్ రూమ్‌కి అనుమతించకుండా ఇంటికి పంపింది స్కూల్ యాజమాన్యం. అ ఘటనపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. స్కూలు యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

Advertisement

Sudden Death in Tamil Nadu: వీడియో ఇదిగో, తరగతి గదిలోనే గుండెపోటుతో కుప్పకూలిన బాలిక, ఆస్పత్రికి తరలించే లోపే తిరిగిరాని లోకాలకు..

Hazarath Reddy

ఒక విషాద సంఘటనలో, డిసెంబర్ 10, మంగళవారం, 9వ తరగతి విద్యార్థిని తరగతి సమయంలో కుప్పకూలి పడిపోయింది. ఆ తర్వాత తమిళనాడులోని రాణిపేటలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. మరణించిన విద్యార్థిని అద్వితగా గుర్తించబడింది

Health Tips: ప్రతిరోజు ఒక కప్పు కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా..

sajaya

మన రోజువారి జీవితంలో ఉదయం లేవగానే వేడివేడి కాఫీతో మన రోజును ప్రారంభిస్తాము. ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల మనకు రోజంతా రిఫ్రెష్ గా ఉంటుంది. అంతేకాకుండా ప్రతిరోజు కాఫీ తాగడం వల్ల మనకు అనేక లాభాలు కూడా ఉన్నాయి.

Health Tips: నానబెట్టిన మెంతి గింజల నీరు త్రాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..

sajaya

మెంతుల్లో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు ,ఫ్యాట్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే మెంతి గింజలను నానబెట్టిన తర్వాత ఆ నీరు తీసుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్న అన్ని అవయవాల పనితీరు మెరుగుపడుతుంది.

Astrology: గురు గ్రహం అనుగ్రహం వల్ల కొత్త సంవత్సరంలో ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

గురు విజ్ఞానం, తెలివితేటలు, మతం, ఆధ్యాత్మికత, న్యాయం, నైతికత, సంపద, బంగారం, శ్రేయస్సు, వివాహం, పిల్లలు మొదలైన వాటిని పాలించే ,నియంత్రించే గ్రహం.

Advertisement

BRS Vinod Kumar: కమీషన్లు అన్నం పెట్టవు..వేల టీఎంసీల నీళ్లు వెళ్లినా మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏం కాలేదు..సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఫైర్

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన వినోద్ కుమార్.. ఎస్సారెస్పీ ఫేస్ 1, ఫేస్ 2కు నీళ్లు ఇవ్వలేము యాసంగి పంట తక్కువ వేసుకోవాలని అధికారులు చెప్తున్నారు అన్నారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం...రైతులకు యాసంగి పంట ముఖ్యమైందన్నారు.

Gas Cylinder Explosion: వీడియో ఇదిగో, గ్యాస్ సిలిండర్ పేలి ఆరుగురికి తీవ్ర గాయాలు, భారీగా ఆస్తి నష్టం

Hazarath Reddy

గ్యాస్ సిలిండర్ పేలి ఆరుగురికి తీవ్ర గాయాలు అయిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం దోస పహాడ్ గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి గుడిసెలు దగ్దం అయ్యాయి. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

Astrology: పొరపాటున కూడా ఇంట్లో ఈ ప్రదేశాలలో డబ్బు ఉంచవద్దు.

sajaya

మీరు మీ ఇంట్లో డబ్బు ఉంచే స్థలం మీ ఆర్థిక పరిస్థితిని కూడా ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా. ఇంట్లో కొన్ని ప్రదేశాలలో డబ్బు ఉంచడం వల్ల సానుకూల శక్తి ప్రవాహానికి అడ్డుకట్ట పడుతుందని ,పేదరికం, అప్పులు ,అదనపు ఖర్చులు వంటి సమస్యలకు దారితీస్తుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది.

Rajendra Prasad: బన్నీ నా కొడుకు లాంటి వాడు, వివాదాస్పద వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్, అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేయలేదని స్పష్టం

Hazarath Reddy

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ ఈ మధ్య ఓ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి విదితమే. ఈ వివాదం ముద‌ర‌డంతో తాజాగా రాజేంద్ర ప్ర‌సాద్‌ క్లారిటీ ఇచ్చారు. తాను అల్లు అర్జున్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.

Advertisement

Astrology: డిసెంబర్ 27న శనిగ్రహం భాద్రపద నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

2025 కొత్త సంవత్సరానికి ముందు, తీర్పు ,ఫలితాలను ఇచ్చే శని తన రాశిని మార్చబోతున్నాడు. ఆకాశంలోని 27 రాశులలో శని 25వ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.

Astrology: డిసెంబర్ 15 ఆదివారం సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిషశాస్త్రం ప్రకారం, సూర్యుడు గ్రహాలకు రాజు సూర్యుడు, గౌరవం, ఆత్మ, ఉన్నత స్థానం , నాయకత్వ సామర్థ్యానికి బాధ్యత వహించే గ్రహం, కొన్ని రాశిచక్ర గుర్తులకు ఫలవంతమైనది.

Weather Forecast: ఏపీలో అయిదు జిల్లాలకు ఎల్లో అలర్ట్, ఆగ్నేయ బంగాళాఖాతంలో మరింతగా బలపడనున్న అల్పపీడనం

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు తమిళనాడు - శ్రీలంక తీరాలకు చేరుకునే అవకాశం ఉందని భాతర వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ అల్పపీడనం దక్షిణ కోస్తా, రాయలసీమపై నేటి నుంచి రెండు రోజుల పాటు ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది .

Telangana: సారంగపూర్ కేజీబీవీ స్కూల్‌లో విద్యార్థులకు అస్వస్థత, ఆరుగురిని ఆస్పత్రికి తరలింపు...పరిస్థితి నిలకడగా ఉందన్న డాక్టర్లు

Arun Charagonda

జగిత్యాల జిల్లా సారంగపూర్ KGBV పాఠశాలలో అస్వస్థత కు గురయ్యారు విద్యార్థులు. ఆరుగురు విద్యార్థులకు అస్వస్థతకు గురికాగా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర చలితో కాళ్లు చేతులు తిమ్మిర్లు వచ్చాయని తెలియగా ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు వైద్యులు.

Advertisement
Advertisement