ప్రేమకు త్యాగానికి ప్రతీక అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించిన శుభ తరుణమే క్రిస్మస్ పండగ. ఈ పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులంతా ప్రత్యేక ప్రార్థనలు జరిపి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఒక్కో దేశంలో ఒక్కోరకంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటారు. అయితే ఈ పర్వదినం రోజున ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తోంది. అయితే అది గ్రీటింగ్స్ రూపంలోనూ ఇతర బహుమతులు ఇచ్చుకోవడం ద్వారా గాని మీరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. క్రిస్మస్ సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని గ్రీటింగ్స్ వాడుకోవడం ద్వారా మీరు వారికి శుభాకాంక్షలు.
ఏసు బోధనలు ఆచరణీయమైనవని ప్రేమ, ఆదర్శాలు ఎంతో ఉన్నతమైనవని క్రీస్తు బోధనలు ప్రతి మనిషిని సన్మార్గంలో నడిపిస్తాయి ప్రజలు అందరూ సుఖసంతోషాలతో క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకుందాం
దీనులకు, ఆపన్నులకు మానవత్వపు స్పర్శను అందించిన ప్రేమమయుడు క్రీస్తు. ప్రపంచానికి శాంతి, సహజీవన మాధుర్యాలను అందించేందుకు తన రక్తం చిందించిన ఏసు చరిత్ర పవిత్రం. నేడు క్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవులందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు.
ప్రేమ,కరుణ ద్వారా మానవాళిలో ఆనందం నింపిన ఏసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలంతా సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు.
యేసు జన్మించిన శుభదినం రోజున.. ప్రతి ఇల్లు, ప్రతి గుండె ఆరోగ్యం, ఆనందంతో నిండాలని ఆ జీసెస్ కరుణా కటాక్షములు మీ పై కురవాలని ఆశిస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.
సర్వ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన యుగకర్త యేసు క్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండుగ దినం. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు నా శుభాకాంక్షలు.