New Delhi, DEC 19: మైక్రోసాఫ్ట్ మద్దతు కలిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ఓపెన్‌ఏఐ (OpenAI) మరో కొత్త సదుపాయం తీసుకొచ్చింది. ‘12 డేస్ ఆఫ్ ఓపెన్‌ఏఐ’ అనౌన్స్‌మెంట్స్‌లో భాగంగా తన ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీని (chatGPT) వాట్సప్‌లో అందుబాటులోకి తెచ్చింది. వేరే యాప్, అకౌంట్‌తో పనిలేకుండా నేరుగా వాట్సప్‌లోనే (Whatsapp) చాట్‌జీపీటీని వినియోగించొచ్చు. ఈ సేవలను ప్రపంచవ్యాప్తంగా ఓపెన్‌ఏఐ అందుబాటులోకి తెచ్చింది. +18002428478 నంబర్‌తో వాట్సప్‌లో చాట్ చేయొచ్చు.
మనం అడిగిన ప్రశ్నలకు చాట్‌జీపీటీ (ChatGPT) సమాధానాలు ఇస్తుంది. భారత్‌లోనూ దీన్ని వాడుకోవచ్చు. ఇదే నంబర్‌కు కాల్ చేసి కూడా చాట్‌జీపీటీ సేవలు పొందొచ్చు. అయితే, ప్రస్తుతానికి ఈ సేవలు కేవలం అమెరికా, కెనడాకు మాత్రమే పరిమితం.
You Can Chat With ChatGpt On WhatsApp
You can now talk to ChatGPT by calling 1-800-ChatGPT (1-800-242-8478) in the U.S. or by sending a WhatsApp message to the same number—available everywhere ChatGPT is. pic.twitter.com/R0XOPut7Qw
— OpenAI (@OpenAI) December 18, 2024
ప్రస్తుతం చాట్‌జీపీటీ సేవలను పొందాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. వాట్సప్‌లో అయితే ప్రత్యేకంగా అకౌంట్ అవసరం లేదు. అయితే, రోజువారీ వాడుకపై పరిమితి ఉంటుంది. పరిమితి దగ్గర పడ్డాక నోటిఫికేషన్ ద్వారా ఆ సమాచారం అందుతుంది. భవిష్యత్‌లో చాట్‌జీపీటీ సెర్చ్, ఇమేజ్ బేస్డ్ ఇంటరాక్షన్, కన్వర్జేషన్ మెమొరీ లాగ్స్ వంటి సదుపాయాలూ రానున్నాయి. మెటా సంస్థ సైతం వాట్సప్‌లో ఏఐ చాట్‌బాట్ సేవలను అందిస్తోంది. దానికి పోటీగా చాట్‌జీపీటీని మరింత మందికి చేరువ చేసేందుకు వాట్సప్‌లో సేవలకు ఓపెన్‌ఏఐ శ్రీకారం చుట్టింది.