New Model Kia Syros Car

Mumbai, DEC 20: కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ కియా..మరో ఎస్‌యూవీ సైరోస్‌ మాడల్‌ను పరిచయం చేసింది. నాలుగు మీటర్ల లోపు పొడువు కలిగిన ఈ మాడల్‌ కంపెనీ నుంచి విడుదలైన మూడో ఎస్‌యూవీ మాడల్‌ ఇదే కావడం విశేషం. 1.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ కలిగిన ఈ మాడల్‌లో ఆరు-స్పీడ్‌ మాన్యువల్‌, 7 స్పీడ్‌ డీసీటీ గేర్‌తో తీర్చిదిద్దింది. అలాగే 1.5 లీటర్ల డీజిల్‌ ఇంజిన్‌ కలిగిన మాడల్‌లో ఆరు స్పీడ్‌ మాన్యువల్‌ ఉన్నాయి.

Hyundai Creta EV: హ్యుందాయ్ క్రెటా ఎల‌క్ట్రిక్ వెహికిల్ మార్కెట్లోకి వ‌చ్చే తేదీ ఖరారు, మిడ్ రేంజ్ ఎస్ యూవీల్లో గ‌ట్టి పోటీ ఇవ్వ‌నున్న కారు 

అడ్వాన్స్‌ ఫీచర్స్‌తో తయారైన ఈ మాడల్‌లో 12.3 ఇంచుల టచ్‌స్క్రీన్‌, వైర్‌లెస్‌ యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, నాలుగు డిస్క్‌ బ్రేక్‌లతో ఏబీఎస్‌, ముందు-వెనుక పార్కింగ్‌ సెన్సార్‌ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. ఈ కారు ధర సంస్థ ప్రకటించక పోయినప్పటికీ ధర మాత్రం రూ.12 లక్షల నుంచి రూ.22 లక్షల లోపు ఉంటుందని అంచనా.