ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ క్రిస్మస్ వేడుక. ఈ వేడుకలను నిర్వహించుకునేందుకు ప్రతి ఒక్కరు తమ ఆత్మీయులకు బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. అందులో భాగంగా గ్రీటింగ్ కార్డ్స్ అనేది ప్రత్యేకమైన స్థానం పొందాయని చెప్పవచ్చు. మీరు కనుక మీ బంధుమిత్రులకు స్నేహితులకు సన్నిహితులకు క్రిస్మస్ పండుగ సందర్భంగా గ్రీటింగ్ కార్డులను అందజేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ పేర్కొన్నటువంటి డిజిటల్ ఫోటో గ్రీటింగ్స్ డౌన్లోడ్ చేసుకొని సోషల్ మీడియా ద్వారా వాటిని షేర్ చేసుకోవచ్చు. తద్వారా మీరు వారిని ఆనందింప చేసే అవకాశం ఉంది. ఈ డిజిటల్ గ్రీటింగ్స్ చక్కటి సందేశం తోనూ అదే విధంగా మంచి డిజైన్ తోను రూపొందించడం జరిగింది. వీటిని మీరు సులభంగా వాడుకోవచ్చు.

ప్రేమ మార్గంలో ఎవరి మనసునైనా జయించవచ్చునని తన జీవితం ద్వారా నిరూపించిన క్రీస్తు మార్గంలో నడుస్తూ సాటి మనిషికి మేలు చేయడమే మన ముందున్న కర్తవ్యం. ప్రేమ, కరుణ, సహనం, దయ, త్యాగ గుణాలను అలవాటు చేసుకుని జీవితాన్ని శాంతిమయం చేసుకుందాం. సర్వ మానవాళికి మేలు కలగాలని ప్రభువును ప్రార్థిద్దాం.

క్రిస్మస్ పండుగ సంధర్భంగా ఆ ఏసు ప్రభువు దీవెనలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు

క్రీస్తు బోధనలు సదా స్మరణీయం.. ఆచరణీయం.. క్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు

కత్తి కన్నా కరుణ, కక్షకన్నా క్షమాభిక్ష గొప్పదని చాటి చెప్పిన క్రీస్తు మార్గం అనుసరణీయం. సోదర, సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు

శాంతి, ప్రేమ పూర్వకమైన జీవన మార్గంలో సమాజాన్ని సంస్కరించిన క్రీస్తు జన్మదినం సర్వ మానవాళికీ పవిత్రదినం. క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు!