Information

Covid Updates in india: ఇండియాలో మరో ఏడు వ్యాక్సిన్లు, సౌతాఫ్రికా కరోనాపై పనిచేయని ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్, దేశంలో కొత్తగా 12,059 మందికి కోవిడ్, తెలంగాణలో తాజాగా 150 కేసులు, ఏపీలో 75 కొత్త కోవిడ్ కేసులు నమోదు

Hazarath Reddy

ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీతో కలిసి తాము అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ సౌతాఫ్రికా కొవిడ్ వేరియంట్ పై చాలా తక్కువ ప్రభావాన్నే చూపుతోందని ఆస్ట్రాజెనికా ప్రకటించింది.

Budget 2021: సెస్ అంటే ఏమిటి..పెరిగే ధరలు, తగ్గే ధరలు ఏంటో తెలుసా, మద్యం కొనాలంటే ఇక చుక్కలే, ముబైల్ ఫోన్ల ధరలు మరింత ప్రియం, సెస్ ద్వారా రూ. 30 వేల కోట్ల ఆదాయం, పెరిగే తగ్గే వాటిపై ఓ లుక్కేసుకోండి

Hazarath Reddy

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) సోమవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ పై (Budget 2021) భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరిని సెస్‌ అంశం కలవరపెడుతోంది.

Union Budget 2021 Key Points: దేశ‌వ్యాప్తంగా డిజిట‌ల్ ప‌ద్ధ‌తిలో జనాభా లెక్కింపు, 75 ఏళ్లు పైబడిన వారికి ఐటీ రిటన్స్‌ దాఖలు నుంచి మినహాయింపు, ఒకే దేశం... ఒకే రేషన్ కార్డు దేశ వ్యాప్తంగా అమలు, బడ్జెట్ 2021 కీ పాయింట్స్ ఇవే

Hazarath Reddy

ఆదాయ వనరుగా పెన్షన్ మాత్రమే ఉన్న సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో (Union Budget 2021) ఊరట కల్పించింది. వయో వృద్థులకు ఐటీ రిటన్స్‌ దాఖలు చేయడం నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్లో ప్రకటించారు. పెన్షన్‌, పన్ను ఆదాయాలు మాత్రమే కలిగిన 75 సంవత్సరాలకు పైబడిన వృద్ధులకు ఐటీ రిటన్స్‌ దాఖలు ( income-tax returns) చేయడం నుంచి ఈ మినహాయింపు వర్తిస్తుంది.

CBSE Board Exams 2021: సిబిఎస్‌ఇ 10, 12వ తరగతి పరీక్షలు, తేదీ వివరాలను ఫిబ్రవరి 2న ప్రకటించననున్న బోర్డు, సిబిఎస్‌ఇ డేట్ షీట్ 2021 కోసం ఎదురుచూస్తున్న 30 లక్షల మంది విద్యార్థులు

Hazarath Reddy

ఫిబ్రవరి 2 న అధికారిక సిబిఎస్‌ఇ తేదీ షీట్ 2021 లేదా సిబిఎస్‌ఇ టైమ్ టేబుల్ 2021 ను బోర్డు (CBSE Board Exams 2021) ప్రకటించనుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌లో సుమారు 30 లక్షల మంది విద్యార్థులు సిబిఎస్‌ఇ డేట్ షీట్ 2021 (CBSE Board Exams 2021 Datesheet) కోసం వేచి ఉన్నారు.

Advertisement

SC Stays Bombay HC Order: బాంబే హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు, తీర్పు ఆందోళనకరంగా ఉందంటూ కేకే వేణుగోపాల్ పిటిషన్, స్త్రీల ఎద బాగాలు దుస్తుల పైనుంచి తాకితే నేరం కాదంటూ తీర్పు ఇచ్చిన బాంబే హైకోర్టు

Hazarath Reddy

ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే (Chief Justice SA Bobde) హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వివాదాస్పదంగా మారిన అంశంపై తుది విచారణ ముగిసే వరకు స్టే విధిస్తున్నట్లు తెలిపారు.

Padma Awards 2021 Announced: 119 మందికి పద్మ అవార్డులు, ఇరవై తొమ్మిది మంది మహిళలకు ఈ ఏడాది అవార్డులు, మరణానంతరం పదహారు మందికి పద్మ అవార్డులు ప్రధానం, మొత్తం లిస్ట్ మీకోసం

Hazarath Reddy

పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. 119 మందికి పద్మ అవార్డులతో (Padma Awards 2021 Announced) కూడిన జాబితాను కేంద్ర ప్రభుత్వం. విడుదల చేసింది. వీరిలో ఏడుగురికి పద్మ విభూషణ్‌, 10 మందికి పద్మభూషణ్‌, 102 మందిని పద్మశ్రీ అవార్డులు వరించాయి. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు ప్రముఖులకు పద్మశ్రీలు రావడం విశేషం అని చెప్పుకోవచ్చు.

Republic Day Celebrations 2021: భారత గణతంత్ర దినోత్సవం 2021 వేడుకలకు సర్వం సిద్ధం, అబ్బురపరిచేలా సైనిక విన్యాసాలు, రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రధాన ఆకర్షణ కానున్న రఫేల్ యుద్ధ విమానాలు

Hazarath Reddy

న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌ 72వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైంది. 2021 జనవరి 26 న జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో భారత సైనిక శక్తి, సాంస్కృతిక వైవిధ్యం, సామాజిక మరియు ఆర్థిక పురోగతి వంటి అంశాలు ప్రధాన ఆకర్షణగా ప్రదర్శించబడతాయి. దేశీయ రక్షణ సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) లో భారతదేశం సాధించిన పురోగతిని ప్రపంచానికి ఈ వేడుకల ద్వారా భారత్ చాటి చెప్పనుంది.

National Voters' Day 2021: జాతీయ ఓటర్ల దినోత్సవం, నేటి నుంచే స్మార్ట్‌ఫోన్ ద్వారా ఓటరు గుర్తింపు కార్డు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

భారత్‌లో జనవరి 25వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని (National Voters’ Day) నిర్వహిస్తారు. దేశంలో ఎన్నికల కమిషన్ (Election Commission of India- ECI)ను ఏర్పాటు చేసిన సందర్భంగా నేషనల్ ఓటర్స్ డేను నిర్వహిస్తున్నారు.

Advertisement

AP Covid Report: కొత్త కరోనాతో చాలా డేంజర్, వేగంగా విస్తరిస్తున్న కోవిడ్ స్ట్రెయిన్, ఇప్పటికే 60 దేశాలకు విస్తరించిన యుకె కోవిడ్ స్ట్రెయిన్, హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు, ఏపీలో తాజాగా 173 మందికి కరోనా పాజిటివ్

Hazarath Reddy

క‌రోనా వైరస్‌లో వేగంగా కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీనిపై శాస్త్ర‌వేత్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్రజలకు వ్యాక్సిన్ వేయడంలో ఆల‌స్యం జ‌రిగితే కొత్త రకాల క‌రోనా వైర‌స్ లు పెరిగే అవ‌కాశం పెరుగుతుంద‌ని చెప్పారు.

Covaxin Fact Sheet: ఈ సమస్యలు ఉంటే వ్యాక్సిన్ తీసుకోవద్దు, ఫ్యాక్ట్ షీట్‌ను రిలీజ్ చేసిన భార‌త్‌ బ‌యోటెక్, టీకా తీసుకున్న ప్రాంతంలో నొప్పి, వాపు, దుర‌ద వ‌చ్చే అవ‌కాశాలు

Hazarath Reddy

కోవాగ్జిన్ టీకాపై విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో భార‌త్‌ బ‌యోటెక్ ఫార్మా సంస్థ ఫ్యాక్ట్ (Covaxin Fact Sheet) రిలీజ్ చేసింది. తాజాగా రిలీజ్ చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల్లో.. ఎవ‌రు టీకా తీసుకోవాలి, ఎవ‌రు తీసుకోవ‌ద్దు అనే అంశంపై క్లారిటీ (Covaxin Advisory) ఇచ్చింది. బ‌ల‌హీన‌మైన ఇమ్యూనిటీ ఉన్న వారు, రోగ‌నిరోధ‌క శ‌క్తి వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం చూపే మందులు వాడేవారు, అల‌ర్జీ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు .. కోవాగ్జిన్ టీకాను తీసుకోరాదు అని భార‌త్ బ‌యోటెక్ సంస్థ త‌న ఫ్యాక్ట్ షీట్‌లో వార్నింగ్ ఇచ్చింది.

COVID-19 Vaccine Side Effects: వ్యాక్సిన్ తీసుకున్న తరువాత గుండె దడ, అలర్జీ, తేలికపాటి జ్వరం, వెల్లడించిన ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా, రెండు రోజులు డాక్టర్ల పర్యవేషణలో కరోనా వారియర్లు

Hazarath Reddy

కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సజావుగా కొనసాగుతున్న వేళ ఢిల్లీలో కరోనా టీకా వేయించుకున్న 51 మంది కరోనా వారియర్లు స్వల్ప అస్వస్థతకు (COVID-19 Vaccine Side Effects) గురయ్యారు. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా శనివారం దేశవ్యాప్తంగా 1.91 లక్షల మందికిపైగా ఆరోగ్య రంగానికి చెందిన వారికి కరోనా టీకా వేశారు.

Covaxin Consent Form: వ్యాక్సిన్ వికటిస్తే నష్ట పరిహారం పొందే అవకాశం, కోవాగ్జిన్ టీకా తీసుకునేవారు నిబంధనలకు సమ్మతి తెలపాలి, సంబంధిత పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుందని తెలిపిన భారత్ బయోటెక్

Hazarath Reddy

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ ప్రారంభమైన నేపథ్యంలో భార‌త్ బ‌యోటెక్ సంస్థ వ్యాక్సిన్ తీసుకునే వారి కోసం కొన్ని నిబంధనలను ప్రవేశపెట్టింది. భార‌త్ బ‌యోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా తీసుకునేవారు సంబంధిత నిబంధనలకు తమ సమ్మతి తెలపాల్సి ఉంటుందని, సంబంధిత పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుందని సంస్థ తెలిపింది.

Advertisement

WhatsApp: యూజర్ల దెబ్బకి వెనక్కి తగ్గిన వాట్సప్, నూతన ప్రైవసీ విధానం అప్‌డేట్‌ మరో మూడు నెలల పాటు వాయిదా, మీ కాంటాక్ట్స్‌ని ఫేస్‌బుక్‌తో పంచుకోమని వెల్లడి

Hazarath Reddy

వాట్సాప్‌ తాజాగా తీసుకువచ్చిన నూతన ప్రైవసీ విధానంపై వెనక్కి తగ్గింది. మరో మూడు నెలల పాటు అప్‌డేట్‌ని వాయిదా వేయనున్నట్లు ప్రకటించింది. కాగా పది రోజుల క్రితం వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీ ( new privacy policy) నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటిని అంగీకరించకపోతే యూజర్‌ మొబైల్‌ ఫోన్లలో 2021, ఫిబ్రవరి 8 నుంచి వాట్సాప్‌ పని చేయదని ప్రకటించింది.

Bird Flu Outbreak: తొమ్మిది రాష్ట్రాల్లో హై అలర్ట్, వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత, మరిన్ని రాష్ట్రాలకు విస్తరించేందుకు రెడీ అవుతున్న బర్డ్ ఫ్లూ, అన్ని రాష్ట్రాలు అలర్ట్‌గా ఉండాలని కోరిన కేంద్రం

Hazarath Reddy

దేశంలో బర్డ్ ఫ్లూ కల్లోలం (Bird flu Outbreak) రేపుతోంది. మొత్తం తొమ్మిది రాష్ట్రాల్లో తన పంజాను విసిరింది. మరిన్ని రాష్ట్రాలకు విస్తరించేందుకు రెడీ అవుతోంది. ఉత్తర ప్రదేశ్, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్రలలో పక్షి ఫ్లూ వైరస్ ఇప్పుడు కలకలం (Maharashtra Among 9 States) రేపుతోంది.

ITR Filing For 2019-20: ఇన్‌కాం టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారా? జనవరి 10 చివరి తేది, గడువులోపు ఐటిఆర్ ఫైల్ చేయకపోతే భారీ జరిమానా, చివరి నిమిషంలో ఎలాంటి లోపాలు లేకుండా ఈ జాగ్రత్తలు పాటించండి

Team Latestly

కొవిడ్ నేపథ్యంలో పలు మార్లు ఐటిఆర్ దాఖలుకు గడువును పెంచిన తర్వాత చివరి గడువుగా జనవరి 10ని నిర్ణయించారు. గడువు తేదీ దాటితే ఐ-టి విభాగం నుండి జరిమానా విధించబడుతుంది. ఈ ఏడాది నుంచి ఆలస్యానికి చేసే జరిమానాను రూ.10,000 లకు పెంచారు....

COVID-19 Vaccination in India: కేంద్రం నుంచి శుభవార్త..జనవరి 13 నుంచి కరోనావైరస్ వ్యాక్సిన్ పంపిణీ, కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీకి సిద్ధంగా ఉన్నామని తెలిపిన తెలుగు రాష్ట్రాలు

Hazarath Reddy

భారతదేశంలో కరోనావైరస్‌ వ్యాక్సిన్‌ పంపిణీ ఈ నెల 13 నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. డ్రైరన్‌ ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా వాక్సినేషన్‌ను (COVID-19 Vaccine First Dose in India) ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.

Advertisement

India Covid Update: కోవిషీల్డ్ వ్యాక్సిన్ కొనాలంటే రూ. 400-రూ.600 పెట్టాలి, ధరల వివరాలను వెల్లడించిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పూనావాలా, దేశంలో తాజాగా 16,375 మందికి కరోనా పాజిటివ్

Hazarath Reddy

కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల (India Covid Update) చేసింది. దేశంలో గత 24 గంటల్లో 16,375 మందికి కరోనా నిర్ధారణ (COVID-19 Cases in India) అయింది. అదే స‌మ‌యంలో 29,091 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,56,845కు చేరింది.

LPG Refill booking: ఒక్క మిస్‌డ్ కాల్‌తో గ్యాస్ బుకింగ్, 84549 55555 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే రీఫిల్‌ సిలిండర్‌ బుక్‌, ఎలాంటి కాల్‌ ఛార్జీలు పడవు, మిస్డ్ కాల్ సదుపాయాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్

Hazarath Reddy

ఇప్పటిదాకా గ్యాస్ బుకింగ్ కోసం ఫోన్ చేస్తే అవతలి వారు రిసీవ్ చేసుకోవడం తద్వారా సమయం వేస్ట కావడం లాంటివి జరుగుతుండేవి, అయితే ఇప్పుడు దీనికి ముగింపు పలుకుతూ కేవలం ఫోన్‌ మిస్డ్‌ కాల్‌తోనే ఎల్పీజీ రీఫిల్‌ బుకింగ్‌ సదుపాయం ఇండేన్‌ గ్యాస్‌ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వినియోగదారులైనా సరే 845455555 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే రీఫిల్‌ సిలిండర్‌ బుక్‌ అవుతుందని ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

New CJ to AP High Court: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ గోస్వామి, ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, సిక్కిం హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, పదవీ విరమణ చేసిన హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి రాకేష్ కుమార్

Hazarath Reddy

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ గోస్వామి నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారు. ఇందుకు సంబంధించిన గెజిట్‌ను కేంద్ర న్యాయశాఖ గురువారం విడుదల చేసింది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ జస్టిస్‌ జితేంద్ర కుమార్ మహేశ్వరీ బదిలీపై కూడా కేంద్ర న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి నోటిఫికేషన్‌ జారీ చేశారు.

New Covid Strain in India: భారత్‌లో మొదలైన కొత్త కరోనావైరస్ కల్లోలం, ఆరుమందికి కొత్త కోవిడ్ స్ట్రెయిన్ పాజిటివ్, హైదరాబాద్‌లో ఇద్దరికి పాజిటివ్, నెల రోజుల్లో యూకే నుంచి 33 వేల మంది ప్రయాణికులు ఇండియాకు

Hazarath Reddy

భారత్‌లోకి కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రవేశించింది. కోవిడ్‌-19 పరీక్షలో భాగంగా ఆరుగురికి ఈ వైరస్‌ సోకినట్లు నిర్దారణ (New Covid Strain in India) అయ్యింది. కాగా గత నెల రోజులలో యూకే నుంచి 33 వేల మంది ప్రయాణికులు ఇండియాకు వచ్చారు. వీరిలో 114 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

Advertisement
Advertisement