News

Faridabad Shocker: వీడియో ఇదిగో, లైబ్రరీ నుండి తిరిగి వస్తున్న బాలికపై దుండగుడు కాల్పులు, హర్యానాలో నడిరోడ్డుపై దారుణ ఘటన

Team Latestly

హర్యానాలోని ఫరీదాబాద్ నగరంలో ఒక దుండగుడు నడిరోడ్డుపై 17 ఏళ్ల బాలికపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటన నగరంలోని ఒక ప్రైవేటు లైబ్రరీ వెలుపల చోటు చేసుకుంది. వీరిద్దరు నిత్యం ఆ లైబ్రరీకి వస్తున్నట్లు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను బట్టి తెలుస్తోంది.

Health Alert: ఈ 7 లక్షణాలు కనపడితే జాగ్రత్త, పురుషుల శరీరంలో క్యాన్సర్ ముదురుతున్న సంకేతాలు కావచ్చు, వెంటనే అలర్ట్ కాకుంటే ప్రాణాలకే ప్రమాదం

Team Latestly

మనలో చాలామంది క్యాన్సర్ అనేది కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే వస్తుందని భావిస్తారు. కానీ వైద్య పరిశోధనలు చెప్పే దాని ప్రకారం కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర లేకపోయినా, జీవనశైలి, వయస్సు, ఆహారపు అలవాట్లు, పర్యావరణ ప్రభావాలు వంటి అంశాలు భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి.

Digital Arrest Scam Alert: ఆ కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎత్తకండి, డిజిటల్ అరెస్ట్ స్కాంలపై ఎన్పీసీఐ హెచ్చరిక, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి ఫిర్యాదు చేయాలని వెల్లడి

Team Latestly

దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజా ప్రకటనతో ప్రజలకు ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో జరుగుతున్న కొత్త తరహా మోసాలు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని NPCI స్పష్టం చేసింది.

India’s Hidden Health Crisis: భారత్‌లో భారీగా పెరుగుతున్న అంటువ్యాధులు, ఐసీఎంఆర్‌ నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి.. అలర్ట్ కాకుండా అంతే సంగతులిక..

Team Latestly

భారతదేశంలో అంటువ్యాధుల వ్యాప్తి క్రమంగా పెరుగుతున్నట్లు భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) తాజా నివేదిక స్పష్టం చేసింది. ప్రజారోగ్యానికి కీలకమైన వైరల్‌ ఇన్ఫెక్షన్లను గుర్తించే లక్ష్యంతో ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలోని వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ లాబొరేటరీస్ (VRDL) నెట్‌వర్క్‌ దేశవ్యాప్తంగా సేకరించిన నమూనాలపై విశ్లేషణ జరిపింది

Advertisement

Tamil Nadu Shocker: తమిళనాడులో దారుణం, కాలేజీ విద్యార్థినిని కిడ్నాప్‌ చేసి ముగ్గురు వ్యక్తులు, ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో లాక్కెళ్లి సామూహిక అత్యాచారం

Team Latestly

తమిళనాడులో దారుణ ఘటన వెలుగుచూసి కలకలం రేపింది. కేరళ సరిహద్దుకు సమీపంలోని కోయంబత్తూరులో ఓ ప్రైవేట్‌ కాలేజీలో పీజీ చదువుతున్న విద్యార్థినిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి ఆ యువతి తన స్నేహితుడితో కలిసి కారులో బయలుదేరింది.

ICC Women’s World Cup 2025: తొలిసారి వన్డే ప్రపంచకప్‌ కైవసం చేసుకున్న భారత్, దేవుని ప్రణాళిక అంటూ హృదయానికి హత్తుకునే పోస్ట్ పెట్టిన షఫాలీ వర్మ, అభినందనల వెల్లువ

Team Latestly

ఎప్పటినుంచో ఊరిస్తూ వస్తున్న వన్డే ప్రపంచకప్‌ ట్రోఫీ ఎట్టకేలకు భారత్‌ దరిచేరింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి టీమ్‌ఇండియా విశ్వవిజేతగా నిలిచింది. షెఫాలీవర్మ, దీప్తిశర్మ అర్ధసెంచరీలతో భారీ స్కోరు అందుకున్న భారత్‌..స్ఫూర్తిదాయక పోరాటంతో కదంతొక్కింది. లక్ష్యఛేదనలో సఫారీ కెప్టెన్‌ లారా వోల్వార్డ్‌ సెంచరీ పోరాటం సఫలం కాలేకపోయింది.

Jaipur Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, మద్యం మత్తులో రోడ్డు పక్కన ఆగి ఉన్న వాహనానాలను ఢీకొట్టుకుంటూ వెళ్లిన ట్రక్ డ్రైవర్,10 మంది మృతి, 50 మందికి గాయాలు

Team Latestly

రాజస్థాన్‌లోని జైపూర్‌లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ ట్రక్ డ్రైవర్ లోహమండి రోడ్‌పై ఆగి ఉన్న అనేక వాహనాలను బీభత్సంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

Chevella Bus Accident: టిప్పర్ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడం వ‌ల్లే బస్సు ప్ర‌మాదం, చేవెళ్ల బస్సు ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి, 20 మంది మృతి, మరికొందరికి తీవ్ర గాయాలు

Team Latestly

రంగారెడ్డి జిల్లాలో సోమవారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చేవెళ్ల మండలం పీర్జాగూడ ఆర్టీసీ బస్సును కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్‌ లారీ ఢీ కొట్టి బస్సు మీద బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందారు. క్షతగాత్రులకు చికిత్స అందుతుండగా.. వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Advertisement

Kasibugga Stampede: కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొక్కిసలాట, తొమ్మదిమంది మృతి, మరికొందరికి గాయాలు,  ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు

Team Latestly

శ్రీకాకుళంలో(Srikakulam) జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో(Kashibugga Temple) తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో పది మందికి గాయపడినట్టు సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కార్తీక మాసం నేపథ్యంలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.

Accident Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో..మూడేళ్ల పాప పైకి దూసుకెళ్లిన కారు, అయినా కూడా దెబ్బలు తగలకుండా కారు కింద నుండి మెల్లిగా బయటకు..

Team Latestly

అహ్మదాబాద్‌లోని నోబెల్‌నగర్ ప్రాంతంలో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన సిసిటివిలో రికార్డైంది. ఇందులో ఒక టీనేజర్ నడుపుతున్న కారు ఢీకొట్టడంతో మూడేళ్ల బాలిక తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో, వేగంగా వస్తున్న నంబర్ ప్లేట్ లేని కారు ఆమెపైకి దూసుకెళ్లింది.

ICC Women's World Cup 2025: మూడోసారి ఫైనల్లోకి అడుగుపెట్టిన భారత మహిళలు, వన్డే ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన బ్లూ ఉమెన్స్, శతకంతో ఆసీస్ బౌలర్ల భరతం పట్టిన జెమీమా రోడ్రిగ్స్‌

Team Latestly

నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్టేడియంలో గురువారం రాత్రి భారత మహిళల జట్టు చరిత్ర రాసింది. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదిస్తూ, భారత మహిళలు మూడోసారి ఫైనల్లోకి అడుగుపెట్టారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాపై భారత్‌ 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.

India Winning Moment Video: భారత మహిళల విన్నింగ్ మూమెంట్ వీడియో ఇదిగో, అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత మహిళా క్రికెట్ జట్టు, ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 ఫైనల్లోకి..

Team Latestly

అక్టోబర్ 31న నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియాపై గెలిచి ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 ఫైనల్లోకి అడుగుపెట్టింది. ప్రేక్షకులతో కిటకిటలాడిన స్టేడియంలో ఆ రాత్రి భారత జట్టు ఆట ఒక మాయాజాలం లా మారింది.భారీ స్కోరు ఛేజ్ చేయాల్సిన పరిస్థితిలో కూడా భారత మహిళలు ధైర్యంగా పోరాడారు.

Advertisement

Prince Andrew: బ్రిటన్ రాజకుటుంబంలో లైంగిక ఆరోపణల కలకలం, ప్రిన్స్ ఆండ్రూపై కఠిన నిర్ణయం తీసుకున్న కింగ్ చార్ల్స్ III, రాచరిక బిరుదులన్నీ రద్దు, ప్యాలెస్ ఖాళీ చేయమని ఆదేశాలు

Team Latestly

బ్రిటన్ రాజకుటుంబంలో మరోసారి సంచలనం రేగింది. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో గత కొన్నేళ్లుగా వివాదాల్లో చిక్కుకున్న ప్రిన్స్ ఆండ్రూపై రాజు చార్ల్స్ III కఠిన నిర్ణయం తీసుకున్నారు. రాచరిక బిరుదులను రద్దు చేయడంతో పాటు, ఆయనకు విండ్సర్ ప్యాలెస్ పరిసర ప్రాంతంలో ఉన్న విలాసవంతమైన నివాసాన్ని కూడా ఖాళీ చేయమని ఆదేశించారు

Blood Pressure Variability: మీ బీపీ తరచూ మారుతుందంటే మెదడుకు పెను ముప్పు తప్పదు, తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి, చికిత్స విధానం ఏంటంటే..

Team Latestly

వయసు పైబడిన వారిలో రక్తపోటు (బీపీ) తరచూ హెచ్చుతగ్గులకు గురవుతుంటే.. అది మెదడు ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదమని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరిస్తోంది. సగటు రక్తపోటు సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ.. బీపీలో తరచుగా జరిగే స్వల్పకాలిక మార్పులు మెదడు కణాల పనితీరును దెబ్బతీసి, మెదడు పరిమాణం క్రమంగా తగ్గిపోవడానికి కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

Ikkis Trailer Out: ఇక్కీస్‌ ట్రైలర్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.. హీరోగా అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్ జీవిత చరిత్ర ఆధారంగా మూవీ

Team Latestly

భారత సైన్యంలో అత్యంత వీరోచిత సాహసాలను ప్రదర్శించి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం‘ఇక్కీస్’ (Ikkis). ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో దేశభక్తి భావాలను రగిలిస్తోంది.

Shreyas Iyer: గాయం తర్వాత మొదటిసారిగా స్పందించిన భారత వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, కోలుకునే దశలో ఉన్నానని వెల్లడి, అభిమానుల మద్దతుకు ధన్యవాదాలు తెలుపుతూ నోట్

Team Latestly

సిడ్నీలో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మూడో వన్డేలో తీవ్రమైన గాయానికి గురైన తర్వాత భారత వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మొదటిసారిగా స్పందించారు. ప్లీహ (spleen) గాయం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రస్తుతం ఐసీయూ నుంచి బయటకు వచ్చి కోలుకునే దశలో ఉన్నారని తెలిపారు.

Advertisement

Amazon Layoffs: అమెజాన్‌లో భారీగా ఉద్యోగాల తొలగింపులు, సీనియర్ స్థాయి అధికారులతో కలిపి దాదాపు 14 వేల మంది బయటకు, ఏఐ రాకతో ఉద్యోగులకు దినదిన గండం

Team Latestly

అమెజాన్‌లో భారీగా ఉద్యోగాల తొలగింపులు ప్రారంభమైనట్లు సమాచారం. ఈ సారి సీనియర్ స్థాయి అధికారులను కూడా కలుపుకొని దాదాపు 14 వేల మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారని నివేదికలు చెబుతున్నాయి.

US Work Permit Auto-Renewal Ends: అమెరికాలో వేలాది మంది భారతీయ ఉద్యోగులపై ట్రంప్ మరో పిడుగు.. వర్క్‌ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్స్‌ రద్దు, పూర్తి వివరాలు ఇవిగో..

Team Latestly

వలసదారులపై కఠిన విధానాలు అమలుచేస్తోన్నఅగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కారు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వలస కార్మికుల ఉపాధి అధికారం పత్రాల (Employment Authorization Documents - EAD) ఆటోమేటిక్ పొడిగింపును ఇకపై కొనసాగించబోమని అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ (DHS) ప్రకటించింది.

Hurricane Melissa: కరీబియన్ దీవుల్లో బీభత్సం సృష్టిస్తోన్న అత్యంత భయంకరమైన హరికేన్ మెలిస్సా, వీధులన్నీ వరదలతో నిండిపోవడంతో పాటుగా నీటిలో మునిగిపోయిన కార్లు

Team Latestly

మంగళవారం, అక్టోబర్ 28న జమైకాలో తుఫాను మెలిస్సా తీరాన్ని తాకింది. తీరాన్ని తాకుతూనే విపత్కర గాలులు, కుండపోత వర్షం, భారీ తుఫానును తీసుకువచ్చింది. కేటగిరీ 5 హరికేన్ మాండెవిల్లే, బ్లాక్ రివర్, మాంటెగో బే వంటి ప్రదేశాలలో విధ్వంసం సృష్టించింది. చర్చి, ఇళ్ళు ధ్వంసమయ్యాయి.

Helmet Rule Violation: వైరల్ వీడియో ఇదిగో, హెల్మెట్ లేకుండా స్కూటర్ నడిపిన ట్రాఫిక్ పోలీసుకు షాక్‌, కుర్రాడి దెబ్బకు రూ.2 వేల ఫైన్‌ విధించిన అధికారులు

Team Latestly

థానేలో చోటుచేసుకున్న వైరల్ వీడియో ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో వాగ్వాదం చేస్తూ కనిపించాడు. విచారణలో తెలిసిన వివరాల ప్రకారం, ఆ వ్యక్తికి గతంలో హెల్మెట్ లేకుండా వాహనం నడిపినందుకు జరిమానా విధించబడింది, దానిపట్ల అతనికి పగ పెరిగి, మళ్లీ అదే అధికారిని ఎదుర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement