Covid-19 in Telugu States: తెలంగాణలో 33 కోవిడ్-19 పాజిటివ్ కేసులు, ఏపీలో ఏడు కరోనా పాజిటివ్ కేసులు, లాక్‌డౌన్ రూల్స్ పాటించకుంటే కఠిన చర్యలు, హెచ్చరించిన ఇరురాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra pradesh) కొత్తగా మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో ఏపీ కరోనా కేసుల సంఖ్య ఏడుకు చేరింది. అలాగే తెలంగాణ (Telangana) కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33కు చేరింది. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ (Eatala Rajender) మీడియా ముఖంగా వెల్లడించారు. అయితే.. ఎవరికీ కూడా సీరియస్‌గా లేదని తెలిపారు.
Hyderabad, Mar 23: రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా (Covid-19 in Telugu States) చాపకింద నీరులా విస్తరించుకుంటూ వెళుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో (Andhra pradesh) కొత్తగా మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో ఏపీ కరోనా కేసుల సంఖ్య ఏడుకు చేరింది. అలాగే తెలంగాణ (Telangana) కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33కు చేరింది. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ (Eatala Rajender) మీడియా ముఖంగా వెల్లడించారు. అయితే.. ఎవరికీ కూడా సీరియస్‌గా లేదని తెలిపారు.
కరోనా భయం, సుప్రీంకోర్టు పాక్షిక మూసివేత
ఏపీలో విశాఖపట్నంలో లండన్ నుంచి వచ్చిన యువకుడికి కొత్తగా కరోనా వైరస్ సోకినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్ధారించింది. ఈ విషయాన్ని మంగళవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో ఏపీ కరోనా కేసుల సంఖ్య ఏడుకు చేరింది. రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. సరైన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని తెలిపింది.
దేశంలో ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య, పాజిటివ్ కేసులు 415
మరోవైపు రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో మార్చి 31వరకు లాక్‌డౌన్ ప్రకటించారు. అంతేకాకుండా క్షేత్ర స్థాయిలో ప్రజలు లాక్‌డౌన్ పాటించేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రజలు లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు.
మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మీరే కాపాడుకోండి: ప్రధాని మోదీ
కాగా తెలంగాణలో ఇంకా 97 మంది అనుమానితులు ఉన్నారనీ వారి పరీక్షల నివేదిక ఇంకా రావాల్సి ఉందని మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.ఇదిలా ఉంటే సోమవారం ఒక్క రోజే ఆరు కేసులు బయటపడ్డాయి. అయితే ఇప్పటిదాకా కరోనా వైరస్ తో ఒక్కరు కూడా తెలంగాణలో చనిపోలేదని ఈటెల రాజేందర్ చెప్పారు. ఒక్కరు కూడా వెంటిలేటర్ మీద లేరని ఇప్పటికే మొదటి కేసును డిశ్చార్జీ చేశామని, ఒకటి రెండు రోజుల్లో మరింత మందిని డిశ్చార్జీ చేస్తామని చెప్పారు.
Here's Minister for Health Telangana Tweet
మార్చి 31 వరకు తెలంగాణ లాక్‌డౌన్
ఇక గాంధీ, కింగ్ కోఠీ, చెస్ట్, ఫీవర్ ఆస్పత్రుల్లో ఓపీ సేవలను నిలిపేశారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కరోనా చికిత్సకు తమ వంతు సయం చేయనున్నాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి రెండో దశకు చేరుకోవడం వల్లే లాక్‌డౌన్ ప్రకటించి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని ఈటల చెప్పారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్నందునే ప్రైవేట్ కాలేజీల్లోని ఐసీయూ, ఐసోలేషన్ బెడ్లను అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు.
రాష్ట్రప్రజలంతా దయచేసి లాక్‌డౌన్ నిబంధనలను పాటించాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ప్రజలెవరూ బయట తిరగొద్దని సూచించారు. క్యాబ్స్ బుక్ చేసుకోవద్దని అన్నారు..ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంబులెన్స్‌లలో జనాలను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఓలా, ఉబర్ సంస్థలు కూడా క్యాబ్స్ నడిపిస్తే కేసులు వేస్తమని సీపీ హెచ్చరించారు.
లాక్‌డౌన్ పట్టని జనం, నిత్యావసరాల కోసం మార్కెట్లలో రద్దీ
చెక్‌పోస్టుల దగ్గర తనిఖీలు ముమ్మరం చేసామని, పిల్లల్ని కూడా ఇండ్లకే పరిమితం చేయాలని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడొద్దు. నిత్యవసర సరుకులు అమ్మే షాపులైనా సాయంత్రం 7 నుంచి మూసివేయాలని ఉదయం 6 గంట నుంచి 7 గంటల వరకు షాపులు తెరవాలి. ఫుడ్ డెలివరీ ఆర్డర్లు కూడా సాయంత్రం 6 గంటలలోపే మూసివేయాలన్నారు. ప్రజలు ఊళ్ల ప్రయాణాలు మానుకోవాలని సీపీ సూచించారు.