crime-scene (Rep Image)

Lucknow, Jan 7: యూపీలోని హర్దోయ్ లో 36 ఏళ్ల మహిళ తన భర్తను, ఆరుగురు పిల్లలను వదిలి బిచ్చగాడితో పారిపోయింది.ఆరుగురు పిల్లల తల్లి భిక్షాటనకు పొరుగింటికి వచ్చిన చిన్న పండిట్‌తో ప్రేమలో పడింది. అనంతరం అతడితో కలిసి వెళ్లిపోయింది. ఈ ఘటనపై మహిళ భర్త, 45 ఏళ్ల రాజు, ఇండియన్ జ్యుడీషియల్ కోడ్ సెక్షన్ 87 కింద పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.నిందితుడి కోసం గాలిస్తున్నారు.

దారుణం, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఎలా ఈడ్చుకెళుతున్నారో చూడండి, మీరు మనుషులేనా అంటూ మండిపడుతున్న నెటిజన్లు

హ‌ర్దోయ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హ‌ర్ప‌ల్‌పుర్ లో జీవిస్తున్న 45 ఏళ్ల రాజుకు.. రాజేశ్వ‌రి అనే భార్య ఉన్న‌ది.వీరికి ఆరుగురు పిల్ల‌లు ఉన్నారు. అయితే నానే పండిత్ అనే బిచ్చ‌గాడు ఆ ఇంటి ప‌రిస‌రాల్లో అడుక్కునేవాడు. ఆ సమయంలో భార్య రాజేశ్వ‌రితో ప్రేమలో పడ్డాడు. జ‌న‌వ‌రి 3వ తేదీన మ‌ధ్యాహ్నం 2 గంట‌ల స‌మ‌యంలో.. బ‌ట్ట‌లు, కూర‌గాయ‌లు కొనేందుకు మార్కెట్‌కు వెళ్తున్న‌ట్లు కూతురు ఖుష్బూకు రాజేశ్వ‌రి చెప్పి వెళ్లింద‌ని ఆమె భర్త తన ఫిర్యాదులో తెలిపాడు.

భార్య తిరిగి రాక‌పోవ‌డంతో ఆమె కోసం వెతికినా జాడలేదు. ఓ బ‌ర్రెను అమ్మితే వ‌చ్చిన డ‌బ్బుల‌తో త‌న భార్య వెళ్లిపోయిన‌ట్లు రాజు ఫిర్యాదులో పేర్కొన్నాడు. నానే పండిట్ అనే బిచ్చ‌గాడు త‌న భార్య‌ను తీసుకెళ్లి ఉంటాడ‌ని రాజు అనుమానం వ్య‌క్తం చేశాడు. నానే పండిట్ కోసం గాలిస్తున్న‌ట్లు పోలీసులు చెప్పారు. బీఎన్ఎస్‌లోని సెక్ష‌న్ 87 కింద ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. ఆ చ‌ట్టం ప్రకారం నిందితుడికి ప‌దేళ్ల వ‌ర‌కు జైలుశిక్ష ప‌డే అవ‌కాశం ఉంటుంది.