All set for 2025 Womens Premier League(BCCI X)

Hyd, January 8:  2025 క్రికెట్ అభిమానులను అలరించేందుకు రెడీ అవుతోంది మహిళల ప్రీమియర్ లీగ్(WPL). ఇప్పటివరకు రెండు సీజన్లు పూర్తి చేసుకోగా తాజాగా మూడో సీజన్‌కు సర్వం సిద్ధమైంది. వేలం ప్రక్రియ పూర్తికావడంతో మ్యాచ్‌ వేదికలను ఖరారు చేసింది బీసీసీఐ.

ఈసారి లక్నో ,బరోడాలో మ్యాచ్‌లు జరగనుండగా ఇందుకు సంబంధించి బీసీసీఐ అధికారిక ప్రకటన చేయనుంది. ఫిబ్రవరిలో టోర్నమెంట్ ప్రారంభంకానుండగా మార్చి 8 లేదా 9న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ఫైనల్‌కి బరోడా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఏడాది టోర్నమెంట్‌లో సుమారు 23 మ్యాచ్‌లు ఉండనున్నాయి. ఇందులో లీగ్ దశ, నాక్ అవుట్స్ గ్రాండ్ ఫైనల్ ఉంటాయి. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి టైటిల్ గెలవాలని ఫ్యాన్స్‌ ఎన్నో ఆశలతో ఉన్నారు.  మొహమ్మద్ షమీని ఏం చేశారు, ఆందోళనకర ప్రశ్నలు లేవనెత్తిన టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి, మద్దతుగా నిలిచిన ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్

2023లో ప్రారంభమైన WPL మొదటి సీజన్ మొత్తం ముంబైలో నిర్వహించగా 2024 సీజన్ బెంగళూరు,ఢిల్లీలో మ్యాచ్‌లు నిర్వహించారు. ఈసారి బరోడా, లక్నోలో మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.