H-1B Visa | Representative Image (Photo Credits: X /@MMDS1977)

Washington, JAN 05: అమెరికాలో సేవలందిస్తున్న భారత సంతతి ఐటీ సంస్థలకు అమెరికా ఇమ్మిగ్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఐదోవంతు హెచ్‌1- బీ వీసాలు (H1B Visas) మాత్రమే జారీ చేసింది. అందులో భారత ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్‌ (Infosys), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS)లకు ప్రధాన వాటా లభించింది. యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ గణాంకాల ప్రకారం గతేడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్ వరకూ మొత్తం 1.3 లక్షల హెచ్‌1- బీ వీసాల్లో సుమారు 24,766 వీసాలు మాత్రమే భారత సంతతి ఐటీ సంస్థలకు లభించాయి. ఇన్ఫోసిస్‌కు 8,140, టీసీఎస్‌కు 5,274 వీసాలు మాత్రమే వచ్చాయి. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్- అమెరికాలో పని చేస్తున్న భారత వృత్తి నిపుణులకు 2,953 వీసాలు వచ్చాయి. మొత్తం హెచ్‌1- బీ వీసాల కేటాయింపులో ఇన్ఫోసిస్‌ రెండో స్థానంలో నిలిచింది.

Plane Crash On Building: అమెరికాలో భవనంపై కూలిన విమానం.. ఇద్దరు మృతి.. 18 మందికి గాయాలు (వీడియో) 

అమెరికా ఈ-కామర్స్‌ జెయింట్‌ అమెజాన్‌కు 9,265 వీసాలు.. గతంలో చెన్నై కేంద్రంగానూ ప్రస్తుతం న్యూ జెర్సీ కేంద్రంగా హెడ్‌ క్వార్టర్స్‌ గల కాగ్నిజెంట్‌ సంస్థకు 6,321 వీసాలు మంజూరయ్యాయి. అమెరికాలోని ఐటీ కంపెనీల్లో పని చేసేందుకు ప్రత్యేక వృత్తి నిపుణులు ప్రతియేటా జారీ చేసే తాత్కాలిక వీసా ప్రోగ్రామ్‌ హెచ్‌1- బీ వీసా. భారత ఐటీ దిగ్గజ సంస్థలు ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, విప్రోలు అత్యధికంగా ఈ వీసాలు పొందుతుంటాయి. వీటితోపాటు టెక్ మహీంద్రా (Tech Mahindra) కూడా అమెరికాలో సేవలందిస్తోంది. కానీ, ఈ ఏడాది విప్రోకు కేవలం 1634, టెక్ మహీంద్రాకు 1199 వీసాలు మాత్రమే మంజూరు అయ్యాయి. భవిష్యత్‌లో అమెరికాలో వ్యాపారాల అవసరాలు, విస్తృత వీసా పాలసీ సంస్కరణలను బట్టే హెచ్‌1బీ వీసాలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి.

H-1B Visa: విదేశాల్లో పనిచేసేవారికి అలర్ట్, H-1B ఫైలింగ్ కోసం కొత్త ఫారమ్‌ను విడుదల చేసిన US, వివరాలు ఇవిగో.. 

తొలుత అమెరికా అధ్యక్షుడిగా పని చేసిన కాలంలో డొనాల్ట్ ట్రంప్‌.. హెచ్‌1బీ వీసాల జారీ ప్రక్రియను కఠినతరం చేశారు. కానీ, ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన ట్రంప్‌.. తన మద్దతుదారు – టెస్లా సీఈఓ ఎలన్‌మస్క్‌ చేసిన వ్యాఖ్యలకు మద్దతునిచ్చారు. అమెరికా కోసం కష్టపడి పని చేసే వారికి స్వాగతం పలుకుతామని ఎలన్‌ మస్క్ వ్యాఖ్యానించారు. ఎలన్‌మస్క్‌ సారధ్యంలోని టెస్లా కంపెనీ కూడా అత్యధికంగా విదేశీ నిపుణులపైనే ఆధార పడి పని చేస్తోంది.