Hyd, January 8: డిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాటలో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న తొమ్మిదేళ్ల బాలుడిని పరామర్శించడానికి టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ మంగళవారం ఉదయం కృష్ణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(కిమ్స్)ను సందర్శించారు.
సంధ్య థియేటర్‌లో తొక్కిసలాటలో బాలుడి తల్లి ఎం రేవతి మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బన్నీపై కేసు నమోదుకాగా ఇటీవలె న్యాయస్థానం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.
ఈ నేపథ్యంలో పోలీసుల అనుమతితో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించారు బన్నీ. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాలుడు కోలుకుంటున్నాడని చికిత్సకు స్పందిస్తున్నారని డాక్టర్లు తెలిపారు. సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబు..రంగంపేటలోని విద్యానికేతన్‌లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న మోహన్ బాబు
బాలుడి తండ్రి ఎం. భాస్కర్‌తో దాదాపు 10 నిమిషాలు మాట్లాడారు అర్జున్. రేవతి మృతిపై సంతాపం తెలిపారు. ఎలాంటి అవసరం వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వాస్తవానికి జనవరి 5న అర్జున్..బాలుడిని పరామర్శించేందుకు ప్రయత్నించగా పోలీసుల నోటీసులతో ఆగిపోవాల్సి వచ్చింది. తాజాగా పోలీసులు అనుమతి ఇవ్వడంతో బాలుడిని పరామర్శించారు.