Nampally Court granted regular bail for Allu Arjun(X)

Hyderabad, Jan 7: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి అక్కడ చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ (Sreetej) ను ఆయన పరామర్శిస్తారు. కిమ్స్‌ కు వెళ్లే ముందు తమకు సమాచారం ఇవ్వాలని అల్లు అర్జున్‌ కు రాంగోపాల్‌పేట పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన సమాచారం అందించడంతో ఆసుపత్రి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

తెలంగాణలో సవరించిన ఓటరు జాబితా ఇదిగో, రాష్ట్రంలో మొత్తం 3,35,27,925 మంది ఓటర్లు,శేరిలింగంపల్లిలో అత్యధికంగా 7,65,982 మంది ఓటర్లు

Here's Video

ఇదీ కారణం

‘పుష్ప-2’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కిమ్స్‌ లో చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్‌ ను ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. అల్లు అర్జున్ కూడా తనవంతు సాయం అందించారు.

ఫార్ములా ఈ-కారు రేస్‌ కేసులో కేటీఆర్‌ కు హైకోర్టులో ఊరట దక్కేనా?? క్వాష్‌ పిటిషన్‌ పై తీర్పు నేడే.. కోర్టు ఏం చెప్పనుంది? సర్వత్రా ఉత్కంఠ